వీరాజీయం

తెలుగువారి చెవిలో ‘పద్మం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవై తొమ్మిదో గణతంత్ర దివస్ సంబరాలకి మన ఘనమైన తెలుగుతేజం ఓహోమని అహోమని ఉత్తేజపరచడానికి - ఎన్‌డీఏ గవర్నమెంటు - మొహమాటానికయినా ఛాన్స్ ఇవ్వలేదు. స్వర్గారోహణ చేసిన లెజెండ్స్‌కి ఇవ్వమని ఇస్తారని కోరుకున్నాం - అదీలేదు - కొత్తగా ఝామ్మని రాజకీయంగాను ఇతరత్రా కూడా - తెలంగాణలో ఒక్క తెలుగు వెలుగుకు కూడా - పద్మం, భూషణం మెడలో వేసి సత్కరించడానికి కుదరలేదా? - కేంద్ర ప్రభుత్వానికి మన లిస్టు ఆనలేదా?. ‘మనవాళ్లు అసలు సిఫారసు చేసినట్లు లేదు - వీళ్లకెంతసేపూ రాజకీయాలు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప కళాకారులకి - సంఘ సేవాదురీణులకి మెడలో పద్మ సత్కారహారం వేయించాలని లేదు’ అన్నాదో ఇల్లాలు. చాలామందికుంది ఆ అనుమానం.
‘తల్లీ అదేమీ లేదు - ఉభయ రాష్ట్రాలు కూడా చెరో - పాతిక మంది జీవుల, కీర్తిశేషుల పేర్లు - అధికార ముద్దర్లు వేసి మరీ - కేంద్ర సర్కారువారికి సమర్పించారుట. మహా క్రీడాకారిణి చాకులాంటి పిల్ల అంటూ సింధూ డార్లింగు పేరు అమరావతి నుంచి హైదరాబాద్ నుంచి కూడా పద్మభూషణ్ ప్రసాదించమని వెళ్లిందని భోగట్టా. బ్యాడ్‌లక్!.. ‘‘పాపం ఈ నిరాశతోనేనేమో సైనా చేతిలో సింధూ నేరుగా రెండుసెట్లలోనే డౌన్ అయిపోయింది - అన్నాదో కాలేజీ పాప. ‘అంత సీనేమీ లేదు లేదమ్మ - పద్మా అవార్డులు వస్తే మాత్రం - పణం (్ఫలం) పుష్పం తోయం అన్నట్లు క్యాష్ ఏమైనా రాలుతుందా? పైగా, పేరుకు ముందువెనుక కూడా దీనిని తగిలించుకోరాదుట! మా సింధుకి వస్తే - మనకే గొప్ప అంటే తప్ప - అన్నదో బ్యాడ్మింటన్ టీన్. అయినా, పద్మశ్రీ మొదలు - పద్మ విభూషణ్ దాకా అవార్డుకి నామినేషన్ కోసం అస్మదీయుల లాబీయింగు - టాప్‌లెవెల్లో సాగుతూనే వుంటుంది - పోయిన ఏడాది మహేంద్రసింగ్ ధోనీకి భూషణం వస్తుంది అని ఎదురు చూస్తే రాకపోయింది, ఈ ఏడాది తన్నుకుంటూ వచ్చింది - అని మురిసిపోయాడో క్రికెట్ వీరుడు.. ఇళయరాజాకి పద్మవిభూషణ్ -తమిళనాడు ప్రభుత్వం కోరగా వచ్చిందే మరి.. ‘‘వెయ్యి సినిమాల సంగీతనాథుడు’’ - అని మనవాడని మనవాళ్లంతా ఉప్పొంగిపోయాం.. అలా సెలెబ్రేట్ చేసుకోడానికి తెలుగవాళ్లకి ఏ ఛాన్స్ ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంటు.. ఒకే ఒక్కడు శ్రీకాంత్ - మన అందరికీ ‘లాడ్లాబేటా’గా మనకి దక్కేడు. అందని పండ్లు పుల్లన అన్నట్లు - పోనిద్దురూ, ఆ మధ్య తన పేరు ముందు పద్మ అవార్డు పేరు వేసుకున్నందుకు వెండితెరమీద వేసినందుకు రభస జరిగింది - అది లేకపోయినా అంతటి ప్రతిభావంతుడేనని నీరాజనాలు అందుకుంటున్న అగ్రశ్రేణి నటుడు - అనవసరంగా రచ్చకీడ్చబడలేదా? అని కొంతమంది విరక్తి ప్రదర్శించారు. పోనీలెండి.. నంది అవార్డుల మాదిరి ఆ పద్మాలమీద మనలో మనం తన్నుకునేవాళ్లం - ఆ ఛాన్సు మనకి - ఆ బాధ అవతలివారికి తప్పింది. పాత పాదయాత్రీకుడు జగన్ కొత్త పాద యాత్రీకుడు పవన్‌కి జేజేలు చెప్పడానికి ఆ ఒక్కడయినా పనికి వచ్చాడు. అది సరే, మనలోమాట - ఏటా ఇచ్చే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుల మేరకే ఈ అవార్డుల పందేరమ్ జరిగితే మనం బాధ పడాలి - కాదుట అన్నాడో భక్తుడు. ఈ ఏడాది - కీర్తిశేషుల పేర్లను - కీకిరీటిధారులను కూడా పద్మాలుగా గుర్తించడానికి నరేంద్ర మోదీ మహాశయులు - జనవాక్య పద్ధతిని - రూపొందించినట్లు కొంతమంది ఎన్‌డీఓ అభిమానులు గుర్తు చేస్తున్నారు. బహుశా అందుకే కాబోలు జనవాక్యం ఫలించి విడుదల చేసిన జాబితాలో ఏకంగా - పద్నాలుగు మంది - విదేశీ పద్మాలు కూడా విరాజిల్లుతున్నారు? అన్నాడో కొంటెకోణంగి..
