Others
సృస్థిల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 August 2019
- సాంధ్య శ్రీ 8106897404
మనిషిగా ఎదిగి
ఉడుపథంలోకి అడుగుపెట్టాలని
శిథిల శిశిరాంగాలమీద సుమ సమూహాలు చల్లాలని
పరిణామ సత్యాలన్ని అక్షరాలుగా మార్చి
అందరికీ అందించాలని
కలల్ని
అలల్ని
ఏకంచేసి ఏక్తారను మీటుతున్నాను..
అరణ్యాల అంతశే్చతనలో ఋతుఘోషలు
ఈ దేశపు హృదయస్పందనగా
నా బాహువుల్ని ఆక్రమించాయి
ఒక్కక్షణ ప్రభని- అనుక్షణ
జీవన కఠోర సత్యదర్శనంగా శాశ్వతీకరించాలని
గాలి కాగితంమీద గంధర్వ గీతం వ్రాసి
ధరిత్రి అనే సృష్టి సౌందర్యశాల గొంతులోకి
వంచాను..
మొన్నటి తన సర్వస్వాన్ని కోల్పోయి కూడా
నిన్నటి సీస కందువులో
నగ్నయజనాన్ని కొనసాగిస్తున్న
తరువు
ఇంకా ఉంది