వీరాజీయం

హిందీ రుద్దుడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓసారి పూర్వరంగం చూద్దాం. 1950లో అనుకున్నారు రాజ్యాంగ నిర్ణేతలు- ‘దేవనాగరి లిపిలో రాసే హిందీ భాషను అధికార భాషగా వాడాలి’ అని. అయితే అది సాధ్యం కాదని తెలుసుకుని ఓ పదిహేనేళ్ల పాటు ఇంగ్లీషు భాష కూడా అధికార హోదా ‘ఎంజాయ్’ చేయాలన్నారు. కాని ఆ పప్పులు ఉడకలేదు. దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా ద్రవిడ భాషలవాళ్ల ‘ప్రొటెస్టు’ల వల్ల గవర్నమెంట్ 1963 అధికార భాషల చట్టం చేసింది. ఫలితంగా 1965 తర్వాత కూడా యింగ్లీషు హయాం కొనసాగింది. 1964లో దేశంలో హిందీ వ్యతిరేక హింసాత్మక జ్వాల కొనసాగింది. జవహర్‌లాల్ నెహ్రూ మద్రాసులోని సాల్ట్ కొటార్లు వద్ద బహిరంగ సభలో హిందీలో మాట్లాడాలని చూస్తే జనాలు రాళ్ళు రువ్వడం నేను ప్రత్యక్షంగా చూశాను. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులే కాదు, మహారాష్ట్ర, పంజాబ్, వెస్ట్ బెంగాలు, కర్నాటక, పుదుచ్చేరి, నాగాలాండ్, మిజోరాం వంటి రాష్ట్రాలు కూడా ఎదురుతిరిగాయి. దెబ్బకి 1967లో ఇంగ్లీషు భాష ‘వద్దు’ అని పార్లమెంటులో- దేశంలోని ప్రతిఒక్క రాష్ట్రం ‘‘మాకొద్దు రుూ ఆంగ్లభాష’’అని తీర్మానం చేసేదాకా ఇంగ్లీషు ‘‘లింక్’’ భాషగా కొనసాగాలని చట్టానికి సవరణ తెచ్చారు. ఇంగ్లీషు, హిందీ-రెండూ చట్టరీత్యా అధికార భాషలే. అది అట్లుండనిండు.
రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ ఇరవై రెండు భాషలని ఒకే మాదిరిగా ఆసనంపై కూర్చోబెట్టి సత్కరించింది. నిన్నగాక మొన్న కర్ణాటకలో హిందీ వ్యతిరేక జ్వాల మిన్నంటింది. రైలుబండ్ల మీద దాడిచేసి బోగీల మీద హిందీ అక్షరాలు చెరిపేస్తామన్నారు జనాలు. ఇవన్నీ మొన్నటి హిందీ దివస్ నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుర్తుపెట్టుకోలేదు. భాజాపాకి లోక్‌సభలో బండ మెజారిటీ ఉంది కనుక ‘‘మేరీ మర్జీ’’ (నాయిష్టం) అంటూ, ఏం మాట్లాడినా ‘‘చలేగా’’ అంటే నడుస్తుందని అనుకున్నాడు అమిత్ జీ! చరిత్ర పాఠాలు ఎంతటివాడికైనా అవసరం. తాను ‘బాద్‌షా’ని ‘సుల్తాన్’ని అనుకుంటే ఎట్లా? జనాలు త్రోసిరాజంటారు. ‘నీ ఆటకట్టు షా’ అంటారు. గుజరాతీ-సేఠ్ హిందీని తన నెత్తిన పెట్టుకుని దేశం మొత్తం మీద హిందీ ఒకటే భాష అంటూ దాన్ని రుద్దాలని బయలుదేరాడు. దానికి వత్తాసుగా మరో యిద్దరు గుజరాతీ మహానాయకులు, పుణ్యమూర్తులు, పూజ్యులు అయిన మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ పేర్లు బయటకు లాక్కొచ్చారు. ఆ మహనీయుల ‘కల’మాటేమిటో గాని ఈయన గారికి స్వప్న భంగమైంది.
గాంధీజీ అలనాడు భోగరాజు పట్ట్భా సీతారామయ్యను ‘తెలుగు నేర్పాలి భాయ్’ అని అడిగాడట! జవహర్‌లాల్ తెలుగు నేర్పించవయ్యా అన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర రాసిన భోగరాజు పట్ట్భాసీతారామయ్య ఆగాఖాన్ భవనం జైల్లో నెహ్రూకి తెలుగు నేర్పబోతూ వుంటే తెలుగుకి ‘‘అంత సీను’’వుందా? అంటూ సరదాగా వేళాకోళమాడేడుట పటేల్. భోగరాజువారేం తక్కువ తిన్నారు? అణాకాసు ఒకటి, రూపాయి కాసు ఒకటి తీశారుట. సర్దార్‌జీ చూడండి. ఒక అణా, ఒక రూపాయి అన్న తెలుగు అక్షరాలు. కాని వీటిమీద గుజరాతి వున్నట్లు లేదే? అన్నాడట నవ్వుతూ. అట్లాగా ఏ భాష గొప్పదనం దానిది. అది అలావున్నది కాబట్టే యివాళ మన దేశం యింత వైవిధ్యం, వైభవం గలది అయింది. అసలు నాగాలాండ్‌లో అధికార భాష యింగ్లీషు అంటే అమిత్‌జీకి కోపం వస్తుందేమో? హిందీ ‘దివస్’ ఓకే. మనకీ వుంది తెలుగు‘దివస్’. హిందీని గుజరాత్‌లో పెట్టమనండి, గుజరాత్ భాషకు బదులు హిందీ ఫర్మానాలు, హిందీ నామఫలకాలు మార్చమనండి అంటూ ఓ వీరాభిమాని వూగిపోతూ ఉంటే నేను అన్నాను- ‘అబ్బీ! ఇప్పుడేం జరిగింది? తెలుగువాడెక్కడున్నా హిందీ యిట్టే లోకల్ యాసతో మాట్లాడ్డం వస్తుంది. ఇంగ్లీషులో మాట్లాడితే ట్రాఫిక్‌రూల్స్ ప్రకారం ఫైన్‌వేస్తాం’ అని ఎవడూ అనలేదుగా. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్నట్లుగా అటు చూడుడు అటు పరికింపుడు. సాక్షాత్తు ‘యడ్డీ’ గారు అనగా భాజాపా ప్రముఖ నాయకులలో ముఖ్యుడు, ‘కర్నాటకం’ సూత్రధారి, ముఖ్యమంత్రి వర్యుడు- యడ్యూరప్ప నేరుగా పార్టీ బాస్ అయిన అమిత్‌జీకి ‘షా’గారూ.. మీరు అతి ‘షా’లలో పోతున్నారనట్టు మాట్లాడాడు. తన మనసులోని మాట బయటపెట్టానంటూ భాజాపా లీడర్‌కి ‘‘తెరచిరాజు’’చెప్పేశాడు.
