జాతీయ వార్తలు

ఇందిరా జైసింగ్ సిగ్గుపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో మరణశిక్ష ఖరారయిన నలుగురు ముద్దాయిలకు క్షమాభిక్ష ప్రసాదించాలని సూచించినందుకు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సిగ్గుపడాలని నిర్భయ తండ్రి శనివారం పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వలె తమ కుటుంబానికి ‘విశాల హృదయం’ లేదని ఆయన అన్నారు. గ్యాంగ్‌రేప్ కేసులో ముద్దాయిలకు మరణ శిక్షను వ్యతిరేకిస్తున్న ఇందిరా జైసింగ్ క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. నిర్భయ తల్లి బాధను తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని, అయితే, ఆమె సోనియా గాంధీని ఆదర్శంగా తీసుకోవాలని ఇందిరా జైసింగ్ శుక్రవారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో సూచించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినీ శ్రీహరన్‌కు మరణశిక్ష ఖరారు కాగా, సోనియా గాంధీ ఆమెను క్షమించి ఆమెకు పడిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించేందుకు చొరవ తీసుకున్న విషయం తెలిసిందే. నళినికి జైలులో పుట్టిన కుమార్తె ఉందని, అందువల్ల ఆమె మరణశిక్షను తగ్గించాలని సోనియాగాంధీ అప్పట్లో కోరారు. ఇందిరా జైసింగ్ సూచన ‘తప్పుడు సందేశాన్ని’ ఇస్తోందని నిర్భయ తండ్రి పేర్కొన్నారు. ఇందిరా జైసింగ్ స్వయంగా మహిళ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలని, నిర్భయ తల్లికి క్షమాపణ చెప్పాలని ఆయన శనివారం ఒక వార్తాసంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ అన్నారు. ‘మేము ఈ కేసులో గత ఏడేళ్లుగా పోరాడుతున్నాం. మేము సామాన్య ప్రజలం. రాజకీయ నాయకులం కాదు. సోనియా గాంధీకి ఉన్నంత విశాల హృదయం మాకు లేదు’ అని ఆయన అన్నారు. ‘ఇలాంటి మనస్తత్వం అత్యాచార కేసులు పెరగడానికి కారణం అవుతోంది’ అని కూడా ఆయన విమర్శించారు.