జాతీయ వార్తలు

వెయ్యేళ్ల సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివేకానందుడి విగ్రహావిష్కరణ సభలో మోదీ
కౌలాలంపూర్, నవంబర్ 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని రామకృష్ణ మిషన్‌లో స్వామి వివేకానందుడి 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన వారిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ, వివేకానందుడు కేవలం ఒక వ్యక్తి పేరో లేక వ్యవస్థకు గుర్తింపో కాదని వెయ్యేళ్ల భారతీయ సంస్కృతికి ఆయన నిలువెత్తు నిదర్శమని పునరుద్ఘాటించారు. ఆసియా ఖండంలోని దేశాలన్నీ ఒకటిగా ఉండాలని (ఒకే ఆసియా) తొలుత సందేశమిచ్చిన మహానుభావుడు వివేకానందుడేనని, ఇప్పుడు ఆసియాన్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న దేశాధినేతలంతా ఈ సందేశం గురించే మాట్లాడుతున్నారని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్రస్థాయిలో పట్టిపీడిస్తున్న పర్యావరణ, తీవ్రవాద సమస్యల పరిష్కారానికి వాస్తవిక దృక్పథం ఎంతో అవసరమని, సంఘర్షణలు అంతమైతేనే తీవ్రవాదం అంతమవుతుందని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రెండు వేల మందికి పైగా ప్రవాస భారతీయులు, మలేషియాలోని భారత సంతతి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.