జాతీయ వార్తలు

తమిళనాడులో జయ, బెంగాల్‌లో మమత: 5 రాష్ట్రాల్లో జోరుగా కౌంటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఏయే రాష్ట్రాల్లో ఏయే పార్టీలు ఆధిక్యతలో ఉన్నాయో కౌంటింగ్ సరళి చెబుతోంది. తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకె మరోసారి అధికారం చేపట్టేదిశగా సాగుతోంది. పశ్చిమబెంగాల్‌లో ముఖ్యమంత్రి మమత బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కేరళలో ఎల్‌డిఎఫ్, అస్సాంలో బిజెపి ఆధిక్యతను చూపుతుండగా పుదుచ్చేరిలో పరిస్థితి పోటాపోటీగా కనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చెన్నై నగరంలో మాత్రం జయ పార్టీ వెనుకంజలో ఉంది. నగరంలోని 16 స్థానాల్లో 11 చోట్ల డిఎంకె, 5 చోట్ల అన్నాడిఎంకె ఆధిక్యతలో ఉన్నాయి. కాగా, తమిళనాడులో డిఎండికె పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్, కేరళలోని తిరువనంతపురంలో మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తమ ప్రత్యర్థుల కంటే వెనుకబడి ఉన్నారు.