వీరాజీయం

ఇది కలకాదు సుమా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిగ్గా 50 ఏళ్ల కిందట నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ బ్యాచ్.. అపోలో11 వ్యోమనౌక ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశారు. 1969 జూలై 20వ తేదీన అపోలో11 వ్యోమనౌకకు చెందిన ఈగల్ మాడ్యూల్ ట్రాన్‌క్విలిటీ బేస్‌పైన దిగింది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టి, చంద్రుడిపై నడిచిన మొదటి మనిషిగా నిలిచిపోయాడు. ఆర్మ్ స్ట్రాంగ్‌ను ఎడ్విన్ బజ్, అల్డ్రిన్‌లు అనుసరించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘నాసా’ (అమెరికా)కు చెందిన మరో ఐదుగురు భూమి సహజ ఉపగ్రహానికి వెళ్లివచ్చారు. అయితే 46 ఏండ్లు అయింది-మనిషి జాడ- వెనె్నలరేడు సామ్రాజ్యంలో పడలేదు.
వెనుకటి అమెరికన్, రష్యన్, చైనా దేశాలేవీ కూడా జాబిల్లి మీద నీటిజాడ వున్నట్లు కనుగొనలేదు. ఆ క్రెడిట్ మన ఇండియాకే దక్కింది. అమెరికన్లు తెచ్చిన చంద్ర శిలాకళాఖండాలు కాచి వడపోసినా నీటి వాసన కూడా దొరకలేదు. కాని నాసా- లోగడ మన ఇండియన్ చంద్రయాన్ ద్వారానే అక్కడ నీటి జాడ వున్నట్లు కనుగొన్నారని నిర్ద్వంద్వంగా ఒప్పుకున్నది. ఒక వారం రోజుల పాటు- జాబిల్లిపై తొలి అడుగుపెట్టిన బృందాన్ని కీర్తిస్తూ ఇపుడు ప్రపంచం గోల్డెన్ జాబిలీ వేడుకలు చేసుకుంటున్నది. మన చంద్రయాన్-2 చంద్ర మండల పరిశోధనకి జాబిల్లి దక్షిణ ధ్రువ మజిలీకి మహాప్రస్థానం ఈ నెల 22న మధ్యాహ్నం మార్తాండ తేజంతో మొదలెట్టింది. 46 ఏళ్లుగా చంద్రుడి మీదకు ఏ ఒక్క దేశం కూడా మనుషులను పంపించలేదు. ‘ఇక్కడ మనిషి వేస్తున్నది చిన్న అడుగే కావొచ్చు. కానీ, మానవాళికి ఇది అతి పెద్ద అంగ’ అని చంద్రుడి మీద అడుగుపెట్టిన క్షణంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ దిక్కులు పిక్కటిల్లేలాగ ఎలుగెత్తాడు.
2008 అక్టోబర్‌లో బాగా మబ్బులు పట్టిన రోజున- ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్-1 ప్రయాణం ప్రారంభమైంది. అది చంద్రునిపై భారత మువ్వనె్నల జెండాను నాటి, అక్కడి నీటి ఉనికిని నిర్ధారించింది. భారతీయ మీడియా ఆ విజయాన్ని ఉత్సవంలా జరుపుకుంది. అయితే, ఒకవైపు ప్రాథమిక సదుపాయాలు లేక లక్షలాది మంది ఇబ్బంది పడుతుంటే, అలాంటి ప్రాజెక్టుల కోసం భారీగా డబ్బు ఖర్చుచేయడమేంటని కొందరు ప్రశ్నించారు. అలా అన్నవాళ్లు ఇవాళ సమాచార ఉపగ్రహ సేవలకి ముగ్ధులు అయిపోతున్నారు. ఎట్లా అనూహ్యమైన ఉపగ్రహ సదుపాయాలను మన దేశం సమకూర్చుకుని- వ్యాపార లాభాన్ని కూడా పొందుతున్నది అని కూడా ఆలోచించాలి. నాటి చంద్రయాన్ మిషన్ డైరెక్టర్ - అన్నాదురై స్పష్టంగా చెప్పాడు- ‘‘పారిశ్రామిక విప్లవంలో మన భాగస్వామ్యం లేకపోవడమే పేదరికానికి ప్రధాన కారణాలలో ఒకటి. దండిగా మానవ వనరులు కలిగిన దేశం భారత్. ఇతర దేశాలు సాంకేతికంగా ముందుకెళ్తుంటే మనం ప్రేక్షకుల్లా ఉండకూడదు. అంతరిక్ష పరిశోధన ద్వారా లభించే అవకాశాలను కోల్పోకూడదు’’ అని.
