జాతీయ వార్తలు
‘జెడ్’ కేటగిరీ భద్రత తీసుకోండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 24 January 2016
పనాజి, జనవరి 23: ఐఎస్ఐఎస్ నుంచి బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌కు ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పిస్తామని, ఈ మేరకు ఆయనను కోరడం జరిగిందని గోవా ఎస్పి బోస్కో జార్జ్ శనివారం విలేఖరులకు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని, పారికర్‌ను చంపుతామంటూ జనవరి 13న ఐఎస్ఐఎస్ పేరుతో ఒక లేఖ వచ్చిందని, దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. అయితే రాష్ట్రానికి వచ్చినప్పుడు ‘జెడ్’ కేటగిరి భద్రత తీసుకోవాలని సూచించామన్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు వినియోగిస్తున్న వైర్లెస్ సెట్లను మార్చనున్నామని, ఫిబ్రవరి 1 నుంచి ఇవి వినియోగంలోకి వస్తాయని తెలిపారు.