యడ్యూరప్ప హిందీ కుదరదు, రాష్ట్రంలో కన్నడ భాష వాడకం యింకా ఎక్కువ చేస్తా అంటూ రెట్టించాడు. హిందీకీ వ్యతిరేకంగా మా రాష్ట్రంలోనేకాదు పార్లమెంట్‌లో కూడా గోల చేస్తాం జాగ్రత్త అన్నాడు తమిళ నాయకుడు స్టాలిన్. హిందీ సినిమాలలో నటించాను గనుక హిందీనీ మా రాష్ట్రంలో నెత్తిన పెట్టుకోను, తమిళం కోసం ఉద్యమం లేవదీస్తాము అన్నాడు కొత్తపార్టీ నాయకుడు కమల్‌హాసన్. అంతలో కేరళ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్- భాష పేరుతో మరో యుద్ధానికి సన్నద్ధం అవుతోందా సంఘ్ పరివార్? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా హిందీని ‘‘చస్తే మామీద రుద్దలేరు’’ వ్యతిరేకిస్తాం అంటూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి అయిన నారాయణస్వామితో గొంతు కలిపారు.
ఈశాన్య ప్రాంతంలో బెంగాల్‌లో అంతటా అమిత్‌షాకి నాయకులు చీవాట్లు పెట్టేస్తుంటే జనం మెటికలు విరుస్తున్నారు. ఇప్పుడేమి వచ్చింది? దేశంలో ‘ఫెడరల్’ విధానం రాష్ట్రాల మధ్యన పొంతన, సహకారం యివన్నీ ‘‘ భాష’’మూలంగా ఏమీ దెబ్బతినలేదుగా? దేశం మొత్తంమీద ‘‘ఒకటే టాక్సు, ఒకటే గుర్తింపుకార్డు’’ అన్నట్లుగా ఒకే భాష, ఒకే మతం అనడం ఎంత అవివేకమో? ఎంత దుందుడుకుతనమో? కింగ్ మేకర్ అమిత్‌షాకి నసాళానికి అంటేలాగా స్పష్టం అయిపోయింది. అదృష్టవశాత్తూ పార్లమెంట్ 1968లో చేసిన సవరణ చట్టంలో స్పష్టంగా వుంది. ప్రతీ రాష్ట్రం తన శాసనసభలో హిందీని ‘‘జాతీయ’’ (అధికార భాషగా అది యిప్పుడు బాగానే సాగుతున్నది.) భాషగా ఆమోదిస్తున్నాం అని ఆమోదముద్ర వెయ్యాలి లేదా ‘అంగ్రేజీ’ లింకు భాషగా చెలామణి అవుతుంది- అంతే.
ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. లోగడ వెస్ట్ పాకిస్థాన్- ఈస్ట్ పాకిస్తాన్ మీద బెంగాలీ భాషను రుద్దడానికి ప్రయత్నం చేసింది. ‘‘మతం’’ ఒకటైనా, పాకిస్థాన్‌ని ఈ భాషాభిమానమే రెండు ముక్కలుగా చేసింది. బంగ్లాదేశ్ అవతరించింది. జాగ్రత్తగా గమనించితే చరిత్రలో ఇలాంటి గుణపాఠాలు కనబడతాయి. ‘‘షా’’గారు హమేషా ఇటువంటి చరిత్రని గూడా గమనించాలి. ప్రస్తుతం అంతాబాగా నడుస్తూ వుంటే ఎందుకీ భాషా భేషజమ్.? ‘‘షా’’గారి ఇంగ్లీషు వ్యతిరేకత దేశంలో ఆంగ్ల లింకు భాషమీద జనాలకి మరింత వ్యామోహం పెంచుతుందేగాని హిందీమీద మోజు పెంచదు. ముందు యడ్యూరప్పని పిలిచి హిందీలో ప్రశ్నించమనండి. ఆయన కన్నడ భాషలో జవాబు చెప్పకపోతే ఒట్టు!
అమిత్‌జీ డోంట్ ట్రైటు ఓపెన్ ద ఫేన్‌డరాస్ బాక్స్

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512