ఇవాళ మనం ఇస్రో కృషి కారణంగానే అగ్ర ఉగ్ర రాజ్యాల సరసన పెద్దపీటకి అర్హత పొందాము. నేటి చంద్రయాన్-2 ప్రయోగం సమీప భవిష్యత్‌లో మన భారతీయుడు జాబిలి మీద జాతీయ పతాకాన్ని నిలబెట్టే అవకాశాలున్నాయి. విచిత్రమేమిటి అంటే -చంద్ర మండలం మీదకి మనవాళ్లు మానవ సహిత రోదసి నౌకను పంపి లంగరువేసే పథకానికి డాక్టర్ లలితాంబ ఆధ్వర్యం వహిస్తున్నది. రోదసీయాన చరిత్రలో మహోజ్వల ఘట్టాలలో వనితల ఆధిపత్యం మనదే కావడం చూసి- ఎంతమంది వనితలు, మహిళా సంఘాలు ఇవాళ ఈ వేడుకలు జరుపుకుంటూ- స్ర్తి శక్తిని శ్లాఘిస్తున్నారు? గొడ్లశాలలో చదువుకుని కాలికి చెప్పులు కూడా కొనలేని పేద ఇంట జన్మించిన అన్నాదురై మంగళ్‌యాన కార్యక్రమానికి డైరెక్టర్. మొదటి ప్రయత్నంలో అంగారక గ్రహం మీదికి వేగుల ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపిన మొదటి దేశం ఏది? అంటే జవాబు- ఇండియా.. దటీజ్ భారత్. ఎన్ని స్కూల్స్‌ల్లో ఇవాళ స్వీట్స్ పంచి చంద్రయాన్-2 వేడుకలను జరిపారు. ప్రతివాడు ఉపగ్రహ సేవలని ప్రతిక్షణం ఎంజాయ్ చేస్తున్నాడు గాని ఇస్రో గురించి గర్వపడే తరుణమిదే.
ఇప్పుడు భూమి చుట్టూరా చక్కర్లుకొడుతూ వున్న జాబిలియాన స్పెషల్ ఉపగ్రహం చంద్రుడిని చేరుకోవటానికి, సెకనుకు కిలోమీటర్ వేగంతో ప్రయాణించాల్సి ఉంది. అయితే, అంగారక గ్రహానికి చేరుకోవడానికి సెకనుకు 30కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి. కాని ఆ పని మనవాళ్ళు జేగీయమానంగా చేసి చూపెట్టారు. ఇది కూడా సాధించి చంద్రమండల ధ్రువం మీద మంచు వున్నదా? అన్నది కూడా తేలుస్తారు. ఆది కాలం నుంచి గగనయానం- గ్రహాంతర సీమల విహారం భారతీయులు ఊహాలోకంలో చేస్తూ వస్తున్నారు. ఖగోళశాస్త్ర పరిణతి ప్రదర్శించిన దేశంలో సైంటిఫిక్ అవగాహన ఇవాళ అపారంగా వచ్చింది. స్ర్తిలు ఇస్రో విజయాల్లో పాలుపంచుకోవడం - పత్రికలు ఫోకస్ చేస్తున్నాయి- మనవాళ్ళు పేదరాసి పెద్దమ్మనే చంద్రుడి మీద కూర్చోబెట్టారు. 50 సంఖ్య కలిసొచ్చినట్లు కనబడుతోంది. శశాంక విజయం- గోల్డెన్ జూబిలీ ఇయర్ ఇది- ప్రధాని మోదీజీ రెండో పాలనకి యాభై రోజుల పండుగ చేస్తున్న వేడుకల వేదిక ఇది. వెనె్నల వెదజల్లే జాబిల్లి ఉపరితలంపై నీరున్నాదా? అక్కడి ఖనిజాలు, రాళ్ల నిర్మాణం గుట్టుమట్టులను శోధించవెళ్ళిన మన రోదసీ రథం యాభై రోజులకి చంద్ర దక్షిణ ధ్రువప్రాంతంలో పాగా వేస్తుంది. నాడు భారత్ పంపిన మార్స్ ఆర్బిటర్ ‘‘అంగారకగ్రహం’’ చేరుకోవడానికి పదిన్నర నెలలు తీసుకున్నది. అంటే రోదసిలో మన ఉపగ్రహ రథాలు మున్ముందు చంద్రుడి మీదకి షటిల్ సర్వీసు మొదలుపెట్టే దమ్ము దన్ను మనకివుండే ఛాన్స్ పుష్కలం అన్నాడో యంగ్ సైంటిస్ట్. అందరూ సైంటిస్టులే కానక్కరలేదు. ఆ అవగాహన, ‘ఔట్ లుక్’ కావాలి- ముట్టుకుంటే ముల్లోకాలని అరచేత ఆవిష్కరించే పరికరాల క్రెడిట్ ఖగోళానికి- అలాగే మన శాస్తవ్రేత్తలకి- రోదసీ రంగ కార్మిక జనాలకి కూడా ఇవ్వాలి. ఆర్యభట్ట ఉపగ్రహ చిత్రాన్ని రెండు రూపాయల నోటుపై ముద్రించారు, ఆ రూపాయల నోటునోసారి తృప్తిగా తడుముదాము. 1975 ఏప్రిల్ పందొమ్మిదినాడు నెల్లూరు దరి శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి కేవలం మూడువందల అరవై కిలోల బరువున్న బుల్లి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన- శుభవేళ నాటి పత్రికా విలేఖరుల బృందంలో నేను కూడా వున్నాను- నాటికి, నేటికి ఎంత దూరం? మనవాళ్ళు రోదసి వేగంతో దూసుకుపోయారో గమనించాలి. 1978 జూలైలో ఏలినవారు, మన నాలుగు రోదసీ పరిశోధక కేంద్రాలకు తీసుకుపోయి చూపించిన ప్రెస్ పార్టీలో నేను సైతం ఉన్నాను. మున్ముందు మనవాళ్ళు చంద్రయానం చెయ్యాలంటే- ఆంధ్రా భూమిమీద నుంచే గ్రేట్ - మూన్ జర్నీ ప్రారంభం అయి తీరాలి.
ఊహలో మన పసిపిల్లలు కూడా లోకాలను చుట్టి వస్తూ వుంటారు. ఆవుతోక పట్టుకుని వైతరిణిని ఈదాలనుకుంటాము- కాని ఉపగ్రహనౌక మీద నేరుగా స్వర్గానికి ‘ఎగిరేకాలం’ రావచ్చును. ‘మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్..!’ అన్నవాళ్ళు ఇకమీదట ఆ మాటంటే వాళ్ళే చెత్తన్నర.. వెధవన్నర వెధవాలోయ్ అంటారు మన స్కూలు బాయ్స్ సైతం... బాబోయ్.. క్షమించాలి- గాళ్స్ కూడా అంతకన్నా టాప్‌గా లోకాంతర యానాల మీద అవగాహన కలిగివుంటారు. కవులు కథకులు హనీమూన్ యాత్రల మీద కొత్త కల్పనలకు కలం సానబట్టాలి. ‘చంద్రయాన్-2’ ఒక మైలురాయి మాత్రమే- గమ్యం కాదు- మున్ముందు చందమామ కథలు చంద్రుడి మీదకో ఓ ట్రిప్ వేసుకుని వచ్చి చెప్పే గొప్ప కాలం ఉందిలే... నందనందనా... చంద్రుని మీద నిజానిజాలు, ఖనిజాలు ఏమిటి? అని - అట్లతదియ నాడు కనె్నపిల్లలు ఉయ్యాలలూగుతూ చెప్పుకునే ముచ్చటైన కాలం వస్తుంది అట్టితరి అది- పత్రికల్లో కాలమిస్టులకు రంజైన కాలంగా భాసించాలి.. జయహో!
లెటజ్ ట్యూన్ టు ది ఆన్ కమింగ్ హిస్టారిక్ మూమెంట్! జై ఇస్రో!!

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512