Others

పశుపతిపూజతో పశుత్వం దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రహ, శత్రు, అపమృతు దోష నివారణ కోసం చేసేవారు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది.
‘నమక, చమక, మహా న్యాసాలతో చేసే అభిషేకం అత్యుత్తమమైనది. అది చేయలేనివారు ఓంకార సహిత శివపంచాక్షరీ మంత్రమయిన ‘ఓం నమశ్శివాయ’తో కానీ, శివ సహస్ర నామాలతోకానీ అభిషేకం చేయవచ్చు. అప మృత్యు దోషాల నివారణకు మృత్యుంజయ మంత్రమయిన ‘త్రయంబకం యజామ్యహే సుగంధిం పుష్ఠివర్ధనమ్, ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షియ మామృతం’’ అనే మంత్రాన్ని పఠిస్తూ అభిషేకం చేయాలి.
శివ సహస్ర నామాలతో అభిషేకం కైవల్యదాయకం. ఈ నామాల ప్రాముఖ్యతను గురించి మహాభారతంలోని అనుశాసన పర్వంలో వివరించబడింది. అవసాన దశలోనున్న భీష్ముడు ధర్మరాజుకి విష్ణు సహస్ర నామాలని వినిపించాక ఆయనను శివ సహస్ర నామాలు కూడా తనకు వినిపించ మని ధర్మరాజు కోరాడట. భీష్ముడు దానికి తాను సమర్థుడను కానంటూ శ్రీకృష్ణుని వైపు చూడగా, శ్రీకృష్ణుడు స్వయంగా తానే ఆ ‘శివ సహస్ర నామ స్తోత్రం’ ధర్మరాజుకి వినిపించాడంటే, ఆ పరమేశ్వర తత్వ ఔన్నత్యం ఎంతటిదో అవగతమవుతుంది. వాసుదేవ పరబ్రహ్మవదనం నుండి వెలువడిన శివసహస్ర నామ స్తోత్రం వేదవ్యాసుల వారిచే శివపురాణంలో లిఖించ బడింది.
ముని శ్రేష్ఠులారా! శివుడికి ఎంతో ప్రియమయినది కలువలూ, కమలాలూ, బిల్వ పత్రాలూ మందార పుష్పాలతో అర్చన. అంతే ఇష్టమైనవి శంఖ పుష్ప, గనే్నరు, ఉమ్మెత్త, నందివర్ధన, అవిసె, మల్లె, బంధూక, జిల్లేడు, తుమ్మి పూల పూజలు. ఈ పుష్ప పూజలు ఇహలోక కామ్యాలన్నింటినీ తీరుస్తాయి. కానీ లక్ష పద్మాలతోగానీ, లక్ష బిల్వ పత్రాలతో కానీ, లక్ష శంఖ పుష్పాలతోగానీ శివుడిని పూజించటం అంతులేని పుణ్యాన్నిస్తుంది.
ఉమ్మెత్త పూలపూజ పుత్ర సంతానాన్నీ, దర్భలతో పూజ దీర్ఘాయువునీ, జిల్లేడు కలువ పుష్ప పూజలు విక్రమ పరాక్రమాలనీ, గనే్నరుతో పూజ శత్రు క్షయాన్నీ, నందవర్ధన పూజ సౌందర్యాన్నీ, సంపదలనీ ప్రాప్తింపజేస్తాయి. అవిసె పూలు సుఖ సంసారాన్నిస్తే, ఎర్ర గనే్నరూ అగ్ని పూలూ, కుజదోషాలని నివారిస్తాయి. మల్లె, జాజి, తెల్ల మందారా లూ అన్నీ శివుడికి ఇష్టమైన పూలే! శాపాలని పొందిన మొగలి, సంపెంగ పూవులు తప్ప మిగిలినవన్నీ పూజార్హాలే! అష్టమి, సోమవారము, కృష్ణ త్రయోదశీ, చతుర్ధశీ, ఏకాదశీ తిథులు శివ ప్రీతికరాలు.
