రంగారెడ్డి

నిజాంపేట్‌లో టీఆర్‌ఎస్ ప్రభంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జనవరి 22: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. మొత్తం 33 కార్పొరేటర్ స్థానాల్లో 26 టీఆర్‌ఎస్‌కి, ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. కార్పొరేషన్‌లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు అసలు ఖాతానే తెరుచుకోకపోవడం గమనార్హం. మొత్తం 33 స్థానాలకు గాను 109957 ఓటర్లలో 43603 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్పొరేషన్‌లో 33 వార్డులలో మొదటి వార్డులో 3545 ఓటర్లకు గాను 1675 ఓట్లు పడగా బీజేపీ అభ్యర్థి కొలను నీరజా రెడ్డి పై టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయలక్ష్మీ 256 ఓట్ల తేడాతో గెలుపొందింది. రెండో వార్డులో 3014 ఓటర్లకు గాను 846 ఓట్లు పోలవగా స్వతంత్ర అభ్యర్థి వెంకటరామయ్య పై టీఆర్‌ఎస్ అభ్యర్థి చిట్ల దివాకర్ 182 ఓట్ల తేడాతో గెలుపొందాడు. మూడో వార్డులో 3038 ఓటర్లలో 932 ఓట్లు పోలవగా టీఆర్‌ఎస్ అభ్యర్థి నర్సయ్య పై స్వతంత్ర అభ్యర్థి శ్రీరాములు 134 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఐదో వార్డులో 3048 ఓటర్లలో 1339 ఓట్లు పోలవగా స్వతంత్ర అభ్యర్థి దయాకర్ రెడ్డి పై టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇంద్రజిత్ రెడ్డి 8 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఆరో వార్డులో 3044 ఓటర్లకు గాను 1036 ఓట్లు పడగా స్వతంత్ర అభ్యర్థి నాగవెంకట సత్యవాణి గెలుపొందారు. ఏడో వార్డులో 3413 ఓటర్లలో 1703 ఓట్లు పోలవగా స్వతంత్ర అభ్యర్థి అఖిల పై టీఆర్‌ఎస్ అభ్యర్థి శెనిగల ప్రమీల 256 ఓట్ల తేడాతో గెలుపొందింది. ఎనిమిదో వార్డులో 3297 ఓటర్లుకు గాను 1353 ఓట్లు పోలవగా స్వతంత్ర అభ్యర్థి రామలింగా చౌదరి పై టీఆర్‌ఎస్ అభ్యర్థి సురేశ్ కుమార్ రెడ్డి 224 ఓట్ల తేడాతో గెలుపొందాడు. తొమ్మిదో వార్డులో 3217 ఓటర్లలో 1089 ఓట్లు పోలవగా తెరాస అభ్యర్థి రజిత గెలుపొందాడు. 10వ వార్డులో 3475 ఓటర్లలో 1349 ఓట్లు పోలవగా టీడీపీ అభ్యర్థి నర్సింగ రావు పై టీఆర్‌ఎస్ అభ్యర్థి మేకల వెంకటేశం 91 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 11వ వార్డులో 3528 ఓటర్లలో 1405 ఓట్లు పోలవగా టీడీపీ అభ్యర్థి మదుసూదన్ రెడ్డి పై టీఆర్‌ఎస్ అభ్యర్థి రవికిరణ్ 395 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 12వ వార్డులో 3487 ఓటర్లలో 1506 ఓట్లు పడగా తెరాస అభ్యర్థి కొలను నీలా గోపాల్ రెడ్డి విజయం సాధించారు. 13వ వార్డులో 3544 ఓటర్లకు గాను 1423 ఓట్లు పడగా స్వతంత్ర అభ్యర్థి మంజుల పై 526 ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆవుల పావని గెలుపొందారు. 14వ వార్డులో 3427 ఓటర్లలో 1326 ఓట్లు పోలవగా టీడీపీ అభ్యర్థి శోభారాణి పై టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజేశ్వరి 215 ఓట్ల తేడాతో గెలుపొందింది. 15వ వార్డులో 3529 ఓట్లకు గాను 1888 ఓట్లు పోలవగా స్వతంత్ర అభ్యర్థి సుజాత గెలుపొందారు. 