వీరాజీయం

స్వచ్ఛ భారత్ కోసం ఇజ్జత్-ఘర్ నిర్మాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోయిన వారం, ప్రధాని మోదీ గారు తన నియోజకవర్గం అయిన వారణాసిలో పర్యటన చేస్తూ ఒక గ్రామీణ మరుగుదొడ్డి నిర్మాణానికి-పునాది రాయి శాస్త్రోక్తంగా వేశాడు. తన వెంటన్ సిరి అన్నట్లు ఆయన వెనుక గ్రేట్ శ్రీమాన్ యోగీజీ-గవర్నర్ యుపి కూడా తన ముందు నడవగ సంరంభంగా వచ్చారు మన ప్రధాని-ఇక్కడ రాబోయే టాయ్లెట్‌కి వాళ్లు నామ ఫలకములు తగిలిస్తూ- ‘‘ఇజ్జత్ ఘర్’’ నిర్మాణం అని ఆర్భాటంగా పేర్కొన్నారు. ఇజ్జత్ అంటే గౌరవము, మనం మర్యాదా పరువు అని హిందీలో నానా అర్ధాలు-మురిసిపోయాడు నమోజీ..మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుని లెవెల్లో స్పందించి యుపి ముఖ్యమంత్రికి ఒక వీరతాడు-శ్లాఘిస్తూ మరీ వేశాడు. అంతేనా? అన్ని రాష్ట్రాలకి ‘ఇజ్జత్’గా వున్న ఈ మాటనే అందరూ టాయ్లెట్లముందు ఉపయోగించాలని ఫర్మానాలు కొట్టించాడు. స్వచ్ఛ్ భారత్‌లో చెత్త కుండీని కుప్పతొట్టి అనమన్నారు-చెత్త అంటే మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీగార్కి ఇష్టం లేదుగా-అలాగే మరుగుదొడ్డి అంటే మన తెలుగు మీడియం వాదులకి కూడా ఆ మాట సయించడం లేదు ఐ మీన్ నామోషీ అంచేత టాయ్లెట్ అనేస్తున్నాము. కానీ మా చిన్నప్పుడు-‘ఒక్క క్షణంలో టాయ్లెట్టై వస్తా కూర్చో’ అంటే ముస్తాబై వస్తాను- అని తాత్పర్యం...‘‘అబ్బా! ఏమి టాయ్లెట్టయిందిరా చిలకా, అంటే-అమ్మాయి మేకప్ దట్టంగా చేసుకొచ్చింది అన్నమాట-ఇవాళ రేపు, మేకప్ అన్న మాట సినిమా స్టార్లకే కాపీరైటు అయిపోయింది-కేకా అనాలి లేదా అదిరిందిరో అనాలి-మన కుర్రాళ్లు కుర్రమ్మలు కొత్త కొత్త మాటలు ‘మోపు’ చేసేస్తున్నారు..కానీ, మన ప్రధాన మంత్రికి కొత్త మాటలు తయారు చేయడంలో వేరెవ్వరు ‘సరి రారు ఇలన్’-అంటే ఇండియాలో అని అర్ధం. లోగడ ఒక కాం.పా మంత్రి గారు మందిరాలు అంటే ‘దేవా’లయాలకన్న మరుగుదొడ్లే మిన్నా అన్నందుకు ఎందరో ఆయన మీద విరుచుకుపడ్డారు. అలా పవిత్ర దేవాలయాలను-కక్కోసులతో తులవేస్తావాః? అని-కానీ స్ఫూర్తిదాత అని పేర్గాంచిన నరేంద్ర దాస్ మోడీ గారికి స్వచ్ఛ భారత్ అభియాన్‌లో ప్రధాన అంగం-పాయిఖానాలే అని తెలుసు. బ్రహ్మాండమయిన వంతెన కడతారు మనవాళ్లు దానికి అప్రోచ్ రోడ్డు వేయడం మీద ఎక్కడ లేని అశ్రద్ధా చూపిస్తారు. అల్లాగే, రెండంతస్తుల మేడ నిర్మించాడో గ్రామవాసి-నెంబర్ వన్ కయితే ఎదురింటి ముందుకి-నంబర్ టు కయితే వూరు బయట విశాలమయిన పొలాల గట్లకి పోవాలి అంతే-ఆ పెద్ద మనిషి దుబాయిలో రెండు చేతులా