వేళాకోళం కాదు బాబూ (క్షమించాలి.. బాబూ అంటే చంద్రబాబు కాదు) ఈ సంగతి నమోగారు - ఆమధ్య నీతి అయోగ్ ఏర్పాటు సమావేశంలోనే - ప్రసంగవశాత్తు ప్రకటించాడు. అవార్డుల కోసం ‘టామ్ డిక్కాండ్ హ్యారీ - కోనే కిస్కా’ ఎవరయినా నామినేషన్ చేస్తూ కేంద్రానికి పేర్లు సూచించవచ్చును అన్నాడాయన. ఒకరకంగా, రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వాల బరువుతగ్గించేసినట్టే ఇది. అంటే ఈసారి అట్లా నామినేషన్లు అందాయా? - మొత్తం పదిహేను వేల ఏడువందల నామినేషన్లు అందాయట. ఇవి రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సులకి అదనం అయ్యుంటుంది. లేకపోతే, అవార్డు గ్రహీతల పేర్లు - చూడగా అవి జనరల్ జాబితా నుంచి వచ్చాయనిపించడం లేదు.. అన్నాడో కళాభిమాని. దీనమీద - ఇది మా ఈ కాంగ్రెస్ కల్చరన్నాడు - కొత్తగా పొలిటికల్ క్యాడర్లో చేరిన కుర్రాడు - ఆ మాట వాడాలని అతనికెంతో ఉబలాటంగా వుంది. అల్లాగయితే - గులాం ముస్త్ఫాఖాన్‌గారి హిందుస్తానీ సంగీతం మాత్రమే వుండేది. ఏ పరమేశ్వరన్‌గారి పేరు ఉండేదా?.. అన్నాడు కాం.పా. అభిమాని. అవార్డులు వచ్చినవారి పేరు ప్రఖ్యాతులు విషయంలో ఎవ్వరికీ - ముఖ్యంగా మనబోంట్లకు ఐసోరు నచ్చలేదు. ఇళయరాజాకి ఏనాడో రావలసిన గౌరవం ఇది. ఐతే, కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల విషయంలో భిన్నాభిప్రాయలు అంతటా వినిపిస్తున్నాయి. వినిపిస్తాయి కూడా. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రకటించిన అవార్డుల్లో అన్యాయం జరిగిందని, అందులో రాజకీయ కోణం ఉందని ఎక్కువశాతం మంది వ్యాఖ్యానించారు. లోకుల మాటకు విలువ ఏమిటి? అనుకోకూడదు కదా - ప్రజాస్వామ్యంలో. జగన్‌గారు కిడాంబిని అభినందించి వదిలేయగా పవన్‌జీ గడుసుగా, సావిత్రికి, ఎస్వీర్‌లకి ఈసారి అవార్డుల ప్రకటిస్తే బెటర్ అన్నాడు. శ్రీకాంత్ ఒక్కణ్నే పులినాకి వదిలిపెట్టింది - కుర్రాడు అదృష్టవంతుడు అన్నారెందరో.
