జాతీయ వార్తలు
బలవంతంగా భాషను రుద్దవద్దు:రజనీకాంత్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 September 2019
చైన్నై: దేశం మొత్తం హిందీ భాషను అమలుచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన ప్రకటనపై సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించారు. బలవంతంగా ఎవరిపైన భాషను రుద్దటం తగదని అన్నారు. హిందీ భాష అమలు ఉత్తర భారతంలో సాధ్యమవుతుందేమో కానీ దక్షిణాదిలో అమలుచేయటం సాధ్యం కాదని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ప్రజలు, దక్షిణాదిలో హిందీని అంగీకరించరని అన్నారు. ఒకే భాష ఉంటే అభివృద్ధి సాధ్యం కావచ్చునేమో కానీ మన దేశంలో అందరూ ఒకే భాష మాట్లాడరు కదా అని ఆయన అన్నారు. కాబట్టి ఒకే భాషను బలవంతంగా రుద్దటం సాధ్యం కాదని అన్నారు.