ఆర్జించి ఈ ఇల్లు కట్టాడు. కొత్తగా పట్నవాసపు అమ్మాయిని పెళ్లి చేసుకుని తెచ్చుకున్నాడు. ఆ నవ వధువు మరుగుదొడ్డి కట్టిన్ ఆ తరువాత కాపురం పెడదారిలే అన్నది. ఆ వూరి వారందర్నీ రెచ్చగొట్టింది. టాయిలెట్స్ ఆ వూరికి కొత్త ఆకర్షణగా వచ్చాయి. అయితే అన్ని చోట్లా ఇది సాధ్యమా? గవర్నమెంటు బడా ప్రాజెక్టులతో పాటు-ఇంటి ఇంటికి కాకపోయినా-సముదాయిక విసర్జన సదుపాయం కల్పించాలి కదా. ఈమధ్యనే యునిసెఫ్ సంస్థవారు పదకొండు రాష్ట్రాలలో పదివేల ఇండ్లకి పోయి సర్వే చేసారు-సాంపిల్ సర్వే అనుకోండి. మూడేళ్ల తరువాత ఇప్పుడిప్పుడే ఈ మరుగుదొడ్ల ఉద్యమం స్పీడు అందుకుంటున్నదని ప్రభుత్వ వర్గాలు ప్రధానికి వెళ్లిన చోటల్లా-రిపోర్టులు అప్పచెబుతున్నాయ్-నమోసారు ఏమన్నాడుః ‘బేటీ పడ్దావో’ అన్న స్లోగన్ బ్రహ్మాండంగా పేల్చాడు కాని-ఆడపిల్లల్ని చదివించాలంటే స్కూల్స్‌కి పంపాలి. వాళ్లకి మగపిల్లలకి తేడా వుంది. వాళ్లైతే ఒంటేలు బెల్ కొట్టంగానే రోడ్లమీదకి-పండ్ల గంపలోలకపోస్తే పండ్లు దొర్లుకుపోయినట్టు-రోడ్లమీదకి పరుగులు తీస్తారు. ఏ సందు మొగనైనా మనకి ముక్కుపుటాలు పగిలేలాగా మూత్రఘాటు తగిలిందీ అంటే-ఆ సందులో ఒక ఇస్కోలు వున్నట్లే-కాని, ఆడపిల్లలు ఏమి చేస్తారు? చాలామంది బేటీలని ఇస్కోల్లకి పంపలేకపోతున్నారు అంటే ఆ స్కూల్లో-మరుగున్న చోటు లేదన్నమాటే. గ్రామాలలో తాజాగా జరిగిన 2015 ఏప్రిల్ జూన్ సర్వే లెక్కల్ని బట్టి చూస్తే 3778 గ్రామాల్లో ఉమ్మడి మరుగుదొడ్లు గల ఊళ్లు పదమూడు శాతం వున్నాయి. ఇండ్లలోనుంచి మురుగు నీళ్లు పోయే సదుపాయం నలభై ఆయిదు శాతం ఇండ్లకి లేదు-స్వచ్ఛ భారత్ ఉద్యమం ఇంకా సాగాల్సిందేనన్న మాట. ఆడపిల్లలు, మగపిల్లలు టాయిలెట్స్ విషయంలో సమానం కాదు. ఈడొచ్చిన పిల్లల్ని-స్కూళ్లకి పంపాలి అంటే ముందు వాడకానికి పనికొచ్చే-మరుగుదొడ్లకు పునాదిరాళ్లు ఆ వెంటనే మరుగు నిర్మాణం జరగాలి. మనిషికి జంతువుకి ఈ ఒక్కటే ముఖ్యమైన తేడా-కాలకృత్యాలు అని అందుకే అన్నారు పెద్దలు. రాత్రిపూట బస్సుల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు తెలుస్తుంది అవస్థ. ఆర్టీసీ బస్సులు డిపోలలో ఆగవు. దూరంగా కుళ్లు హోటళ్ల పక్కన ఆగుతాయి. సిబ్బందికి ఉచిత ఆరగింపులుంటాయట మరి..