శ్రీ కృష్ణామృతం

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ సూర్య చంద్రులు ధర వెల్గు చుండు వరకు
ఇలను కుల పర్వతంబులు పొలయు వరకు
హరిని ధ్యానించు వారల నమల మతుల
చల్లగా జూడు మోయమ్మ తల్లి భూమి
పాపకర్ముల కేమైన బాధలేదు
భావం: అమ్మా! భూమాతా! భూమిపై సూర్యచంద్రులు వెలుగుతున్నంత వరకు, మహాపర్వతాలు నిలిచియున్నంత వరకూ నిర్మలమైన హరిభక్తి గలవారిని రక్షిస్తూ ఉండు తల్లీ. పాపకర్లుకు రాక్షసులకూ ఏమైనా మాధ లేదు. (సర్వానంద)
తే.గీ. మహిత కవిసార్వ భౌమ త్వమడుగబోను
అతుల సౌందర్య రాశుల నడుగ బోను
అనుచరుల కోట్ల సంఖ్యలో నడుగబోను
గాని, నీపాదయుగముపై కమ్ర భక్తి
అన్ని జన్మాల కలుగంగ నంజలింతు
భావం: కృష్ణా! కవిసార్వభౌమత్వాన్నీ కోరుకోను. సాటిలేని సౌందర్యరాశుల నిమ్మనీ అడుగబోను. కోట్లాది అనుచరుల నిమ్మనీ అడుగను గానీ నీపాదపద్మాలపై నిశ్చల భక్తి అన్ని జన్మాల లోను కలిగేటట్లుగా నన్ను అనుగ్రహించు. (శ్రీచైతన్య మహాప్రభువు)

డి.వి.ఎమ్. సత్యనారాయణ 98858 46949