జాతీయ వార్తలు

బీడీ కార్మికులకూ ఇఎస్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: దేశంలో కోటికిపైగా ఉన్న బీడీ కార్మికులకు ఇఎస్‌ఐ ద్వారా వైద్యసేవలు అందించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ నిర్ణయించారు. కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని 12 ఆసుపత్రులు, 292 డిస్పెన్సరీలను ఇఎస్‌ఐ పరిధిలోకి తీసుకుస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయా ఆసుపత్రులు, డిస్పెన్సరీ లన్నింటిలో ఇక మీదట బీడీ కార్మికులకు వైద్యసేవలు అందుతాయని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వలన దేశంలోని పదిహేడు రాష్ట్రాల్లో ఉన్న బడుగు, బలహీన, మైనారిటీ బీడీ కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని అఖిల భారతీయ బీడీ మజ్దూర్ సంఘ్ జాతీయ కార్యాధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్, జాతీయ కార్యదర్శి ఎం.సుధీర్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.