వీరాజీయం

భోజనం తెచ్చుకుని మాఇంట ఆరగించండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దళితుల ఇంట భోజనమా? దళితుల ఆతిథ్యమా? ఏది నిజం?- ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లా లోహగఢ్‌లో ఈ మధ్య ఒక చిత్రం జరి గింది. భాజపా మంత్రి సురేష్‌రాణా గారి అనుచరులు-ఒక దళి తుడి ఇంటికి పోయి టకటక తలుపులు కొట్టారుట. కళ్లు నులుము కుంటూ ఆ ఇంటి- నిరుపేద ఆసామీ తలుపు తెరిచేసరికి ఎదురుగా మంత్రి గారి అనుచరులు ప్రత్యక్ష మయ్యారు. ‘మాసారూ, మీ ఇంట్లో భోజనం చేస్త్తారు తక్షణం ఏర్పాట్లు కానివ్వమన్నారు’ట.. ‘అయ్యా! క్షమించాలి.. మా ఆడంగులు లేరయ్య .. వూరు వెళ్ళారు’ అని చెప్పాడుట. ‘మరేమీ ప్రాబ్లెం లేదు- మేము భోజనం తెప్పిస్తున్నాములే’-అని అతనిని ప్రక్కకి నెట్టి , క్యారియర్లు తెప్పిం చుకొని -వడ్డనలు చేసేసుకుని మంత్రి గారి భ్రుత్యులు ఇంచక్కా ఆరగింఛి వెళ్ళిపోయారుట. చివరికి మంచి నీళళు కూడా ఆ ఇంట్లోవి వాళళు తాగలేదు కాని -‘దళితుని ఇంట మంత్రి రాణాగారి భోజనం’ అని పబ్లిసిటీ దంచేశారు . మర్నాడు ఒక ఆంగ్ల పత్రిక విలేఖరికి సదరు దళితుడు - ‘అయ్యా.. నాకొక్క మెతుకు కూడా పెట్ట లేదయ్యా. అసలు నన్ను ఆ ఇంటి పెద్దని వాళళు గుర్తించనే లేదు.’ అన్నాడుట
మరో సంఘటనలో ఝాన్సీ జిల్లాకి చెందిన ఓ గ్రామం మీదకి పోయి భాజపా మహిళా మంత్రి అనుపమా జైస్వాల్ రాత్రి పూట మకాం చేశారు. ఎన్నికల పోరాట అంబులపొదిలో - దళితుల ఇంట భోజనం చెయ్యడం అన్నది ఒక ‘అంబు’ అయిపోయింది భాజపాకి. ‘రాత్రి తెల్లవార్లు దోమలు కుట్టేస్తూన్నా భరించి దళితుల ఇంట గడిపేమని మంత్రి ప్రకటించింది. దళితులకు వారి కోసం మేము చెసే త్యాగాలు చెప్పడం కూడా కార్య క్రమంలో ఒక భా గమని ఆమె బాధతో (దోమ లు పీక్కుతిన్నాయట పాపం) చెప్పింది. దళితుల కోసం భాజపా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వారికి చెప్పడం కోసం మేము పడుతున్న బాధలు, చేస్తున్న త్యాగాలు.. ఎన్నో అంటో మంత్రి ఓ లెక్చరు దంచేసింది. ‘ఒక్క ఆరోజుకే మీరు అంత ఇది అయిపోతే నిత్యమూ ఇక్కడ ఉండేవారు ఏమనుకోవాలని విలేఖర్లు ప్రశ్నించే సరికి ఆమె -నీళ్లు నమిలేరుట. అంతకుముందే మరో ఉత్తర ప్రదేశ్ మంత్రి రాజేంద్రసింగ్- తమ ముఖ్యమంత్రి యోగి ఒక దళితుని ఇంట విందు తెప్పించుకొని అరగించడం విషయం ప్రస్తావించి -వెనుకటికి శ్రీరామచంద్రుడు శబరి పెట్టిన పండ్లు తిని ఆమె ని ఉద్ధరంచినట్లు - యోగి దళితులను పునీతులను చేశాడని గొప్పగా వక్కాణిం చగా - జనం ముక్కున వేలేసుకున్నారుట.
