S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/07/2016 - 22:44

టూ పీస్ బికినీలో సంచలనం క్రియేట్ చేసిన హాట్‌భామ అమీజాక్సన్ ప్రస్తుతం రజని సరసన ‘రోబో-2’ చిత్రంలో నటిస్తోంది. ఇదివరకే శంకర్ దర్శకత్వంలో ‘ఐ’ సినిమాలో నటించిన ఈ భామ తెలుగులో రామ్‌చరణ్ సరసన ‘ఎవడు’ సినిమాలో నటించింది. ప్రస్తుతం సౌత్‌తోపాటు హిందీలో కూడా సినిమాలు చేస్తున్న అమీ ఇప్పుడు ఓ వ్యాపారం మొదలుపెట్టిందట.

09/07/2016 - 22:43

రామ్‌శంకర్, నికిషాపటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అరకురోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

09/07/2016 - 22:42

శ్రీకాంత్, అక్ష జంటగా కరణం బాబ్జీ దర్శకత్వంలో ఎస్.కె.కరీమున్నీసా రూపొందించిన చిత్రం ‘మెంటల్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 9న విడుదలవుతోంది.

09/06/2016 - 21:27

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందని చాలారోజుల క్రితమే దాసరి ప్రకటించారు. అలాగే దాసరి నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నట్లు పవన్‌కూడా ధ్రువపరిచారు. ఈ న్యూస్ వచ్చి చాలా రోజులే గడిచాయి. కానీ ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్‌పైకి రాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సన్నాహాలు జోరందుకున్నట్టు తెలిసింది.

09/06/2016 - 21:26

రవితేజ కథానాయకుడిగా శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. విక్రమ్ సిరి ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన ఆయన దర్శకుడిగా రూపొందించే ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

09/06/2016 - 21:25

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్, తన మొదటి సినిమాతోనే దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత ఆయన ‘జ్యో అచ్యుతానంద’ అనే మరో రొమాంటిక్ కామెడీతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు. నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈనెల 9న విడుదలవుతోన్న సందర్భంగా దర్శకుడు అవసరాల శ్రీనివాస్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..

09/06/2016 - 21:23

‘ప్యూర్ లవ్‌స్టోరీలు వచ్చి చాలాకాలమైంది. మా బ్యానర్‌లో వస్తున్న నిర్మలా కానె్వంట్ ప్రెష్‌గా ప్యూర్‌గా వుంటుంది. ఈ కథ వినగానే ఇన్‌స్పైర్ అవుతారు’ అని నాగార్జున తెలిపారు. శ్రీకాంత్ తనయుడు రోష్ కథానాయకుడిగా పరిచయంచేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్, మాట్రిక్స్ టీం వర్క్స్, కానె్సప్ట్ ఫిలిం ప్రొడక్షన్ పతాకంపై జి.నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నిర్మలా కానె్వంట్’.

09/06/2016 - 21:18

శివ జొన్నలగడ్డ హీరోగా శివ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం గణేష్ ద లీడర్ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం మంగళవారం హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకుడు సాగర్ క్లాప్ ఇవ్వగా సారిపల్లి కొండలరావు స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో, దర్శకుడు శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ..

09/06/2016 - 21:17

రామ్ కథానాయకుడిగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర రూపొందిస్తున్న చిత్రం ‘హైపర్’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ జార్జియాలో జరుగుతోంది. అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించే ఈ పాటలతో షూటింగ్ పూర్తికానుంది.

09/06/2016 - 21:15

నాగచైతన్య, శృతిహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన తారాగణంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చందూ మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. చిత్రంలోని ‘బ్యాంగ్ బ్యాంగ్’ పాటను ఈ నెల 8న విడుదల చేయనున్నారు.

Pages