అక్కడికి పోగానే ఇక ఆగదు ప్యాసిన్జర్లకి-కొట్టినట్టు లేచి చీకట్లోకి అక్కడ వున్నది ఇల్లో, తోటో, గోడో, గొయ్యో తెలియకుండా పరిగెత్తాలి. అక్కడా ఆడాళ్లకి అవస్తే-సులభ్ సౌచాలయాలున్న చోట నిజంగా అది దేవుడిచ్చిన వరమే అనిపిస్తుంది అన్నదో ఇల్లాలు. అవును- హైదరాబాదు అనే కాదు, మన రాష్ట్రాలలో ఏ నగరం తీసుకున్నా ఈ మధ్య ఫంక్షన్ హాల్స్-స్టార్ లెవెల్లో కనబడుతున్నాయి-కాని అందులోకి ఆశగా కిందికి దిగితే అసలు కథా బయటపడుతుంది. నగరంలో ఈ రోజు ఏనాడూ ఖాళీ దొరకని రెండుమూడు సభలు సాంస్కృతిక సమావేశాలు ఎడతెరిపి లేకుండా నిత్యం జరిగే ఒక హాల్స్‌సముదాయం ఉంది-కాని, అందులో సభ పెడితే మర్యాదగా ఉంటుంది...కాని, మోడీగారి భాషలో చెప్పాలి అంటే, ఇజ్జత్ ఘర్ -అనాలి అంటారే అది నిల్. -వుంది అతి భయంకరం-దానికి మెట్లన్నీ తడుముకుంటూ ఎక్కాలంటే కష్టమే. తీరా ఎక్కినాక తరువాత అక్కడి కంపుకొట్టే సదుపాయం చూడాలంటే-నక్షత్రాలు కనబడ్డాయి అన్నాడో మిత్రుడు. సిటీకి వచ్చిన పొరుగూరువాడికి-మనం మర్యాదా దక్కించుకోవాలి అంటే-శౌచాలయాలు సిటీ బస్సులు సులువుగా దొరకాలి-కాని, మన సోకాల్డ్ కళ్యాణ మండపాలలో-ఆ ఒక్కటి అడక్కు అన్నట్టు వుంటాయి-స్వచ్ఛ్భారత్ సదుపాయాలూ హుళక్కి..బార్‌కి లైసెన్సు ఇచ్చే ముందు వాష్ రూమ్ చూపెట్టాలి లేదా-మమూల్స్ చక్రవడ్డీలో పెరిగిపోతాయి అన్నాడో బిజినెస్సు ప్రముఖుడు-అలాగా ముందు మరుగుదొడ్డి ఆనక మొదటి అంతస్తు అన్న నియమం వుండాలి. మునిసిపాలిటీ సెస్సు వసూలు చేయడంలో హుషారు చూపిస్తుందే గాని-సదరు సదుపాయం ఉన్నదా? అది పనిచేస్తున్నదా? అని పరికించదు.
రాంచి అంటే ధోని వాళ్ల వూరు. అక్కడ మున్సిపాలిటీ సిసి కెమెరాల మీద ఆధార పడలేము ఆరుబయలులో బహిర్భూమిలో కెమెరాలు పనిచేయవు-ఆ డబ్బులెడితే తడకల పయిఖానలేఅయినా వస్తాయి అనుకున్నారు. కాని ఇప్పుడు-పివినరసింహారావుగారి కాలంనుంచి శుభ్రం చెయ్యడానికి తోటీలు లేరు. అంచేత, వాళ్లు కొంతమంది నిఘా సిబ్బందిని రహస్యంగా నియమించారు. ఓ కార్యక్రమం మొదలు పెట్టారు. దాని పేరు ‘హల్లా బోల్- లుంగీ ఖోల్’-చెంబట్టుకొచ్చినవాడిని-అదేలెండి ఇప్పుడు వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు...అల్లాంటి వాళ్లని వెనుకపాటున పోయి అమాంతం పట్టుకుని వస్త్రాపహరణం చేసేస్తున్నారు. ఫర్రున లుంగీ లాగేసుకుంటున్నారు. ఆనక వంద రూపాయల జరిమానా కట్టి లుంగీ విడిపించుకోవాలి. అదీ, పనిష్మెంటు-కాకపోతే ఈ ‘జనతా ఆరుబయలు పాయఖానా’లను అసలు అందుబాటులోనుంచి ఎత్తేయాలని-బహిర్ భూమి వారంట మొక్కలు నాటేస్తున్నరట అధికారులు. వెనకటికి-కొబ్బరికాయలు దొంగలు ఎత్తుకుపోకుండా-చెట్టుకి మడి చీర కట్టేదిట ఒకావిడ! ఐతే, ఓ గ్రామీణ మహిళామణి మరో సూచన చేసింది. దురదగుండాకు చెట్లు, ముండ్ల తుప్పలు పడేయండి అని-గాని మొదట ఇంట్లోనో వీధిలోనో నువ్వు అసలు ఏర్పాటు చేయాలిగా..అందుకే సబ్సిడీ పథకం అంటాడు నమోజి.
