జాతీయ వార్తలు

బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం:కేంద్రమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసే ఆందోళనకారులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేసేవారిని కాల్చిపారెయ్యాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ అన్నారు. గత నెలలో బెంగాల్‌లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. దీనిపై బీజేపీ చీఫ్ స్పందిస్తూ నిరసనకారులపై ఫైరింగ్‌కుకానీ లాఠీఛార్జీకిగానీ మమత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయలేదని అన్నారు. ప్రజలు ఇచ్చిన పన్నులతో నిర్మించే ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే ఆందోళనకారులను యూపీ తరహావలే కాల్చిపారెయ్యాలని అన్నారు. కాగా బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి బాబుల్ సుప్రియా అన్నారు. ఇలాంటి తరహా వ్యాఖ్యలు తగదని కేంద్రమంత్రి ఖండించారు.