వీరాజీయం

చంద్రశేఖరా.. నీపై.. మోజు తీరలేదురా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తొందరపడి ఓ కోయిల ముందే కూసింది..’’- అంటూ తెరాస అధినేత కేసీఆర్‌ని ఎద్దేవా చేసిన చాలామంది.. యివాళ నాలిక గట్టిగా కరుచుకుంటున్నారు. మే నెల 2019 దాకా ఆగడం ఎందుకు? ప్రతిపక్షాలు కాలూచెరుూ్య కూడగట్టుకొని, పోరాటానికి రెడీ అయ్యేలోగానే యుద్ధం, దాడి- రెండూ ప్రకటించేసిన ‘వ్యూహవీరుడు’గా యివాళ నడుస్తున్న చరిత్రలో హీరో అయిపోయాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూండగా- అఖిల భారత పార్టీలు, అఖండ పక్షాలూ అన్నీ కూడా సోకాల్డ్ ‘సెమీ ఫైనల్స్’లో బంతి రివర్స్‌స్వింగ్‌కి ముక్కు బజ్జీకాగా- గాయాలు నాక్కుంటున్నాయి...
శాసనసభ సమరంలో అఖండ విజయం సాధించాక కేసీఆర్ మాట్లాడుతూ, ‘‘తెలంగాణ ప్రజల్ని నేను కాళేశ్వరం కావాలా? శనేశ్వరం కావాలా? ఛాయిస్ మీదే అన్నాను. జనం తీర్పు ఇచ్చేశారు-’’ అన్నారు.
స్పీడ్ బ్రేకర్లు లేవు. ట్రాఫిక్ సిగ్నల్సూ లేవు. కారు మహాజోరుగా దూసుకుపోయింది. ‘‘కుటుంబ పాలన’’ అని కొందరు అన్నారు. ‘‘్ఫమ్‌హవుస్ పాలన’’ అని ఇంకొందరు విమర్శించారు. విపక్షాల వారు ఎన్ని అన్నా- ‘‘అన్నా.. నీ అనురాగం’’ అంటూ జనం తెరాస అధినేతకు నీరాజనాలు పట్టారు.
‘‘చంద్రశేఖరా! నీపై మోజు తీరలేదురా!’’అని మెజారిటీ, మైనారిటీ వర్గాలు రెండూ- ‘కారు’కూతల్నే కర్ణపేయంగా, జేగీయమానంగా ఆస్వాదించారు. ‘‘నోటా? వోటా? ఏది గెల్చిందీ?’’అంటే- కేసీఆర్ మాటే గెల్చింది’’- అన్నాడు ఏడుపు మొహం పెట్టి ఓ పరిశీలకుడు.
ఇవతల కేసీఆర్ టిప్‌టాప్‌గా తయారై కొత్త డ్రెస్ ధరించి, సరికొత్త గులాబీ రంగు కండువా ధరించి- పత్రికా విలేఖరులనీ, మీడియా కెమెరాలనీ అలరిస్తూంటే- అవతల ఢిల్లీలో- పది మీద ‘ఏడు’పార్టీలు కొత్తగా కూటమి కడదాం అనుకుంటూ సమావేశమైనారు. ‘తెరాస’ ప్రభంజనం చూసి, కేసీఆర్ గెలుపుని వీక్షించి, అందరికన్నా ముందు ఎక్కువ సంబరపడి, సంతోష పడి- ‘‘బుల్లెట్’’మీద పరుగులు తీసి- అడ్వాన్స్‌గా అభినందనలు అందించిన మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ- మొహంలో, ఏడు సీట్ల గెలుపుకూడా ఏడురంగుల ఇంద్ర ధనుస్సు అయి భాసించడం- అన్ని టీవీ చానల్సూ ‘‘్ఫకస్’’ చేశాయి.
‘‘మరి యోగీ ఆదిత్యనాథ్ దాకా రుూ ‘‘వైరల్ వీడియో’’అందిందో, లేదో?’’ అన్నాడో వోటరు.
ప్రసన్నంగా జవాబిచ్చాడు మరో వోటరు మహాశయుడు- ‘‘ఇక హైదరాబాద్, కరీంనగర్, అదిలాబాద్, నిజాంబాద్‌ల పేర్లు బదలాయించనక్కర లేదన్నా! బతికిపోయినం అనుకో’’- అన్నాడు కసిగా, ఆ తెరాస నాయకుడు.
నిన్నటి దాకా ‘‘మహర్జాతకుడు’’ ఎవరయ్యా అంటే యింకెవరు, నరేంద్ర దామోదర్ మోదీయేనన్న అమిత్‌షాలు- కంగుతిన్నారు. పులిమీద పుట్రలా రుూ మహర్జాతకుడు కేసీఆర్ యిప్పటిదాకా వున్న స్టంటులు, ఫ్రంటులూ చాలక మరో ఫ్రంట్- ‘ఫెడరల్ ఫ్రంట్’-అంటూ రంగంలోకి దూకుతాడేమోనని అన్నాడు ఢిల్లీలో ఒక కేజ్రీవాల్ ఫ్రెండు.
ఏది ఏమయినా, అయిదు రాష్ట్రాల ఎన్నికలలో నిన్నటిదాకా అప్రతిహతంగా, అనితర సాధ్యంగా వీస్తున్న హోరుగాలికి- ‘హస్తం’ ‘హాల్టు’ పలికింది. భాజపా వీరభక్తులంతా పప్పూ పప్పూ అంటూ హేళనలు చేసినప్పటికీ- రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతబట్టిన ఏడాదికే, అధ్యక్షుడిగా తొలి వార్షికోత్సవాన్ని- యిటు చంద్రబాబునాయుడా? లేక అటు షేక్‌అబ్దుల్లానా? ఎవరు వచ్చి అభినందిస్తున్నారు?’’అన్నది గమనించకుండా- అందర్నీ ఆలింగనం చేసుకుంటూ ‘్ఛర్స్’ చెప్పుకున్నాడు.
నగదు రహితం లావాదేవీలు మిగిలాయి. కాంగ్రెస్ రహిత అఖండ భారత్ కల చెదిరిపోసాగింది. ఇండియన్ ప్రజాస్వామ్యంలో అంతే- అలాగే జరుగుతుంది! మేరా వోటర్ మహాన్!
హైదరాబాద్‌లో ‘వింటర్’కి బదులు తెరాస కోసం ‘‘వసంతం’’ వచ్చింది. ఆబిడ్స్ సెంటర్ దగ్గర నుంచి ఆర్.టి.సి.క్రాస్ రోడ్స్ వరకూ- కుకట్‌పల్లి నుంచి షేర్‌లింగంపల్లి దాకా ‘నో హార్న్‌జోన్స్’లో కూడా కారుహార్న్‌లు- మార్మోగేయ్! ఆగిన కార్లు, సాగుతున్న కార్లవాళ్లూ కూడా- జేజే ధ్వానాలుగా మ్రోగించేస్తూ వుంటే శీతాకాలం పార్లమెంటు సమావేశాలు వెచ్చగా మొదలైనాయి. కాంగ్రెస్, భాజపా లేని కొత్త ‘దేశ’మేదో కావాలంటున్న వారి సంఖ్య పెరిగింది. ‘స్టంటులు’ సారీ.. ‘ఫ్రంటులు’ మరి కొన్ని పుట్టుకొచ్చే అవకాశాలున్నాయి. ‘‘మిజోరంలో ఎమ్.ఎన్.ఎఫ్. జిందాబాద్ అన్న వోటరు భాజపాకి ఒకే ఒక్క సీటు విదిలించడం గమనార్హం అన్నాడు హైదరాబాద్‌లోని ఒక ‘‘నోటా’’ భాయ్.
