జాతీయ వార్తలు

పథకాల నిలిపివేతకు బీజేపీ ఎంపీ అరవింద్ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తదితర సంక్షేమ పథకాలను నిలిపి వేయించేందుకు నిజామామాద్ బీజేపీ ఎంపీ డీ.అరవింద్ కుట్ర చేస్తున్నారని లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షం నాయకుడు నామా నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, ఎంపీలు బండా ప్రకాశ్, జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆరోపించారు. నలుగురు ఎంపీలు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలను దెబ్బ తీసేందుకే అరవింద్ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ప్రశ్న అడిగారని వారు ఆరోపించారు. రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాలు, మైనారిటీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు అమలు చేస్తున్న పథకాలను నిలిపి వేయించేందుకు అరవింద్ చేస్తున్న కుట్రను తాము భగ్నం చేస్తామని, తాము కూడా పార్లమెంటులో ఉన్నామనేది ఆయన మరిచిపోరాదని టీఆర్‌ఎస్ ఎంపీలు హెచ్చరించారు. కేసీఆర్ ప్రతి ఇంటికి ఒక ఒక తండ్రి, ఒక మేనమామ తరహాలో ఉంటూ పేద బిడ్డల పెళ్లిల కోసం ఇబ్బంది పడకుండా ఆదుకుంటే అరవింద్ మాత్రం వారి సంక్షేమాన్ని దెబ్బ తీస్తున్నారని వారు దుయ్యబట్టారు. పేదల కోసం అమలు చేస్తున్న పథకాలను నిలిపి వేయించాలనే దుర్భుద్ది అరవింద్‌కు ఎందుకు కలిగిందని వారు విమర్శలు గుప్పించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో ఎలాంటి అవినీతి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించిన తరువాత కూడా నిజామాబాద్ ఎంపీ ఇలా నిరాధార ఆరోపణలు చేయటం సిగ్గు చేటన్నారు. నిధులు, ప్రాజెక్టులు తీసుకునిరావడం ద్వారా తెలంగాణా ప్రజలకు అండగా ఉండకుండా పేద ప్రజల పొట్ట కొట్టేందుకు కుట్ర చేయడం అన్యాయమని వారు విమర్శించారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఈ పథకాలలో ఏదైనా లోపాలుంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప ఇలా మొత్తం పథకాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేయడం ఏంత వరకు సమంజసమని వారు అరవింద్‌ను నిలదీసారు. రాష్ట్ర ప్రజలందరు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సమర్థించడం సహించలేకనే ఆయన ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నాగేశ్వరరావు, కే. కేశవరావు, సంతోష్‌కుమార్, బండా ప్రకాష్ ఆరోపించారు. పసుపు బోర్డు కోసం మాజీ ఎంపీ కవిత చేసిన పోరాటాన్ని అరవింద్ మరిచిపోయారా? అని వారు ప్రశ్నించారు. అరవింద్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు.