క్రీడాభూమి

ప్రాక్టీస్ షురూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికాతో బుధవారం నుంచి జరిగే టెస్ట్ సిరీస్‌కు కోహ్లీ సేన తీవ్రంగా శ్రమిస్తోంది. ఆదివారమే ఆటగాళ్లంతా విశాఖపట్నం చేరుకున్నా, సోమవారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఉదయమంతా భారీ వర్షం రావడంతో డ్రెస్సింగ్ రూంకే పరిమితమైన క్రికెటర్లు మధ్యాహ్నం తర్వాత ప్రాక్టీస్ దిగారు. మరోవైపు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు సైతం మైదానంలో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ సాధన చేస్తూ కనిపించారు. ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌ను ఇరు జట్లు 1-1తో సమం చేయగా, టెస్టు సిరీస్‌పై టీమిండియా కనే్నసింది. గత దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో గెలిచిన భారత్, ఈసారీ అదే తరహా ప్రదర్శనతో క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇప్పటికే భారత్ ఖాతాలో 120 పాయంట్లతో ముందున్న విషయం తెలిసిందే.
*చిత్రాలు.. బౌలింగ్ సాధన చేస్తున్న సఫారీ పేసర్ కగిసో రబద
*నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా ఫుట్‌బాల్ ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