Others

నిజమైన మానవత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవత్వం గురించి చాలామంది చాలా చెబుతుంటారు. అసలు మానవత్వం ఉండాలి అని ప్రత్యేకంగా చెప్పడంలోని అంతరార్థం ఏముంటుంది? మనుషులన్నాక మానవత్వం ఉండి తీరాలి కదా. మానవత్వం లేకుండా ఇంత పని చేశారు అనే మాటలు మనం వింటుంటాం. కనికరం, మానవత్వం, ఇలాంటి మాటలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే ఈ ప్రపంచంలోకి మనుషులు వివిధ రకాల జంతువులు వచ్చాక చివరగా మనిషి రంగప్రవేశం చేశాడనేది కొంతమంది చెబుతుంటారు. ఇది నిజం అనుకొంటే- పశువులకు మనిషికి తేడా కొట్టవచ్చినట్టు కనబడుతుంది. పశువు తిండి, నిద్ర, మైధునం ఇట్లాంటి నిత్యకృత్యాలు ప్రకృతిని అనుసరించి చేస్తూ ఉంటాయి. సూర్యోదయం కాబోతుండగానే క్రిమి కీటకాదులతో సహా జంతువులన్నీ మేల్కొంటాయి. మనిషి మాత్రం మేల్కొనాలన్న సిద్ధాంతాన్ని ఏమీ పెట్టుకోలేదు. మిగతా విషయాలు కూడా జంతువుకు, మనిషికీ తేడా కనిపిస్తుంది. జంతువు ఆకలి వేసినప్పుడు తింటే మనిషి మాత్రం తినడం కోసమే కష్టపడి సంపాదిస్తాడు. కేవలం తన కడుపు నిండితే చాలు అనుకోడు. తాను తినడమే కాక తనవారికోసం తరతరాలకు తరగని ఆస్తులను కూడగట్టుతాడు. కనుక మనిషికి తిండి విషయంలోనే జంతువుకు పోలిక సరిపడదు.
అట్లాంటి మనిషి కనుకనే మానవత్వం గురించి వేరుగా చెప్పాల్సి వస్తోంది. మొదట్లో అంటే జ్ఞానం కావాల్సినంత సముపార్జించనపుడు మనిషి కూడా పశువులాగే పనులు చేస్తుంటాడు. ఇతరుల కష్టనష్టాలను అంచనా వేయగలడు. తనకు కావాల్సిన దానిని పట్టుపట్టి తీసేసుకుంటాడు. మృగం లా ప్రవర్తిస్తున్నాడు అంటుంటారు కదా. దీనివల్లనే. మనిషి ఎప్పుడైతే తాను వేరు శరీరం వేరు అన్న జ్ఞానాన్ని ఆర్జిస్తాడో అపుడు తనను తాను అదుపులో పెట్టుకుంటాడు. తన కోరికలను కూడా అదుపులో పెట్టుకుంటాడు. ఏది చేయవచ్చు. ఏది చేయకూడదు అన్న ఆలోచనలను కలిగి ఉంటాడు. అపుడు మానవత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం ఉండదు. ఎప్పుడైతే శరీరం వేరు. ఈ శరీరం నశించేది. కేవలం మరుజన్మకు పుణ్యపాపాలే తోడు ఉంటాయి అన్న కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాడో అపుడే పాపభీతి మొదలవుతుంది. అపుడు ఇతరులకు కలిగే కష్టాన్ని నష్టాన్ని గురించి తెలుసుకొంటాడు. అపుడు అతడిలో మానవత్వపు ఛాయ పొడచూపుతుంది.
కనుక మనిషి తాను ఎవరు అన్న జ్ఞానాన్ని ముందు సంపాదించడం మొదలు పెట్టాలి. ఈ సంపాదన కోసం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లితే దైవం లేకపోతే చైతన్యం ఏదో ఒకటి మాత్రమే మనిషిని నడిపిస్తుంది అన్న సత్యాన్ని సులభంగా తెలుసుకొంటాడు.అపుడు అతనిలోని మృగత్వ లక్షణాలు తొలుగుతాయి. మానవత్వం మొగ్గతొడుగుతుంది.
ప్రతి మనిషి తాను ఎవరో తెలుసుకొంటే - నేను అనే దానికి సమాధానం దొరకబుచ్చుకుంటే ఎవరూ ఎవరినీ బాధించరు. ఎవరూ ఎవరినీ కష్టపెట్టరు. అపుడు సులభంగా సర్వులూ సంతోషంగా ఉండవచ్చు.

- ప్రసన్న