రంగారెడ్డి

తాండూరులో కరోనా పాజిటివ్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఏప్రిల్ 13: పట్టణంలో కరోన పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఇందిరమ్మ కాలనీకి చెందిన మహిళకు వైరస్ సోకినట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్, పట్టణ సీఐ రవి కుమార్ తెలిపారు. మహిళను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రాజీవ్‌కాలనీ, ఇందిరమ్మ కాలనీలో ప్రజల కదలికలను డ్రోన్‌తో పర్యవేక్షిస్తామని నిత్యావసర వస్తువులను అధికారులు సరఫరా చేస్తారని సీఐ జలందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి సిద్ధం
రాజేంద్రనగర్, ఏప్రిల్ 13: పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలు లెక్క చేయకుండా నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న వారికి ఎంతో రుణపడి ఉంటామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. సోమవారం రాజేంద్రనగర్ డివిజన్ బుద్వేల్ బస్తీలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం సంస్థ డైరెక్టర్ కోరని దయానంద్ సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. నాయకులు కొలన్ సుభాష్ రెడ్డి, బాబురావు యాదవ్, చిత్తారి, శ్రావణ్, పంబాల రాజు, కోరని ఉదయ్ కిరణ్, రాచమల్ల నర్సింగ్ రావు, నరేష్ యాదవ్, సాయి మాలిక్, కోరని శ్యామ్ పాల్గొన్నారు.
క్వారంటైన్ కేంద్రంగా కళాశాల భవనం
కొత్తూరు, ఏప్రిల్ 13: క్వారంటైన్ కేంద్రంగా యూనివర్సిటీ భవనాన్ని వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో వ్యవసాయ కళాశాలను క్వారంటైన్ కేంద్రంగా వినియోగిస్తున్నారు. అదనంగా జిల్లాలో నందిగామ మండలంలో మామిడిపల్లిలోని సింబాయిసిస్ యూనివర్సిటీ భవనాన్ని వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కరోనా మహమ్మారి చేగూరుకు వ్యాపించిన నేపథ్యంలో సమీపంలోనే ఉన్న సింబాయసిస్ యూనివర్సిటీలో క్వారంటైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.