వీరాజీయం

అనిల్ ద జంబో.. శిక్షణరంగ ప్రవేశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోచ్‌కోసం వేట ముగిసింది. ‘ద్రోణాచార్యుడు’ దొరికాడు. కొండ తలక్రింద పెట్టుకుని రాయికోసం వెతుక్కున్నట్లు ఇండియన్ క్రికెట్ బోర్డు- పదిహేను మాసాలైంది పరదేశీ బాబుల వెంట పడి విసిగివేసారి అప్లికేషన్‌లు పిలిచింది..
దేశం క్రికెట్ రంగంలో కూడా ఏమీ గొడ్డుపోలేదు. హేమాహేమీలు- అనేక యుద్ధముల- నారియుతేరిన (వృ)యుద్ధమూర్తులు ఏభైఏడు మంది దరఖాస్తులు- ఎటువంటి దాపరికమూ లేకుండా పడేశారు. కొత్త బోర్డు కొత్త ఒరవడికి అంకురార్పణ చేసింది. అందుకు బోర్డుని కూడా ముందుగా అభినందించాలి.
‘‘్ఛ...్ఛ’’ అనిపించుకొని ఛాపెల్ దొర వెళ్లిపోయాకా పేపర్ వెయిట్ లాంటి డంకన్‌ఫ్లెచర్ వచ్చాడు. దాంతో పరదేశీ బాబుల మీద మోజు తగ్గిపోయింది. ఒకప్పుడు పిలిస్తే రాలేనన్న రవిశంకర్‌శాస్ర్తీ టీమ్ డైరెక్టర్‌గా 18 మాసాలుగా- గడుసుగానే కొనసాగాడు అతనుకూడా ‘కోచ్’పోస్ట్‌కి దరఖాస్తు పోస్టులో పడేయడం- రుూసారి ఎంపికలోని పారదర్శకతకి మచ్చుతునక.
లాబీయింగ్‌లు, పైరవీలు, సిఫార్సులు వగైరాలు లేవు. వడపోతలు మొదలయినాయి. మనకి క్రికెట్‌లో పంచపాండవులనదగ్గవాళ్లు ఐదుగురున్నారు యివాళ. సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, అనిల్‌కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ అండ్ వి.వి.యస్.లక్ష్మణ్‌లు. వీళ్లల్లో ముగ్గుర్ని సలహా సంఘంగా పెట్టేశారు బోర్డువారు.
ఈ కోచ్ పోస్ట్‌కి టామ్‌మూడీ, స్టూవర్ట్‌లా, ఆండీమోల్స్‌లు కూడా పోటీలో వున్నారు. చివరికి రుూ కోచ్ పదవి మీద మోజు ఎంత ఎక్కు వున్నదీ అంటే, సెలక్షన్ కమిటీ బాస్ సందీప్ పాటిల్- (ఓపిక వుందా?) కూడా అప్లికేషన్ పెట్టుకున్నాడు. వీళ్లలో జంబో ద అనిల్ కుంబ్లే సీరియస్‌గా ఒక పకడ్బందీ ప్రణాళిక కూడా వేసుకుని పోటీకి దిగటంతో ఎంపిక వ్యవహారం రంజుగా సాగింది.
57 లిస్టును 21 లిస్టుగా, పరిశీలనానంతరం కుదించారు. చివరికి రవిశంకర్‌శాస్ర్తీ, అనిల్‌కుంబ్లేలు యిద్దరూ రంగంలో మిగిలారు. ఇంటర్‌వ్యూలు కూడా సీరియస్‌గా సుదీర్ఘంగా -దూరంగా, ‘‘్ధర్మశాల’’లో జరిగాయి. ఎన్నో రకాల అనుభవం, పలుకుబడి వగైరాలున్న రవిశాస్ర్తీ- మీద సలహాదారులు శీతకన్ను వేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, సాఫ్ట్ స్పీకింగ్ అనిల్‌కుంబ్లే (45) మెడలో వరమాల వేశారు. భేష్!
‘కుంబ్లే ద జంబో’ అంటారంతా. నిలువెత్తు మనిషి. పిచ్ మీద నుంచి తప్పుకున్నా జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ రంగంలో కీలక పదవులు ధరించి, పదుగురిమన్ననా పొందుతూ నిభాయిస్తున్న అనిల్‌కుంబ్లేకి కోచ్‌గా అనుభవం మాత్రం లేదు. కానీ, అతను మన దేశ క్రికెట్‌కి కోహినూర్ రత్నంలాంటివాడు. తిరుగులేని బౌలింగ్ రికార్డు అతనిది. మచ్చలేని- పద్ధెనిమిది సంవత్సరాల టెస్ట్‌క్రికెట్ కెరీర్‌లో చరిత్ర సృష్టించిన, అనితర సాధ్యమైన రికార్డు అతనిది. 619 టెస్ట్ వికెట్లు, 337 ఒన్‌డే పోటీ వికెట్లు- అతను ఆడుతూ, పాడుతూ, అందర్నీ ఆనందపెడుతూ సాధించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు- కేవలం 24 పరుగులు యిచ్చి- లాక్కొని ఇండియాని పాకిస్తాన్ మీద గెలిపించిన - ‘జంబో’కి- యివాళ పెద్దలూ, పిన్నలూ ఆటగాండ్రూ అందరూ రెండుచేతులూ చాపి స్వాగతం చెబుతున్నారు.
