జాతీయ వార్తలు

మీ సమస్యలే నా సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 5: ‘మీ సమస్యలు నా సమస్యలు, మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుగుదేశం ఎం.పిలకు హామీ ఇచ్చారు. కేంద్ర సైన్సు,విజానం శాఖ మంత్రి సుజనా చౌదరి, పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు నాయకత్వంలో తెలుగుదేశం ఎం.పిలు శుక్రవారం మధ్యాహ్నం పార్లమెంటు ఆవరణలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో నరేంద్ర మోదీని కలిసి ఏ.పికి ప్రత్యేక హోదాపై తమ వాదనలు వినిపించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏ.పి అభివృద్ది చెందలేదని ఎం.పిలందరు ఏక కంఠంతో ప్రధానికి తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికే రెండు సంవత్సరాలు అవుతున్నా ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం వలన రాష్ట్రానికి ఎంతో నష్టం వాటిల్లిందని సుజనా చౌదరి స్పష్టం చేశారు. లోకసభ సభ్యుడు శివప్రసాద్ ‘ఓం నమో నారాయణ’ అంటూ నరేంద్ర మోదీకి రాష్ట్ర సమస్యలను వివరించారు. నమో అంటే నరేంద్ర మోదీ, నారాయణ అంటే నారా చంద్రబాబునాయుడు, మీరిద్దరు కలిస్తే అన్ని పనులు జరిగిపోతాయి, మీరు ఏ.పికి ప్రత్యేక హోదా ఇవ్వాలని శివప్రసాద్ ప్రధాన మంత్రికి విజప్తి చేశారు. ఏ.పికి ప్రత్యేక హోదా ఇవ్వటంతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై సుజనా చౌదరి ప్రధాన మంత్రికి మూడు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు.
విభజన చట్టంలో చేసిన హామీలను తుచ,తప్పకుండా అమలు చేస్తేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందనేది ఆయన వివరించారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు మీవైపు చూస్తున్నారని ప్రధాన మంత్రికి ఎం.పిలు సూచించారు. మొత్తం ఇరవై రెండు మంది టి.డి.పి ఎం.పిలు ప్రధాన మంత్రిని కలిశారు. సుజనా చౌదరితోపాటు శివప్రసాద్, గళ్లా జయదేవ్, రాంమోహన్ నాయుడు, కేసినేని శ్రీనివాసరావు, తోట నరసింహం, జె.సి.దివాకర్ రెడ్డి తదితరులు ప్రధానికి రాష్ట్ర సమస్యల గురించి వివరించారు. ఏ.పికి ప్రత్యేక హోదా ఇవ్వవలసిందేనని వారు స్పష్టం చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ వారు చెప్పినదంతా సావకాశంగా ఓపికతో విన్నారు. మీ సమస్యలు నా సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానని చెప్పారు తప్ప ప్రత్యేక హోదాపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.