ఇది దళితులను కించపరచడమే నని తిరుగుబాటు భాజపా ఎంపి సాధ్వి సావిత్రి ఫూలే తీవ్రంగా బాహాటంగానే తిట్టిపోసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దళితుల మధ్యకి పోయి వారు వండినవి వారి పాత్రలలో, కం చాలలో వడ్డించుకుని ఆరగించాలి కాని వనభోజనానికి -పోయినట్లు -పోవడం సమంజసం కాదని ఆమె విమర్శించడం తో మరికొంతమంది పార్టీ నాయ కులకు ఊతం అయింది. ‘‘సమస్తమూ స్టార్ హోటల్స్ నుంచి కొని పట్టుకుపోయి వాళ్ళ ఇండ్లకి పోయి అక్కడ తినడమెందుకు? అని ఒక్కక్కరు నోరు విప్పుతూ ఉండడంతో పార్టీ ప్రయత్నం బెడిసి కొడుతున్నదేమోనని అగ్రనాయకులకు అనుమానం వస్తున్నాదిట. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగత్ కూడా ఇక ఈ ప్రహసనం కట్టిపెట్టండి అన్నట్లు పత్రికలు పేర్కొన్నాయి. వాళ్ళను’ మీ మీ ఇండ్లకు ఆహ్వానించి - మీతో పాటు భోజనం వడ్డించి తినిపించడం గొప్ప కాని -వందల గ్రామాలలో సంచలనం అంటూ హోటలు లేదా ప్రత్యెక వంటలు తీసుకుని పోయి హంగామా చెయ్యడం సబుబా? .
ఎంపీ మాజీ ముఖ్యమంత్రిౄ ప్రస్తుత కేంద్ర మంత్రి అయిన ఉమా భారతి దళితుల విందులో తాను భోజనం చేయనని అన్నట్టు పెద్ద గొడవ జరగి పోయింది. నేనేమైన రాముల వారినా? దళితులతో కల్సి భోజనం చేసి వారిని పవిత్రులను చెయ్యడానికి అని ఆమె వ్యాఖ్యానించడం ఎందరో తప్పు పట్టారుట. తనకి దళితులతో కలసి కార్యక్రమం వున్నట్లు తెలియదని- ముందే భోజనం చేసి సభకు వచ్చానని, అంతే తప్ప మరో కారణం లేదని తప్పుకున్నాదట. ఇటువంటి సంఘటనలు ఉత్తరాదిలో జరగటంతో దళిత నాయకులూ, కొంత మంది ఎంపీ లు సహా -తీవ్రమైన మనస్తాపానికి గురవుతూ వుండటంతో ఈ హిపోక్రు బూమ్ ర్యాంగ్ అవుతుందేమో? అన్న భయం పట్టుకున్నట్లుగా వుంది బిజెపి శ్రేణులకు . ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగత్ ఇటీవల- ‘‘ మీరు వాళ్ళ ఇండ్లకు పోయే బదులు దళితులని అగ్ర కులస్తులు అనుకున్న వాళళు తమ ఇళ్లలో భోజనం పెట్టవచ్చును గా-వారితో కలసి ముచ్చట్లాడుతూ భోజనం చెయ్య వచ్చును కదా? అన్నట్లు వినికిడి.
దళితులా? దళితేతరులా? అంటూ ఈ నవీన యుగంలో పట్టణాలలో నగరాలలో తెలుసుకోడం కష్టం. సినిమాలు, హోటల్స్‌లో, రైళ్లు, బస్సులలో ఎవరు ఎవరన్నది ఎవరికీ పట్టదు. ఎదురుగా వున్నది ఎవరు? -నీకు వడ్డి స్తున్నది ఎవరు? అనే సందేహమే రాదు. పొలిటికల్‌గా ఇటువంటి అట్టహాసం చెయ్యడం దండగ అనే వాళళు ఎక్కువ అవుతున్నారు. దళితుల వద్దకు వెళ్లి వారిసమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం గొప్ప. సావిత్రి ఫూలే అసలు తనను దళిత ఎంపీ అని పిలవడానికే వీలు లేదు- ఎంపీ అనండి చాలు అన్నది. మన రాజ్యాంగం కులమతాదులకు అతీతంగా ఉండమని మాత్రమే చెబుతున్నది. దళితులను ఒక వోటు బ్యాంకుగా చూడటం మానె య్యాలి అన్నాదో వాదన.
