జాతీయ వార్తలు

బిజెపి దళిత వ్యతిరేకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: గోమాంసం అంశంపై మధ్యప్రదేశ్‌లో ఇద్దరు దళిత మహిళలపై దాడి చేసిన సంఘటనపై శుక్రవారం లోక్‌సభలో ప్రతిపక్షాలు అధికార బిజెపిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితులు, ముస్లింలపై దాడులు రాను రాను పెరిగిపోతున్నాయంటూ విమర్శించాయి. దీంతో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకుని ఈ విషయంలో న్యాయం చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. జీరో అవర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని లేవనెత్తుతూ, తన వాదనకు మద్దతుగా కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లో దళిత యువకులను చితకబాదిన సంఘటన, అలాగే మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఇద్దరు దళిత మహిళలపై దాడి ఘటనలతో పాటుగా యుపిలో దళిత జంటను నరికి చంపిన తాజా ఘటనను ప్రస్తావించారు. గోరక్షక్ సంఘ్‌లాంటి గోరక్షా సంఘాలను నిషేధించాలని ఆయన అంటూ, ఆ సంస్థలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయని, రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు అలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. అంతేకాదు సంఘ్ పరివార్, బిజెపికి చెందిన సభ్యులు కూడా అలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఖర్గే ఆరోపించారు. ‘ప్రభుత్వాల మద్దతు ఉన్నప్పుడు మాత్రమే అలాంటి సంఘటనలు జరుగుతాయి’ అని ఆయన అంటూ, యుపిలో దళిత జంటను నరికి చంపినట్లు శుక్రవారం పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావించారు.
తాము తీసుకు వెళ్తున్నది గోమాం కాదని, గేదె మాంసమని మధ్యప్రదేశ్‌లో దాడికి గురయిన దళిత మహిళలు బతిమాలుకున్నారని, తమ వాదనకు మద్దతుగా రసీదులను సైతం చూపించారని, అయినప్పటికీ వారిని పోలీసుల కళ్లముందే చితకబాదారని, అంతేకాదు, మీరు మగవాళ్లయి ఉంటే చంపేసి ఉండేవాళ్లమని కూడా వారితో అన్నారని ఖర్గే అన్నారు. ఖర్గే ఈ మాటలు అంటున్నప్పుడు ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు సిగ్గు, సిగ్గు అంటూ కేకలు వేశారు. అంతేకాదు జాతీయ నేరాల గణాంకాల ప్రకారం దేశంలో దళితులపై ప్రతి ఎనభై నిమిషాలకు ఒక దాడి జరుగుతోందని, ప్రతి రోజూ ముగ్గురు దళితులపై అత్యాచారాలు జరుగుతున్నాయని, ఒక దళిత హత్య జరుగుతోందని ఖర్గే అన్నారు. ‘ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగేవని మీ ప్రభుత్వం చెప్పవచ్చు. అయితే మీరు అధికారంలోకి వచ్చాక ఈ దాడులు పెరిగాయి. వీటికి మీ మద్దతు ఉంది’ అని ఖర్గే అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యు లు కూడా ఖర్గే వాదనకు మద్దతు తెలిపారు.
కాగా, మధ్యప్రదేశ్ సంఘటనపై సమాధానమిచ్చిన హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇది శాంతిభద్రతల సమస్య అని, అది రాష్ట్రాలకు చెందినదని అన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సంఘటనపై తక్షణమే స్పందించిందని, దర్యాప్తు సైతం కొనసాగుతోందని చెప్పారు. బాధితులకు న్యాయం జరుగుతుందని, దోషులను వదిలిపెట్టబోమని కూడా సభకు హామీ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే రాజ్‌నాథ్ సమాధానానికి సంతృప్తి చెందని ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.

లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడుతున్న
కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గే