‘‘ఈసారి వోటా? ‘నోటా’? ఏది గెలిచిందీ?’’అంటే నవ్వుతూ అన్నాడు సామాన్యుడు- ‘‘నోటా? ఒక సంగతి మరిచిపోకు బ్రదర్. వర్ధనపల్లి అనే గ్రామంలో నైతే - ‘నోటా’ఆరువేల దాకా వచ్చింది. గమనించు,’’ అన్నాడు.
119 స్థానాలకు నిలబడటం మాటలతో అయ్యేపనికాదు గానీ మిగతా పార్టీలు- ‘కోదండరాముడు’ పెట్టిన పార్టీ సహా- అభ్యర్థుల ఎంపికలో అల్లాడుతూ వుండగా- భాజపా అందర్నీ నిలబెట్టింది. అదే క్రెడిట్‌గా మిగిలింది కాషాయాంబర ధారులకి. తన బలాన్ని కూడదీసుకోకుండా, లోకల్ క్యాడర్‌ని కూడగట్టుకోకుండా కేవలం మోదీ, అమిత్‌షాల వాగ్ధాటి మీదా, యోగీ ఆదిత్యనాథ్ వాచాలత మీద ఆధారపడి ‘కారు’కి అడ్డం పడటం లాంటివి చేసినదీ భాజపా.. అటువంటి పెద్ద పార్టీ చెయ్యదగ్గ పనికాదు అన్నారెందరో..
యూపీ ‘యోగి పుంగవుణ్ణి’ మోదీగారు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో మొత్తం 74 ఎన్నికల సభల్లో సగర్వంగా వినియోగించుకున్నారు. మిజోరంలో తప్ప నేరుగా రుూ ఎన్నికలలో 31 సభలలో నరేంద్రుడు మరియు ఏభై ఆరు ర్యాలీలలో అమిత్‌జీలు తమ వాగ్ధాటిని ప్రదర్శించారు. ఎన్.డి.ఏ. నుంచి నిష్క్రమించిన చంద్రబాబు దెబ్బతిన్న పెద్దపులిలా- ‘‘కూటమి కడదాం.. రా రండి’’ -అంటూ ప్రాంతీయ పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణలో నాయుడి వైఫల్యాన్ని- ‘ఘోర పరాజయం చెందాడుగా’? అన్న దృష్టితో చూడటం తప్పు. అది వేరు. ఇండియన్ పాలిటిక్స్ తెలిసిన వారికి తెలుస్తుంది- తెలంగాణలో కేసీఆర్‌కి ‘ట్రాక్’ రికార్డు వున్నదని. అది కొనసాగించడానికి యిప్పుడు జనం నుంచి ఎండార్స్‌మెంట్ లభించింది.
చంద్రశేఖరుడికీ, చంద్రబాబుకీ వున్న బద్ధ వైరం ప్రాంతీయం మాత్రమే. కేసీఆర్ తన హెలికాఫ్టర్ ట్రిప్‌లో నేషనల్ మీడియాకి- ‘‘నేను’ ఇష్యూ బేస్డ్’గా ఎవరికైనా మద్దతుయిస్తానని చెప్పడం యాదృచ్ఛికం గాదు. ఆలిండియా పాలిటిక్స్‌లో కె.సి.ఆర్. దూకుడే జరిగితే- ‘ఆ వ్యూహం’ వేరుగా వుంటుంది. దక్షిణాదిన ‘కోటలు’ లేవు. ఉత్తరాది కంచుకోటలు బీటలు వేస్తున్నాయ్ భాజపాకి. ‘‘మోదీజీ బహుపరాక్!’’అన్నదే రుూ ఎన్నికల తీరు యిచ్చే సందేశం!.... ఇదొక వార్నింగ్ బెల్!-
బెటర్.. వేకప్ మోదీజీ.. ఇట్స్ టైమ్ నౌ..!

సెల్: 92900 99512