వినమరుగైన

కార్యేషు రంభ - శయనేషు రొంప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అదుగో మళ్లీ డే అంటున్నావ్. ప్రేమికుల రోజనలేవు’’.
‘‘తప్పయిందండీ! ఇకనుంచి అచ్చ తెలుగులోనే అచ్చం తెలుగమ్మాయిలానే మాట్లాడతానండీ!’’
‘‘ఏ భాషలో మాట్లాడినా ఈ వారంలో సెలవివ్వడం జరగదు. ఇప్పటికే ఇద్దరు సెలవులో ఉన్నారు. ఈ పుట్టిన రోజుల్ని తిథి, వార, నక్షత్రాల్ని చూసుకొని చేసుకోవాలి గానీ, ఇంగ్లీషు తేదీలతో చేసుకుంటారా, మనం భారతీయులమన్న విషయాన్ని ప్రతి నిమిషం భరతనాట్యం చేస్తూ, తెలియజేయాల్సి వస్తోంది’’.
‘‘మీలాటివారుండటంవల్లే మన సంస్కృతీ సంప్రదాయాల్ని మర్చిపోకుండా మాలాంటి ఆధునిక యువతులం కూడా మడత నలగని చీరలు కడుతూ, నడత చెదరని జీవితాల్ని సాగిస్తున్నాం’’.
‘‘నన్ను బాగా అర్థం చేసుకొన్నావ్. అసలు నేను ఏ రైల్వే ఆఫీసర్నో అయ్యుంటే, వారం వర్జ్యం, రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం, గుళిక కాలం, గౌరీ పంచాంగం, నవగ్రహాల కదలికలూ వగైరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, రైల్వే టైం టేబిల్ తయారుచేసుండేవాణ్ణి. ఇప్పుడు చూస్తున్నాంగా పట్టాలు తప్పడాలు. రైళ్ళు పల్టీలు కొట్టడాలు. ప్రయాణమంటేనే ప్రజలు హడలిపోతున్నారు’’.
‘‘మీలాంటి అనుభవం వున్నవాళ్ళను, ఆమడదూరంలో వుంచుతున్నారు. ఈ దేశం చివరికేమైపోతుందో ఏమో! మీ పవిత్రమైన మనసుతో మరొక్కసారి ఆలోచించి సెలవిప్పిస్తే మా పెళ్లిరోజు ఘనంగా జరుపుకొంటాం. ఇది మా తొలి పెళ్లిరోజు. మావారు ఎంతో ముచ్చట పడుతున్నారు’’.
‘‘చూడమ్మా నేనీ పొగడ్తలకు పొంగిపోయేరకాన్నికాదు మీవారెంత ముచ్చటపడినా, నేను చేయగలిగిందేమీ లేదు. నాకు పనెక్కువై, చెమటలు పడుతున్నాయ్. వెళ్లి ఆ ఫైల్సు సంగతి చూడు’’ అంటూనే ఏదో గుర్తొచ్చినవాడిలా, కొన్ని పేపర్లు సూట్‌కేసులో సర్దుకొని బయటకు వెళ్లిపోయారు. ఏం చేయాలో పాలుక తన సీట్లోకెళ్లి కూర్చుందేగానీ, చేయాల్సిన పని పైన మనసు పోవడంలేదు. కొన్ని క్షణాల తరువాత వ్యానిటీ బ్యాగ్ తెరిచి, తన అంద చందాల్ని సరిచేసుకొని, ఏ ఫైలూ ముట్టకుండా, ఏ కీలూ కదపకుండా, ఏ కేసూ లేని వకీలులా, రిలాక్సుగా కూర్చొంది. ఇంతలో సెల్ మ్రోగింది. తీసింది.
‘‘హలో! కాంతి, ఓకేనా!’’
‘‘నీదంతా భ్రాంతి. ఏమిటి ఓకే!’’
‘‘ఏమైంది’’
‘‘మా బాస్ లీవ్ ఇవ్వలేదు’’
‘‘మ్యారేజ్ డేకు లీవ్ ఇవ్వని బాసూ ఓ బాసేనా. వాడిదీ ఓ భాషేనా. ప్రేమికులనూ, ప్రేమికుల రోజునూ ప్రేమించని హృదయమూ, ఓ హృదయమేనా. ప్రేమికుల రోజును ఆఫీసు పనికి దోచుకొనే పిసినారి. వాడికి ఏ నారీ లేదా. మ్యారేజి కాలేదా. మధ్యాహ్నం లంచికి ఏ క్యారేజీ రాదా. ప్రేమ పెళ్లా. పెటాకుల పెళ్లా, తాటాకుల పెళ్లా. టపాకాయల పెళ్లా. తలకాయలేని పెళ్లా. తలాడించిన పెళ్లా, తమలపాకుల పెళ్లా. విడాకుల పెళ్లా- లీవ్ అడగ్గానే మొహం వేల్లాడేసుకొన్నాడా’’
‘‘కూల్ డవున్.. డియర్ కామేష్ కూల్‌డవున్’’
‘‘ఏం కూల్ డవునో!.. ఆ ఫూల్ డన్ ఏం బాగాలేదు’’.
‘‘ఇలా చేస్తే ఎలా వుంటుంది’’
‘‘ఎలా’’
‘‘మీ బాస్ మేడమ్ నాలాంటి స్ర్తి కనుక, జాలీగా వుండటం, జాలిగా వుండడం తెలుసు గనుక. నీకు గ్యారంటీగా సెలవిస్తుంది గనుక, నాతో బాటే ఆఫీసుకొచ్చి నా ప్రక్కనే కూర్చుని, నా కళ్ళలోకి నువ్వు, నీ కళ్ళలోకి నేను చూసుకొంటూ, వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి’’.
‘‘ఏమిటి లాగి.. లాగి... నేను వాగి వాగి అలసిపోతున్నా! నీకెంటో అంతా ఎగతాళిగా వుంది. నేను నీకు తాళి కట్టి తెచ్చుకొన్నది. నీ చేత ఎగతాళి చేయించుకోడానికా’’.
‘‘నేను నీ చెయ్యి పట్టుకొని, నీ ఇంటికొచ్చింది వంటింట్లో తాళింపు వేయడానికీ, నువ్వన్నదానికల్లా తాళం వేయడానికా’’
‘‘నన్నో క్రాక్‌ను చేసి ట్రాక్ మార్చకు కాంతి. శాంతి చెదిరిపోతుంది. సరే నువ్వన్నట్లే నేనే లీవ్ తీసుకొని మీ ఆఫీసుకొచ్చి, చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరమూ! అంటూ మొదలెడితే ఈ సంగతి ఏ టీవీ వాళ్ళకన్నా తెలిసిందంటే, వాళ్ళంతా కెమెరాలతో మీ ఆఫీసుకొచ్చి లీవ్ దొరకని జంట, ఆఫీసులోనే వాళ్ళు పండిస్తున్న ప్రేమ పంట అని చిత్రించి ప్రసారాలు ప్రారంభిస్తారు. ఇది తెలిసిన మరికొన్ని ప్రేమజంటలు, మీ ఆఫీసు ముందు ధర్నాలు చేయడాలూ, మహిళా సంఘాల పోరాటాలు, రాళ్ళు రువ్వడాలూ, ముక్కులు పగలడాలూ, ఈ చిన్న విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి, కొందరు రాజకీయ ప్రయోజనాన్ని పొందడానికి, వాళ్ళ జనాన్ని పోగేసుకొచ్చి ఉద్రేక ప్రసంగాలు చేయడాలూ, వగైరా వగైరాలతో మనిద్దరం బిక్కమొగాలేసుకొని ఆ టీవీ వాళ్లకు ఇంటర్వ్యూలివ్వడాలు. ఇదంతా అవసరమంటావా’’
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

షణ్ముఖశ్రీ కథలు 8897853339