నిన్నటి దాక కాంగ్రేస్సు పార్టీ - దళిత మైనార్టీ ల వోట్ల వల్లనే బ్రతికి బట్ట కట్టుతున్న్దది అని పరిశీలకులు అంటున్నారు మొన్నటి ఎన్నికలలో వాళళు పోగొట్టుకున్నది ఈ వోట్లనే.. అంచేత 2019 ఎన్నికలకి వేళకి దళితులను కాంగ్రెస్ శిబిరం లోకి చేర్చుకోవాలి అన్నదే రాహుల్ గాంధీ ధ్యేయం గా కనపడుతున్నది. రాహుల్‌అదేపనిగా- దళితుల పట్ల మోదిజీ గవర్ణ మెంట్ విచక్షణ చూపిస్తున్నదని ప్రతీ చోట వినిపిస్తూ ఉండటాన్ని అందరూ గమనించే వుంటారు. పోగొట్టుకున్న వోటు బ్యాంకును తిరిగి పొందాలని హస్తం అనుకుంటే- పోయిన సారి దొరికిన బోనస్ లాంటి ఖాతాని ఎట్టి పరిస్తితుల్లోను చేజా ర్చుకోకూడదని -తంటాలు పడుతున్నది కమలం పార్టీ
కాకపోతే దక్షిణాదిన లోగడ ఒక సారి కర్ణాటకలో మాత్రమే గద్దె నెక్కిన చరిత్ర ఉన్న భాజపా -ఈ సారి తన శక్తి యుక్తులను మదుపు పెట్టి మోదీని నమ్మి - ముఖ్యంగా అమిత్ షా గారు పోరాడుతున్నారు. ఆంధ్ర , తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో బిజెపికి లోగడ ఏమీ ఖాతాలు లేవు - ఇప్పుడు రాగల చాన్సు లేదు. ఆశ అంతా కర్ణాటకలోనే . ఈ తల మీద నీళళు మొహం మీదకి ఎంతలో జారు తాయో -రేపు పదిహేను తో ఆ ‘గుండు కొమ్ముల అనుమానం’ తీరిపోతుంది.
మోదీ, అమిత్ షాలకు ఇది అగ్ని పరీక్ష. కర్నాటకలో అసలు పోరు- యడ్యూరప్ప, సిద్ధ రామయ్యల మధ్యనే. అందుకనే మోదీ మహాశయుడు- సిద్దరామయ్య మీద దాడి చేస్తున్నాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా -కరప్షన్ ఆరోపణలని అగ్నేయాస్త్రాలుగా ప్రయోగిస్తున్నాడు దేశ ప్రధానమంత్రి. నిజానికి భాజపాకి దక్షిణాది నుంచి త్వరలో కావలసినది పార్లమెంటు సీట్లు. వాటిని ఎలాపొందాలన్నదే ఇప్పుడు ప్రధాన సమస్య. నోరుంటే తల కాస్తుంది అంటారు అలాగే నోరా? బుర్రకి తీసుకు రాకే ! అని కూడా సామెత వుంది. ఏది నిజమో ఇక కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. కర్నాటకలో కాంగ్రెస్స్-బిజెపి పార్టీల వారు దళితులను ఒక ‘నెట్’లాగ మధ్యన పెట్టుకుని అటూ ఇటూ బంతిని కొడుతూన్నట్లు వారిని బాదుతూ టెన్నిస్ ఆడేస్తున్నారు. దళితులను అసలు కేర్ చెయ్యడం లేదంటాడు రాహుల్. దళితుల ఇంట విస్తరి వేసి వారిని ఉద్ధరిస్తున్నది తామే అంటున్నారు కమలం పార్టీ వాళ్ళు.
కావాలంటే ఉత్తరప్రదేశ్ వైపు చూడండి, మధ్యప్రదేశ్‌కి పోరుూ తిలకించండి.. అంటున్నారు మోదీజీ అనుయాయులు.దేశానికి రాష్టప్రతియే ఒక దళిత నాయకుడు కాగా ఇంకా- దళితుల పట్ల విచక్షణ అన్నమాట వినబడటం సిగ్గుచేటుగానే వున్నదని ఒకప్రక్క సభ్య జనం ముక్కున వేలువేసుకుంటూ వున్నా పొలిటికల్ గేమ్స్‌లో పావుగా - కుగ్రామాల్లో వున్న అమాయక దళిత వర్గాలు ‘పావు’లై పోతున్నారని ఆ వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇట్ ఈజ్ ఏ మేటర్ ఆఫ్ డేస్ నౌ, ఆల్ సెట్ టు గో..
*