రంగారెడ్డి

మూసీ ప్రక్షాళనకు ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 14: దేశంలో గంగా నదీ ప్రక్షాళనకు మోదీ శ్రీకారం చుడితే..రాష్ట్రంలో మూసీ ప్రక్షాళనకు బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కే.లక్ష్మణ్ అన్నారు. శనివారం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన మూసీ శుద్ధి కోసం ఉద్యమిద్దాం ..తెలంగాణ గంగను పవిత్రం చేద్దాం అనే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా అనంతగిరిలోని మూసీనది జన్మ స్థలాన్ని సందర్శించి గంగా హారతి పూజలు చేశారు. లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో మూసీని కొబ్బరి నీళ్లతో నింపేలా ప్రక్షాళన చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, అధికారం చేపట్టి ఆరు సంవత్సరాలు గడుస్తున్న నేటికీ మూసీ ప్రక్షాళన శూన్యం అని విమర్శించారు. మూసీ నదిలోకి పలు ఫ్యాక్టరీల నుంచి కలుషిత జలాలు వస్తున్నాయని, కలుషిత నీరు వదిలే ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన విషయాన్ని వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నల్లగొండ జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేందుకే మూసీ శుద్ధి ఉద్యమ బాట పట్టినట్లు ఆయన తెలిపారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, విడతల వారిగా సంవత్సరం పాటు కొనసాగించి మూసీ నదిని శుద్ధి పరిచేంత వరకు బీజేపీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. అనంతగిరిలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి, బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి,జనార్దన్ రెడ్డి, బీ.నర్సింహా రెడ్డి, ప్రహ్లాద్ రావు, భరత్ గౌడ్, శివరాజ్, పటేల్ రవిశంకర్, మాధవ రెడ్డి, పాండుగౌడ్, రమేశ్ కుమార్, వివేకానంద్ రెడ్డి, నరోత్తమ్ రెడ్డి, సదానంద్ రెడ్డి, కే.పీ.రాజు, పోకల సతీష్, విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు.