జాతీయ వార్తలు

హైకోర్టు తీర్పును స్వాగతించిన యార్లగడ్డ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: తమిళనాడులో తెలుగు, కన్నడ, మళయాలం, ఉర్దూ విద్యార్థులకు వారి మాతృభాషలోనే పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు స్వాగతిస్తున్నామని కేంద్రీయ హిందీ సమితి సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. తమిళనాడులో భాషా అల్పసంఖ్యాక వర్గాలు 2006 తమిళ భాషా చట్టాన్ని రద్దు చేస్తామన్న పార్టీకే ఓట్లు వేయాలని యార్లగడ్డ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆశ్రయించనున్నట్టు ఆయన వెల్లడించారు. భారత రాజ్యాంగంలోని 351 ఏ అధికరణను ఉపయోగించి కేంద్ర హోం శాఖ రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని రద్దు చేసి తమిళనాడు భాషా అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలు కాపాడాలని ఆయన కోరారు.