S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న హీరో ప్రభాస్. ఈ సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు రావడంతో పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘బాహుబలి-2’ చిత్రం షూటింగ్లో బిజీగా వున్నాడు. ఈ ఏడాది మొత్తం ఈ సినిమాకే టైమ్ కేటాయించాడు. ఈ సినిమా తర్వాత ఆయన నటించే తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి.
కుటుంబ కథాచిత్రాల దర్శకుడిగా మంచి పేరుతెచ్చుకున్నాడు మదన్. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘గరం’. ఆది, ఆదాశర్మ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని, ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మదన్ చెప్పిన విశేషాలు.
కథ గురించి?
శ్రీనివాసులు, శిల్ప, మేఘన ముఖ్యపాత్రల్లో శ్రీ వెంకటసాయి ఫిలిమ్స్ పతాకంపై ఎస్.శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘యువతేజం’. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. అనంతరం దర్శకుడు, హీరో శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం గాంధీతత్వాన్ని, దేశభక్తిని మరిచిపోతున్నామని, అదే అంశంతో అందరికీ నచ్చేలా తెరకెక్కించిన సినిమా ఇదన్నారు.
ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుపుకుంటోంది. ఐదురోజులపాటు ఏకధాటిగా జరిగే షూటింగ్లో హీరోయిన్ కాజల్ కూడా పాల్గొంటుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన విడుదల హక్కుల్ని ప్రముఖ సంస్థ ఏరోస్ సొంతం చేసుకుంది.
ఆదిత్యా క్రియేషన్స్ పతాకంపై సోనాలి, ఆదిత్యా జంటగా కోట మునీష్ దర్శకత్వంలో లక్ష్మీ శ్రీవాస్తవ రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమికులపై పీహెచ్డీ. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత లక్ష్మీ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నాయని తెలిపారు.
అజయ్ , భరత్, అర్జున్, వెంకటేష్, సుస్మితా ప్రధాన తారాగణంగా భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్రాజ దర్శకత్వంలో భరత్‌కుమార్ పీలం రూపొందించిన చిత్రం ‘రాజుగారింట్లో 7వ రోజు’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఏ సర్ట్ఫికెట్ లభించింది.
ఈ సంక్రాంతికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ నటుడు శర్వానంద్ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. రన్‌రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యువ నటుడు విభిన్నమైన కథా చిత్రాన్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా మరో యంగ్ డైరెక్టర్‌కు ఓకె చెప్పాడట.
నవీన్ సంజయ్, వౌనిక జంటగా కావేరీ ట్రావెల్స్ పతాకంపై తమ్మినేడి సతీష్‌బాబు దర్శకత్వంలో ఎంపీనాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘జానకిరాముడు’. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తికావస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.
బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ‘క్వీన్’ చిత్రం త్వరలో దక్షిణాది భాషల్లో రీమేక్ కానుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ దర్శక నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా పూర్తికావాలి. కానీ సరైన నటీనటులు దొరకకపోవడంతో ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సీనియర్ నటి, దర్శకురాలు రేవతి సన్నాహాలు చేస్తోంది.
ఈమధ్య కాలంలో బాలీవుడ్లో లిప్‌లాక్‌లకు కొదవే లేకుండాపోయింది. ఏ సినిమాలో చూసినా అవసరం వున్నా లేకున్నా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఈ తరహా లిప్‌లాక్ సన్నివేశాలతో రక్తికట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ముద్దుసన్నివేశంతో సంచలనం సృష్టిస్తోంది నాటి గ్లామర్ తార కాజోల్. వెండితెరపై ఎవర్ గ్రీన్ లవ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న కాజోల్, షారూఖ్‌ల జంట అంటే అందరికీ క్రేజే.