శ్రీ కృష్ణామృతం

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. పూరి గుడిసెయే క్షణములో భూరి భవన
మయ్యె గోడలున్ కాంచన మయములయ్యె
ముసలి దగు ధేనువొక్కటి మసలు చోట
ఆలమందలు దండిగా నలరు చుండె
భద్రగజములు ముంగిట బరగు చుండె
ఆలుబిడ్డలు జేసెడు గోల తప్ప
అన్యమెరుగని ఇంటిలో అనవరతము
సరస సంగీత వనమాలి కరుణ చేత!
*
భావం: కుచేలుడు తనప్రియసఖుడైన శ్రీకృష్ణుని దర్శించాడు. శౌరి ప్రేమతో అతనిని ఆదరించాడు. సఖునికి అంతులేని ఐశ్వర్యాన్నిచ్చాడు. తిరిగి తన ఇంటికి వచ్చిన కుచేలుడికి పూరి గుడిసె స్థానంలో గొప్ప భవనం దర్శనమిచ్చింది. ఇతఃపూర్వం ముసలి ఆవు ఒకటి ఇంటి ముందు ఉండేది. ఇపుడు ఆవులు మందలు మందలుగా ఇంటి ముంగిట తిరుగాడుతున్నాయి. భద్ర గజములు ఇంటి ముంగిట అలంకారం గా నిలిచి ఉన్నాయి. ఒకప్పుడు బహు సంతానవంతుడైన కుచేలుని ఇంటిలో ఎప్పుడూ అరుపులు, కేకలూ ఉండేవట. ఇప్పుడుమాత్రం చక్కగా నృత్య సంగీం కళావినోదాలత అతని ఇల్లు విలసిల్లుతోందట. అవి అన్నీ తనకు సఖుడు, ఆత్మ బంధువు ఐన శ్రీకృష్ణుని వల్లనే నని భావించి భక్తితో ఆ దంపతులు ఆనందించి నమస్కరించారు.

డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949