జాతీయ వార్తలు
చెన్నైలో ఐపిఎస్ అధికారి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 18 February 2016
చెన్నై: ఇక్కడ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్. హరీష్ అనే 32 ఏళ్ల ఐపిఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం ఉదయం కార్యాలయ సిబ్బంది కనుగొన్నారు. స్ట్ఫా క్వార్టర్స్‌లో ఉంటున్న ఆయన ఉదయం పదిన్నర గంటలైనా బయటకు రాకపోవడంతో సిబ్బంది గది తలుపులు బలవంతంగా తెరిచి చూడగా ఆయన మృతదేహం కనిపించింది. కర్నాటకకు చెందిన ఈయన తనకు పదోన్నతి విషయంలో ఉన్నతాధికారులు అన్యాయం చేస్తున్నారని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.