జాతీయ వార్తలు

జిఎస్‌టి గెలిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: పన్నుల సంస్కరణల భారత దేశం చారిత్రక శకంలోకి అడుగు పెట్టింది. ఎన్డీయే సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జిఎస్‌టి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇటీవల రాజ్యసభ కొన్ని సవరణలతో చేపట్టిన వస్తు,సేవల పన్ను (జిఎస్‌టి) 122 రాజ్యాంగ సవరణ బిల్లును సుదీర్ఘ చర్చ అనంతరం సోమవారం లోక్‌సభ ఆమోదించింది. దీనితో పార్లమెంట్ ఆమోద ప్రక్రియ పూర్తయింది. ఇంతకు ముందు ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ప్రధాని మోదీ అన్ని వర్గాల ప్రజలకూ ఈ బిల్లు మేలు చేస్తుందన్నారు. ఈ విధానంలో వినియోగదారుడే రాజని అభివర్ణించారు. అలాగే దేశ ప్రజలకు పన్నుల ఉగ్రవాదం నుంచి విముక్తీ కలుగుతుందని ఉద్ఘాటించారు. రాజ్యసభ ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లుపైనే లోక్‌సభలో మరోసారి చర్చ జరిగింది. ఒకే దేశం, ఒకే పన్ను విధానం ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం చేస్తుందని ప్రధాని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిఎస్‌టిని వ్యతిరేకించిన తాను ప్రధాన మంత్రిగా దాని ప్రాధాన్యతను అర్థం చేసుకున్నానని చెప్పారు. జిఎస్‌టి అన్ని పార్టీలు, ప్రభుత్వాల విజయమని, ప్రజల, ప్రజాస్వామ్య విజయమని అభివర్ణించారు. ప్రస్తుత ప్రభుత్వంతో పాటు గత ప్రభుత్వ కృషి కూడా దీని వెనుక ఉందని స్పష్టం చేశారు. జిఎస్‌టి మూలంగా ఏర్పడే కొత్త పన్ను విధానం వల్ల వినియోగదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర నమ్మకంతో పని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు జాతి ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగాలన్నారు. జిఎస్‌టి అంటే ‘గ్రేట్ స్టెప్ టేకెన్ బై ఇండియా, గ్రేట్ స్టెప్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మేషన్,గ్రేట్ స్టెప్ టువర్డ్స్ ట్రాన్సపరెన్సీ’ అని నరేంద్ర మోదీ నిర్వచించారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాలు అమలు చేస్తున్న వివిధ పన్నుల స్థానే జిఎస్‌టి అమలులోకి వస్తుందని చెప్పారు. వ్యాపారస్తులు, వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే జిఎస్‌టి విధానం పన్ను ఎగవేతను కూడా అరికడుతుందని నరేంద్ర మోదీ వివరించారు. ప్రజాస్వామ్యం, రాజకీయ నాయకుల పరిపక్వత మూలంగానే ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించిందని చెప్పారు. సగటు మనిషిపై ప్రభావం చూపించే పలు అంశాలను దీని పరిధి నుంచి తప్పించామన్నారు. పన్ను వసూళ్ల కోసం చేసే ఖర్చు దీని వల్ల గణనీయంగా తగ్గుతుందని చెప్పిన ప్రధాని ఈ మొత్తాన్ని బడుగు,బలహీన వర్గాల అభివృద్ధి కోసం వినియోగించేందుకు వీలుకలుగుతుందన్నారు. దేశమంతా ఒకే రకమైన పన్ను విధానం అమలు కావటం వల్ల అవినీతికి కళ్లెం పడటంతోపాటు నల్లధనాన్ని అదుపుచేయడడూ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వస్తూత్పత్తి చేసే రాష్ట్రాలకు జిఎస్‌టి మూలంగా కొంత నష్టం కలగవచ్చునని అయితే ఆ నష్టాన్ని పూడ్చేందుకు బిల్లులో తగిన ఏర్పాట్లు పొందుపరిచినట్లు మోదీ వివరించారు. ఈ కొత్త విధానం వల్ల దేశంలోని వెనుకబడిన రాష్ట్రాలకు ఎక్కువ నిధులు అందుతాయని అలాగే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగవుతుందని వెల్లడించారు. దేశంలోని రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి లేదని, అన్నీ పరస్పరాధారితాలేనని వివరించారు. ఒకే పన్ను విధానం అమలు కావటం వల్ల వినియోగదారులు, చిన్న వ్యాపారస్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
పనిచేయని మోదీ బటన్!
జిఎస్‌టి రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ సీటుకు ఉండే బటన్ మొరాయించి నానా ఇబ్బంది పెట్టింది. లోక్‌సభ గ్యాలరీలను తొలగించిన అనంతరం ఈ బిల్లుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ జరిపించారు. సభ్యుల సీట్ల ముందు ఉండే ఆకుపచ్చ బటన్ నొక్కితే బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినట్టు. ఓటింగ్‌ను స్పీకర్ చేపట్టగానే ప్రధాని మోదీ సానుకూల బటన్ నొక్కారు. పనిహేను సెకన్ల పాటు ఈ బటన్‌ను అలాగే నొక్కి ఉంచితే సానుకూల ఓటు వేసినట్టు లెక్క. అయితే ప్రధాని తన సీటు ముందు ఉన్న బటన్‌ను ఎంత నొక్కినా అది పనిచేయలేదు.అంటే ఆయన ఓటు నమోదు కాలేదు. సభ్యులు తమ బటన్‌ను నొక్కిన వెంటనే స్పీకర్ సీటుకు రెండు వైపులా ఉన్న బోర్డుపై వారి ఓటు నమోదు అయినట్టు కనిపిస్తుంది. కానీ మోదీ ఓటు నమోదు కాకపోవడంతో పార్లమెంట్ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. దాంతో ఆయనకు ఓటింగ్ స్లిప్‌ను ఇచ్చారు. బిల్లుకు అనుకూలంగా టిక్ చేసి మోదీ ఆ స్లిప్‌ను సిబ్బందికి ఇచ్చారు. ప్రధాని మోదీ సీటు ముందు ఉన్న బటన్ ఎందుకు పనిచేయలేదన్న దానిపై పార్లమెంట్ సిబ్బంది విచారణ చేపట్టింది.

చిత్రం.. విక్టరీ సంకేతం చూపుతున్న ప్రధాని మోదీ