క్రీడాభూమి
హెలికాప్టర్ షాట్ ధోనీ ఇష్టపడ్డాడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: తను కొట్టిన హెలికాప్టర్ షాట్లను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇష్టపడినట్లు ముం బై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్దిక పాండ్య పేర్కొన్నాడు. మరో వైపు ఈ సీజన్ ఐపీఎల్లో పాండ్య చక్కగా రాణిస్తున్నాడు. ఆడి న తొమ్మిది మ్యాచుల్లో 194.64 స్ట్రైక్ రేట్‌తో 218 పరుగులు చేయగా, ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరి గిన గత మ్యాచ్‌లో 15 బంతుల్లోనే 32 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్లు కోల్పోయ 168 పరుగులు చేయగా, లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో ఓడి పోయన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణిం చిన పాండ్యను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
మళ్లీ హెలికాప్టర్ షాట్..
ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్‌లో రబడ వేసిన చివరి ఓవర్ రెండో బంతిని హెలిక్యాప్టర్ షాట్ ఆడి సిక్సర్‌గా మలిచాడు. ఈ షాట్‌కు పెట్టింది పేరు ధోనీ. అయతే వాంఖడేలో చెన్నైతో జరిగిన మ్యాచులోనూ పాండ్య హెలికాప్టర్ షాట్ కొట్టిన విష యం తెలిసిందే. ఈ మ్యాచులోనూ ముంబై గెలిచింది.