‘‘నాకు క్రికెట్ చాలా యిచ్చింది. నన్నింతవాణ్ని చేసింది. నేనా రుణం తీర్చుకోవాలి. వెస్ట్‌ఇండీస్ టెస్ట్ సిరీస్‌ని గెల్చుకురావడంతో మొదలుపెట్టి నేను ఆ రుణం తీర్చుకునే బాధ్యతను మొదలెడతాను’’అన్నాడు అనిల్.
అతనిని గూగ్లీ, లెగ్‌బ్రేక్ బౌలరు అంటారు గానీ బంతి తిరగడం ఎవరికీ కనిపించదు. టాప్- స్పిన్నర్ నేలమీద ఎప్పుడు పడుతుందో ఎలా ‘చక్‌మా’యిస్తుందో- హేమాహేమీ బ్యాట్స్‌మెన్‌లే చెప్పలేకపోయారు. అదో గమ్మత్తు.
పాక్ టీముకి జంబో అంటే హడల్. అతని బౌలింగ్ స్టయిలే వేరు. చూడముచ్చటగా వుంటుంది. అతని బౌలింగ్ పరుగు-వొంకర్లు, మెలికలు సర్కస్ విన్యాసాలు గట్రా వుండవ్. జంటిల్మన్ స్టయిలు. కానీ ప్రపంచంలోని అతి సమర్ధవంతమయిన బ్యాట్స్‌మన్ అంతా ఎప్పుడో ఒకప్పుడు అతని బంతి యిచ్చిన ‘షాక్’కి గురిఅయి కాళ్లకి కొట్టేసుకుని- ఎల్.బి.డెబల్యూ అయిపోయిన వాళ్లే. లెగ్ బిఫోర్ వికెట్లకి కూడా అతనిదే రికార్డు. 156 మంది బ్యాట్ వీరులు అతని బంతులకి మోకాళ్లు అప్పగించేశారు. (నెం.1 అతనే!)
అలాగే ఇంజమామ్ ఉల్‌హక్ లాంటి ‘గోడల్ని’కూడా ఛేదించి అతని బంతి- డక్‌ఔట్ చేస్తూ వుండేది, 77 మందికి ‘సున్నా’లు ప్రెజెంట్ చేసిన ఘనత అతనిది.
అనిల్ ది గ్రేట్ బౌలర్ ప్రపంచంలో వికెట్‌ల సంఖ్య విషయంలో ముత్తయ్య మురళీధరన్, షేన్‌వార్న్‌ల తర్వాత మూడోస్థానంలో -యింకా చాలా కాలం రికార్డును అట్టేపెట్టేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయ్. కాని జంటిల్మన్ బౌలర్.
38 సంవత్సరాల వయసులో టీమ్ క్యాప్టెన్‌గా దేశ పరువుప్రతిష్టలను కాపాడుతూ, ప్రత్యర్థుల మన్నన కూడా అందుకున్న ఘనత- ‘మంకీ గేట్’లాంటి విపత్కర స్థితిని చాకచక్యంగా ఎదుర్కొన్న క్యాప్టెన్ కూడా అతడే! ‘‘కూల్ ధోనీ, హాట్ కొహ్లీలకు యిద్దరికీ సరియైన మందు కుంబ్లే దగ్గర వుంది’’- అంటున్నారంతా. ఓ.కే. వెల్‌కమ్!. ‘‘్భష్!’’.
‘‘నేను కోచ్‌ని కాదు. పెద్దన్నయ్యని.’’
మైదానం మీద, వెలుపలా కూడా అలాగే వుంటాను అన్నాడు అనిల్‌కుంబ్లే. ‘‘ముందా యిద్దరు నాయకులతోనూ మాట్లాడాలి’’ అన్నాడు. నాట్ ఔట్ సెంచురీ వుంది అతనికి. 172 యిన్నింగ్స్‌లో - 32 నాట్ ఔట్లుకూడా వున్నాయి.
బ్యాటింగ్ రాదనుకోకండి. సమర్ధుడు, దక్షుడుగా రాణించాలనే అందరి ఆశా. అయినా ఒక్క ఏడాదికే అపాయింట్‌మెంట్ యిచ్చిన బోర్డుని కూడా మెచ్చుకోవాలి- జంబోకి జేజేలు!
‘సో, వుయ్ గాట్ అవర్ జంబో కోచ్!’’