రంగారెడ్డి

నేడు బీజేపీలో చేరనున్న సామ రంగారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఆగస్టు 17: రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికీ రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు సామ రంగారెడ్డి తెలిపారు. శనివారం ఎల్బీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చూసి ఆదివారం నగరంలోని ఎగ్గిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేయనున్న సమావేశంలో బీజేపీలో చేరుతున్నట్లు రంగారెడ్డి వివరించారు. ఎల్బీనగర్ పార్టీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీతో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలి వెళ్లనున్నట్లు చెప్పారు. సాహేబ్ నగర్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపించి అక్కడి నుంచి ఎల్బీనగర్ మీదిగా తరలివెళ్లనున్న ర్యాలీలో పార్టీ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తరలి రావాలని రంగారెడ్డి కోరారు.
ఎంజీబీఎస్‌లో భద్రత పెంపు
చాదర్‌ఘట్, ఆగస్టు 17: మహాత్మా గాంధీ బస్‌స్టేషన్‌లో పోలీసులు భద్రతను పెంచారు. నిత్యం రద్ద్దీగా ఉండే ఈ బస్ స్టేషన్‌లో చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్‌లు జరుగకుండా భద్రతను పెంచుతున్నట్లు అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ పీ.జీ రెడ్డి తెలిపారు. ప్రతిరోజు యాబైవేల నుంచి లక్ష మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ బస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలను పెంచు తున్నట్లు తెలిపారు. ప్లాట్ ఫాంలపై కూడా నిఘా వ్యవస్థను పటిష్ట పెంచనున్నట్లు వివరించారు. బస్ స్టేషన్ ప్రవేశ ద్వారం, ఇన్‌కమింగ్, ఔట్ గోయంగ్ పాయంట్లలో భద్రతను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇకపై 24 గంటల భద్రత విధులను నిర్వహించేలా ఎస్‌ఐ స్థాయ అధికారి ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరింగిందని అన్నారు.
నాగారం ఇన్‌చార్జి కమిషనర్‌గా శశికళ
కీసర, ఆగస్టు 17: నాగారం మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్‌గా కీసర మండల ఎంపీడీవో శశిరేఖ శనివారం బాధ్యతలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కమిషనర్ పల్లారావును ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసారు. ఇటీవల మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి నాగారం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. శశిరేఖకు బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ మేనేజర్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.