ఈ హల్లా బోల్ లుంగీ ఖోల్‌ని రైలు కట్టల వెంబడి హైరోడ్ల వెంబడి మొదలెడితే బాగుంటుంది గాని దార్లో-‘మూత్రాలయాలు‘ కట్టించాలి-ముందు-మనం రైల్లో ఉత్తరాదికి పోనీ ఢిల్లీకి పోతున్నామనుకోండి-ప్లాట్ఫార్మ్ మీద చివరగా కనబడే మరుగుదొడ్ల మీద సౌచాలయ్ అని మళ్లీ ఉర్దులో పిశాబ్ఖర్ అనీ-కొన్ని చోట్ల-మూత్రాలయ అని కూడా కనబడుతుంది. అందుకే ఓ పెద్దమనిషి అన్నాడు-మనం ఎప్పటినుంచో-పాయిఖానాలకి రెస్పెక్టు ఇస్తున్నాం-ఆలయం అనే అంటున్నాము కాని కొట్టు దొడ్డి లాంటి మాటలు కూడా ఎత్తేశం అని-అది సరే-కాలేజీ ఆడపిల్లలు నాగరికంగా వుండదని-టాయ్లెట్, లెట్రిన్లను ఆనక నీటుగా వాష్‌రూమ్ అంటారు-కాకపోతే వాష్ అనగా కడుగుట లేదా కడుగుకొనుట అనగా దానికి నీళ్లు ముఖ్యమ్-మళ్లీ కథ మొదటికి-
భారీ ఎత్తున మొక్కలు నాటి ఫోటోలు అప్లోడు చేసుకుపోతారు. ఆ తరువాత మొక్కల వైపు చూడరారు కొందరు. నారుపోసిన వాడు నీరు పోస్తాడు అంటారు-కాని నువ్వు నీ పబ్లిసిటీ కోసంపోసిన నారుకి వాడెవడో-దేముడు దిగివచ్చి నీరుపోస్తాడా? నువ్వే పొయ్యాలి-అలాగా, భారీ ఎత్తున తోరణాలు కట్టి నువ్వు విసర్జన మందిరాలకి రిబ్బన్ కత్తిరించి-పోతావు ఆనక అక్కడ వానపడప్పుడు తప్ప-జల బిందువులు రాలవు-మరుగుదొడ్లకి సబ్సిడీ ఇస్తావు-వాటిని శుభ్రం కూడా చేయించాలంటే? మంత్రి లెవెల్కే కాదు సర్‌పంచ్ స్థాయికయినా సాధ్యమా? అంటే కాదు. ఒక్క వోట్లు అడుగుతున్నప్పుడు తప్ప ఇంకెప్పుడూ చేతులు కలప నేర్వని వాడు లేక ఆమె ‘ఏమీ చెయ్యరు..అంచేత ఇంటి మూత్రాలయం అదే గట్టిగా కట్టి దానికి నీటి సదుపాయం చేయించుకోడం నీ వంతు-‘బేటీ’ని ఇస్కోల్లో వెయ్యడానికి నువ్వు ర ఎడీ అవడానికి ముందు-సదరు పాఠాలు చెప్పి దుకాణంలో వాష్ రూమ్ ఉండేలా చూడాల్సిన బాధ్యత-పాలకులదే. ఎన్నో సోకాల్డ మోడరన్ స్కూళ్లలో తాగునీరు వుండదు. కడుగునీరు ఎక్కడనుంచి అడుగుతావ్? పట్టణాలలో-ప్రైవేటు లేదా కొన్ని చోట్ల గవర్నమెంటు విద్యాలయాల్లనే డ్రింకింగ్‌వాటర్-అడిగితే-టీసి