16వ వార్డులో 3384 ఓటర్లకు గాను 1312 ఓట్లు పోలవగా కాంగ్రెస్ అభ్యర్థి రాముగౌడ్ పై టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆగం పాండు 548 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు. 17వ వార్డులో 3461 ఓట్లకు గాను 1484 ఓట్లు పడగా బీజేపీ అభ్యర్థి కొలను రాజశేఖర్ రెడ్డి పై టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆగం రాజు 86 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 18వ వార్డులో 3305 ఓటర్లకు గాను 1153 ఓట్లు పడగా తెరాస అభ్యర్థి కొలను వీరేందర్ రెడ్డి గెలుపొందాడు. 19వ వార్డులో 3619 ఓటర్లకు గాను 1718 ఓట్లు పోలవగా బీజేపీ అభ్యర్థి అశోక్ పై టీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని సుధాకర్ 809 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 20వ వార్డులో 3482 ఓటర్లలో 1374 ఓట్లు పడగా బీజేపీ అభ్యర్థి రామ్‌చందర్ నాయక్ పై టీఆర్‌ఎస్ అభ్యర్థి బాలాజీ నాయక్ 181 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 21వ వార్డులో 3614 ఓటర్లకు గాను 1922 ఓట్లు పోలవగా కాసాని శిరీష్ భారీ మెజారిటీతో గెలుపొందారు. 22వ వార్డులో 3025 ఓటర్లలో 850 ఓట్లు పోలవగా టీఆర్‌ఎస్ అభ్యర్థి నవ్య పై స్వతంత్ర అభ్యర్థి మాధవి 58 ఓట్ల తేడాతో గెలుపొందింది. 23వ వార్డులో 3030 ఓటర్లకు గాను 871 ఓట్లు పోలవగా బీజేపీ అభ్యర్థి సంతోష్ కుమార్ పై స్వతంత్ర అభ్యర్థి శ్రీ్ధర్ 135 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 24వ వార్డులో 3080 ఓటర్లలో 962 ఓట్లు పడగా స్వతంత్ర అభ్యర్థి మోడమ్ సుజాత గెలుపొందారు. 25వ వార్డులో 3120 ఓటర్లలో 1110 ఓట్లు పోలవగా టీఆర్‌ఎస్ అభ్యర్థి స్వర్ణ లత పై స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీకుమారి 316 ఓట్ల తేడాతో గెలుపొందింది. 26వ వార్డులో 3497 ఓటర్లకు గాను 1410 ఓట్లు పడగా టీడీపీ అభ్యర్థి సైదారావు పై టీఆర్‌ఎస్ అభ్యర్థి రాఘవేంద్ర రావు 382 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 27వ వార్డులో 3487 ఓటర్లకు 1489 ఓట్లు పోలవగా తెరాస అభ్యర్థి ఎల్లంబాయి జ్యోతి గెలుపొందారు. 28వ వార్డులో 3212 ఓటర్లలో 1174 ఓట్లు పోలవగా బీజేపీ అభ్యర్థి కేశవులు పై టీఆర్‌ఎస్ అభ్యర్థి దన్‌రాజ్ యాదవ్ 374 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 29వ వార్డులో 3426 ఓటర్లకు 1286 ఓట్లు పడగా టీడీపీ అభ్యర్థి మమత పై టీఆర్‌ఎస్ అభ్యర్థి బొర్ర దేవి 426 ఓట్ల తేడాతో గెలుపొందింది. 30వ వార్డులో 3421 ఓటర్లకు 1198 ఓట్లు పడగా టీఆర్‌ఎస్ అభ్యర్థి కొలను సునీల్ రెడ్డి విజయం సాధించారు. 31వ వార్డులో 3431 ఓటర్లకు 1604 ఓట్లు పోలవగా స్వతంత్ర అభ్యర్థి నర్మద పై టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆవుల ప్రసన్న 425 ఓట్ల తేడాతో గెలుపొందింది. 32వ వార్డులో 3324 ఓటర్లకు 1400 ఓట్లు పడగా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసులు పై టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి 433 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 33వ వార్డులో 3325 ఓటర్లకు గాను 1397 ఓట్లు పోలవగా టీఆర్‌ఎస్ అభ్యర్థి కొలను తేజ శ్రీనివాస్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు.