క్రీడాభూమి

బాక్సింగ్ గురించి నీకెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ‘బాక్సింగ్ గురించి నీకెందుకు? నీ పని ఏమిటో నువ్వు చూసుకో? బాక్సింగ్‌పై మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు’ అంటూ స్టార్ షూటర్ అభినవ్ బింద్రాపై మహిళా బాక్సర్ మేరీ కోమ్ పంచులు గుప్పించింది. వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కోసం జరిగే క్వాలిఫయర్స్‌లో మేరీ కోమ్‌తో తనకు ట్రయల్ ఫైట్‌ను నిర్వహించాలని భారత బాక్సింగ్ అధికారులను మరో మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ కోరింది. అయితే, అలాంటి ఫైట్ అవసరం లేదన్నది మేరీ కోమ్ ఆలోచన. జరీన్, మేరీ కోమ్ మధ్య పరోక్షంగా వాగ్వాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇలావుంటే, ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ కంటే ముందు, ఆరు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న మేరీ కోమ్‌తో ఫైట్‌కు జరీన్ చేసిన ప్రతిపాదనను బింద్రా సమర్థించాడు. ఆమె ప్రతిపాదన అత్యంత సహేతుకమైనదని వ్యాఖ్యానించాడు. కాగా, బింద్రా వ్యాఖ్యలపై మేరీ కోమ్ మండిపడింది. ‘ఒలింపిక్స్‌లో అతను స్వర్ణ పతకం సాధించి ఉండవచ్చు. షూటింగ్‌లో గొప్పవాడై ఉండవచ్చు. కానీ, బాక్సింగ్ గురించి అతనికి అనవసరం. జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
భయపడడం లేదు..
జరీన్‌తో ఫైట్‌కు తాను భయపడుతున్నట్టు వస్తున్న వార్తను మేరీ కోమ్ కొట్టిపారేసింది. అలాంటి భయాందోళనలు ఏవీ తనకు లేవని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో ఎవరెవరు పోటీపడాలో భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ఇది వరకే నిర్ణయించిందని గుర్తుచేసింది. నిబంధనలను తాను మార్చలేనని వ్యాఖ్యానించింది. బీఎఫ్‌ఐ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానే తప్ప, జరీన్‌తో ఫైట్‌కు భయపడడం లేదని తేల్చిచెప్పింది.
*చిత్రాలు.. స్టార్ బాక్సర్ మేరీ కోమ్, ఆమెతో ఫైట్‌ను కోరుతున్న నిఖత్ జరీన్.