ఒకప్పుడు సనత్కుమార ఋషి పరమేశ్వరుడినే స్వయంగా ఆయనని త్వరగా పొందే మార్గం అడుగా, ఆయన సమాధానంగా తనను విభూతితో పూజించటమూ, విభూతి ధరించి తనని పూజించటమూనని తెలిపారు. అలాగే రుద్రాక్ష ధారణ చేసినవారు రుద్రునితో సములవు తారని తెలిపాడాయన. ‘‘సనత్కుమారా! విభూతి అగ్ని వలన సంభవిస్తుంది కనుక ‘సద్యోజాత...’ ‘అగ్నిరీత్యా...’ ‘మానసోక్త...’, ‘త్య్రంబక’ మంత్రాలు పఠిస్తూ ‘త్యుయుషం జమదగ్నే’.. అన్న మంత్రంతో ‘త్రిపురాండ్రకంగా (మూడు అడ్డగీతలుగా) విభూతిని ధరించాలి. ఈ మూడు గీతలూ ఓంకారంలోని ‘అకార ఉకార మకారాలు’గా భావించాలి. అన్నిటి కన్నా గోమయంతో చేయ బడిన భస్మము శ్రేష్ఠాతి శ్రేష్ఠము’’ అని తెలిపాడు శివుడు.
అలాగే రుద్రాక్ష కంఠంలో ధరించిన వారిని చూసినా గొప్ప ఫలమే. పూర్వం కుమార స్వామికి స్వయంగా శివుడు ఇలా తెలిపాడు. ‘‘కుమారా!ఏకముఖీ రుద్రాక్ష సాక్షాత్తూ శివ స్వరూపము. ద్విముఖీ రుద్రాక్ష అర్ధనారీశ్వర రూపము, త్రిముఖ, చతుర్ముఖ, పంచముఖ, షణ్ముఖ, అనంగ (సప్తముఖి), అష్టముఖీ (వినాయకం), నవముఖి (్భరవము) దశముఖీ (జనార్ధనము) మొదలైనవి బ్రహ్మ హత్యా, స్ర్తీ హత్యాది దోషాలను నివారిస్తాయి’’ అంటూ ముప్పయి ఎనిమిది రకాల రుద్రాక్షల శ్రేష్ఠతనూ వివరించిన శివుడు, నిద్రించేటప్పుడూ, ఇంట్లో మైల ఉన్నప్పుడూ, ఇంకా మైథున సమయాల్లోనూ వాటిని ధరించ కుండా ఉండటమే శ్రేయస్కరమని తెలిపాడు. ‘‘మునీశ్వరులారా! వేయే ళ్ళ తపస్సు తరువాత శివుడు కన్నులు తెరువగా, ఆ ‘రుద్రు’ని ‘అక్షములు’ అనగా కన్నుల నుండి భూమిపై రాలిపడిన బిందువులే ‘రుద్రాక్ష’ వృక్షాలుగా మొలచాయి.’’ అని తెలిపిన సూతుడు ఇలా కొనసాగించాడు.
వివిధ రకాల శివలింగాలు
‘‘పుణ్యాత్ములారా! ఒకసారి దేవతలు ఏ దైవ పూజ వలన దుఃఖాలు ఉపశమించి సమస్త శుభాలూ కలుగుతాయని విష్ణుమూర్తి నడుగగా ఆయన,
‘‘దేవతలారా! శివపూజ అన్నింటికన్నా ఉత్తమోత్త మమైనది. శివ పూజా దురంధరులు మహాజ్ఞాన సంపన్ను లౌతారు. గృహస్థుల యొక్క సంసారపు అగచాట్లు తెలిసిన వాడు కనుక వారు చేసే చిన్న పూజలకే ఎంతో సంతోషించి సాయుజ్యాన్ని కూడా ప్రసాదించే భక్త సులభుడు ఆ పరమేశ్వరుడు. తనని లింగరూపాన పూజించటం శివుడికెంతో ప్రీతిపాత్రం.’’ అని తెలిపి విష్ణువు దేవతలందరికీ వారి వారి అర్హతానుసారం వివిధ మణిమయ లింగాలను ప్రసాదించాడు. అయితే అన్నింటికన్నా మిన్న పార్థివ లింగ పూజ మాత్రమేనని ఆయన వారికి తెలిపాడు. మునివర్యులారా!

ఇంకా ఉంది