జాతీయ వార్తలు
జమ్మూలో నెట్, మొబైల్ సేవలు నిలిపివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 15 June 2016
శ్రీనగర్: జమ్మూలోని రూప్నగర్ ప్రాంతంలో ఓ పురాతన ఆలయం ధ్వంసమైన నేపథ్యంలో ఆందోళనలు చెలరేగడంతో పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి పురాతన ఆలయంలో ప్రవేశించి అక్కడి నిర్మాణాలను ధ్వంసం చేయడంతో స్థానికులు మూడు వాహనాలకు నిప్పు పెట్టి పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. పరిస్థితులు మెరుగైతే ఈ సేవలను పునరుద్ధరిస్తామని భద్రతాదళ అధికారులు తెలిపారు.