క్రీడాభూమి

భారత్‌కు ఆరు పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బల్గేరియా, ఆగస్టు 11: బల్గేరియన్ జూనియర్ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఆరు (మూడు స్వర్ణ, ఒక వెండి, రెండు కాంస్యాం) పతకాలను సాధించింది. ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో సామియా ఇమాద్ ఫారుఖి రెండో సీడ్ రష్యాకు చెందిన అనస్తాసియా షాపోవాలోవాను 9-21, 21-12, 22-20తో ఓడించి స్వర్ణం పతకాన్ని ముద్దాడింది. మిక్స్ డ్ డబుల్స్‌లో నెంబర్ 2 బ్రిటీష్ జంట బ్రాం డన్ హిహవో, అబ్బిగెల్ హరీస్‌ను ఎడ్విన్ జా య్, శ్రుతి మిశ్రా ఓడించింది. 21-14, 21-17తో ఇంగ్లీష్ షట్లర్లు ఈ జంట ఓడించిం ది. అలాగే ఉమెన్స్ డబుల్స్ ఫైనల్‌లో భారత జంట తనీషా క్రాస్టో, అదితి భట్ తమ విజ య పరంపరను కొనసాగించారు. వీరిద్దరూ టర్కీ జంట బెంగిసు ఎర్సెటిన్, జెహ్రా ఎర్డ్ ఎఫంను 21-15, 18-21, 21-18 తేడాతో ఓ డించి స్వర్ణం కైవసం చేసుకున్నారు. ఇక పురు షుల డబుల్స్ ఫైనల్‌లో ఇషాన్ భట్నాగర్, విష్ణువర్దన్ జోడీ బ్రిటీష్ పెయర్ విలియమ్ జోన్స్, బ్రెండన్ హిహావో చేతిలో 19-21, 18-21 తేడాతో పరాజయం పాలై సిల్వర్‌తో సరిపెట్టుకుంది. మరో సింగిల్ ఈవెంట్స్ సెమీ ఫైనల్‌లో మాలవిక బన్సోదు 13-21, 15-21 నెంబర్ 2 సీడ్ అనస్తాసియా షాపోవాలోవా చేతిలో ఓడిపోగా, మెయరబ లువాంగ్ రష్యాకు చెందిన జర్జి కర్పోవ్ చేతిలో 19-21, 21-12, 18-21 తేడాతో పరాజయం చెందింది. సెమీ ఫైనల్‌లో ఓడిన భారత క్రీడాకారిణు లిద్దరూ కాంస్య పతకాలను సాధించారు.