AADIVAVRAM - Others
ఒక ప్రవాహమై ఉప్పొంగుతున్నప్పుడే...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 17 August 2019
-సాంబమూర్తి లండ 9642732008
ఉన్నట్టుండి
ఏదో నిప్పు రాజుకుంటుంది
ఒక వాక్యమై
ఒక నినాదమై!
ఉన్నట్టుండి
ఏదో ఊహ పురుడు పోసుకుంటుంది
ఒక పదమై
ఒక ప్రవాహమై!
ఉన్నట్టుండి
ఏదో ఆవేశం ఎగసిపడుతుంది
ఒక ఉప్పెనై
ఒక కవిత్వమై!
ఉన్నట్టుండి
ఏదో నిర్వేదం పెనవేసుకుంటుంది
ఒక గాయమై
ఒక గేయమై!
ఉన్నట్టుండి
ఏదో ఒక ఆలోచన వికసిస్తుంది
ఒక పద్యమై
ఒక గద్యమై!
లెక్కలేసుకుని
చుక్కలు చూసుకుని
రాసుకోనక్కర్లేదు కవిత్వాన్ని
ప్రవాహమై ఆలోచన ఉప్పొంగుతున్నప్పుడే
దోసిలిపట్టి అక్షరాల్లోకి ఒంపుకోవాలి!
మనసు పుస్తకం మీద రాసుకోవాలి!!
సానబెట్టుకుని
నానబెట్టుకొని
రాసుకోనక్కర్లేదు కవిత్వాన్ని
ఒక భావావేశపు చినుకు తడుపుతున్నప్పుడే
ఒక కవిత్వపు వితె్తై పలకరించాలి!
అనుభూతి వృక్షమై విస్తరించాలి!!
*