త్వరలో ఎన్నికలు జరగవలసివున్న రాష్ట్రాలను కేంద్రం తృప్తిపరచాలని చూసిందన్నారు కొందరు. అంచేత, మనవాళ్లు చెరో ఇరవై అయిదు- అనగా అరవంద నామినేషన్లు - సమర్పించినా, నీకు బెబ్బెబ్బే - అని మొండి చెయ్యి చూపెట్టింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వరాలజల్లు కురిపించే మూడ్‌లో వుందని, అందులో ఈ అవార్డుల కేటాయింపుకూడా వున్నదని కొందరి అనుమానం. మొత్తంమీద ముగ్గురికి పద్మవిభూషణ్. తొమ్మిదిమందికి పద్మభూషణ్, 73 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటిస్తే మహారాష్టక్రు అత్యధికంగా దక్కాయి. కర్నాటక రెండోస్థానంలో ఉంది. పద్మ విభూషణ్ కాని లేదా అటు తరువాతి రెండువర్గాల్లోను కూడా ఇంతమందికే ఇవ్వాలీ అన్న లిమిట్ ఏమైనా ఉన్నదా? లేదేమో!.. మరి త్యాగధనులు, లబ్దప్రతిష్టులు, వర్తమాన జనరంజకులు ఎంతమంది పేర్లు లిస్టులో ఉన్నాయని టీవీ చర్చలలో నమ్మదగిన ప్రముఖుల పేర్లు వెల్లడించారు కదా! వాళ్లలో ఒక్కడికైనా ఆ గౌరవం దక్కలేదూ అంటే కోటా అయిపోయిందనా! నిజానికి, ప్రతి రాష్ట్రానికి ఆయా రాష్ట్రాల దామాషా వోటర్లనుబట్టి - కేంద్రం ఇచ్చే ఈ పద్మాలకి కనీస కోటాలు వుండాలి. కీర్తిశేషులకు ఇచ్చే అవార్డుల విషయంలో కూడా వాళ్ల పేర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేశాక కూడా వాటిని సోదిలోకి రాకుండా పోగొట్టడం అవసరమా? ఈ అవార్డు అందినా అందకపోయినా సదరు గ్రేట్స్‌కి వనె్న తరగదు. గానీ ఆ ప్రాంత ప్రజలు కేంద్రం మీద - ‘మెటికలు విరుస్తారు’. అది నిజం. తెలంగాణ గాయకులు గోరటి వెంకన్న, అందెశ్రీ, విద్యావేత్త చుక్కా రామయ్య, సినీ రచయిత సుద్దాల అశోక్ తేజలను సైతమ్ ప్రద్మశ్రీకి నామినేట్ చేశారట. ఏపీ నుంచి ఈ ఏడాది పద్మ పురస్కారాలకు సిఫారసు చేసిన వారిలో కూచిపూడి నాట్యకారిణి ఆనంద్‌శంకర్ జయంతి, ఎంపీ మురళీమోహన్, ప్రవచనకర్త చాంగటి కోటేశ్వర రావు, ప్రముఖ వైద్యులు విష్ణుస్వరూప్ రెడ్డి, జగదీశ్ పేర్లు కూడా ఉన్నాయట. ఒక్కో రాష్ట్రం నుంచి కనీసం ముగ్గురినో నలుగురినో కేంద్రం ఎంపిక చేయాల్సింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ‘కల్చరల్ హెరిటేజ్’ మిగతా యే రాష్ట్రంతో పోల్చినా ఎక్కువేగాని తక్కువ కాదు. తాయిలమా? ఇది కాదు.. ఓ దేశస్థాయిలో గౌరవప్రదమయిన సత్కారం - మన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గొప్ప అదృష్టవంతుడు. రెండు రాష్ట్రాలలో జెండా ఎగురవేసి రెండు ప్రభుత్వాల కీర్తిగానం - ఎక్కడి గూటిపాట అక్కడ గానం చేశాడాయన. అలాగే, ఉమ్మడి రాజదాని తెలుగువాళ్లు వాళ్లకి (మాకు) రెండు కనుల మధ్య - గొప్ప ముక్కు ఒకటి ఉంది - మాకే కాదు, ఉభయ రాష్ట్ర సంస్కృతి, పిండివంటల పరిమళం రెండింటినా ఆఘ్రాణించి అలరారే హృదయం ఇవాళ రేపు తెలుగువారందరికీ వుందని నమ్మకం కూడా వుంది మాకు - పద్మ అవార్డులను అందుకున్న యావన్మంది - విదేశీయులతో అందరికీ - ప్రత్యేకించి మన బాలవర్ధ రాజు కిదాంబికి మన జేజేలు.
బట్, వుయ్ ప్రొటెస్ట్.. వుయ్ డిజర్వ్ మెనీ మోర్ పద్మాస్!

veeraji.columnist@gmail.com