ఇచ్చేస్తాం-అంటారు. టీచర్లు పిల్లలుకూడా ఇంటినుంచి ‘ఉదక కమండలముల’ను తెచ్చుకొనవలెను-అది రూలు-అంతే. ఈ మధ్య కొంతమంది మొబైల్ పిచ్చి లేని పిల్లకాయలు కర్నాటక స్కూలు ఒకదానిలో -వాటర్ బాటిల్స్- ఇండ్లకి మినరల్ వాటర్ అంటూ పంపు నీళ్లు సప్లై చేస్తారే అటువంటి ప్లాస్టిక్ డబ్బాలతో-మగపిల్లలకు పనికి వచ్చే ‘మూత్ర మందసా’లని అంటే యూరినల్స్ తయారుచేశారట. నేటి బాలలే రేపటి స్వచ్ఛ భారత నిర్మాతలు-అనిపించుకున్నారు. మొదట పుస్తకాలు కాదు డ్రెస్సులు కాదు- క్యారియర్ బాక్సులు కాదు-ఏ విద్యాలయానికి అయినా మంచి టీచరు-ఒక మరుగుదొడ్డి అవసరము సుమతీ! అన్నది ఇటీవల, డిజిటల్ కింగు-నరేంద్ర మోదీగారి దయచేతను-ఇక వో ఉద్యమంలాగ సాగుతున్న మాట వాస్తవమే గాని ఇంకా, సగం స్కూళ్లు సౌచ్ సదుపాయం లేకుండా ఒకవేళ ఉన్నా పనిచెయకుండా వుండడాన్ని గుర్తుపెట్టుకోవాలి-మార్నింగ్ వాకర్సు అంతా కాకపోయినా ఎక్కువమంది ‘ముసలోల్లు’ కొంతమంది డయబెటిక్స్ కూడా వుంటారు..వాళ్ల కుక్కలకి ప్రాబ్లం లేదు-వాటికి పార్కు బెంచీలే అక్కరలేదు నిలబెట్టబడిన అనగా పార్కింగ్ చేయబడిన కారులున్న చాలు అవి ఇన్‌స్పరైపోతాయి..కాని, అందుకే పెద్దలంతా వెర్సిటీ కాంపస్‌లు దగ్గర వుంటే మురిసిపోయి అక్కడికే పరుగులు (నడకే అనుకోండి-ఇది గుణ విశేషణం) తీస్తారు అన్నది జన వాక్యం. అందుకే-సులభ్-సదుపాయం ఏర్పాటు చేసిన మహనీయుడికి పదేజేజోహార్లు-వీలయినన్ని సులభలు ఉన్నన్ చాలు అంటారు పురజనులు-నెలవారీ టికెట్లు కొనుక్కుంటారు. ఆ మధ్య గవర్నమెంటు-్ధల్లీలోను బంగాలూరులోను కూడా పోష్‌హాల్సు మాల్స్ లాంటి రంగురంగు అద్దాల మందిరాల వున్న పోష్ వాష్రూమర్స్‌ని అత్యవసరంగా కావాలంటే-స్ర్తిలకు-పిల్లలకి ఉచితంగా (బహుశా ఆడపిల్లలకి) అనుమతించమన్నారు. బాగుంది. కానీ ‘మాలామాల్’ యజమాని ఒకరు అన్నాడు-గవర్నమెంటు ఆఫీసులా ఏమిటి? వాళ్లు ఒప్పుకోరా? అని రహస్యంగా...అదీసంగతి.
లెట్ దేర్ బి టాయ్లెట్స్ హియర్ దేర్-అండ్ ఎవ్విరివేర్!

veeraji.columnist@gmail.com