వినమరుగైన

సతీ ఉక్కుబాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీకెందుకండీ అత్తయ్యగారూ! ఆ శ్రమ. ఉండండి. నే చేస్తాగా!’’ అంటూ వచ్చి కూర్చొని, క్షణాల్లో ఆ పని పూర్తి చేసి, ఆ వెంటనే ఇడ్లీ తయారు చేసింది సక్కు. వాళ్లాయన కుక్కుటేశ్వరరావు కూడా లేచాక, అందరి కాలకృత్యాలు అయ్యాక, డైనింగ్ టేబిల్ దగ్గర చేరారు. ఇడ్లీలు నోట్లో పెట్టుకుంటే గులకరాళ్లలా వున్నయ్. ఏమంటే ఏం ప్రమాదమో అని, గట్టిగా కొరికి కొరికి తిన్నారు. కుక్కుటేశ్వరరావు ఆఫీసు కెళ్లాడు. ఇంటి పని ఇంత చకచకా చేస్తున్న ఇంత మంచి కోడల్ని పట్టుకొని తన మొగుడెందుకు అంత భయపెట్టాడో హనుమాయమ్మగారికి అర్థం కాలేదు. కొన్నాళ్లపాటు అలవాటయ్యేదాకా కొత్త కోడళ్లు చేసే చేష్టలూ, ఇడ్లీలూ, అన్నీ ఘట్టిగానే వుంటయ్. అన్ని కొంపల్లోనూ అంతే అనుకుంటూ ‘‘పిండి ఇంకాస్త నానినాక బాగా మెత్తగా వస్తయ్ సక్కు అయినా ఫరవాలేదులే’’ అంది సర్దుకుపోయే ధోరణిలో హనుమాయమ్మగారు.
‘‘ఇహ నుంచీ నేను చేసే పనంతా నానపెట్టే పనే అత్తయ్యగారూ మీరే చూస్తారుగా!’’ అంటూ తన గదిలోకి వెళ్లింది సక్కు. కోడలి భాష అర్థంకాక మూగదానిలా చూస్తుండిపోయారు హనుమాయమ్మగారు.
***
కుక్కుటేశ్వరరావు సక్కుబాయిని ఒక్క లుక్‌తో, తాళికట్టి తనదాన్ని చేసుకున్నాడు. మంచి లక్కయిన సంబంధం అని హయగ్రీవాచారిగారు, హనుమాయమ్మగార్లు ఆనందించారు. పేరు ఆనాటి సక్కుబాయిదే అయినా ప్రవర్తన మటుకు నేటితరం అమ్మాయిల్లానే వుంటుంది. తొలిరాత్రే కుక్కుటేశ్వరరావుకు తను తన బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎలా వుండేది. తను ఎలాంటి భర్తను కోరుకున్నదీ, ఇంకెన్నో విషయాల్ని విడమర్చి చెప్పింది. అన్నీ విన్న కుక్కుటేశ్వరరావు కిక్కురుమంటే వట్టు. కుక్కిన పేనులా, ఆమెను అక్కున చేర్చుకొని, లోలోపల వెక్కి వెక్కి ఏడుస్తూ పైకి మధ్య మధ్య పిచ్చికుక్కలా అరుస్తూ ఆ రాత్రంతా ఆనందించాడు. అయితే అసలు విషయం తెల్లారాక చెప్పింది. ఆ బాయ్ ఫ్రెండ్స్ అంతా బాబాయి వరుస వాళ్లనీ, వాళ్లంతా తనను డాటరులా చూసుకొనే వాళ్లనీ, తను స్వచ్ఛమైన వాటరు లాంటి దానిననీ, తనకు ఎవరన్నా ఏ విషయంలో నన్నా బాధ కలిగిస్తే మటుకు హీటర్‌గా మారుతాననీ, హిట్లర్‌లా ముఖాలు చిట్లగొడతాననీ, చెప్పింది. దాంతో కాస్త కుదుట పడ్డాడు కుక్కుటేశ్వరరావు. రాత్రి సక్కు ఇచ్చిన మాటల కిక్కు కొంచెం దిగింది. ఆనాటి నుంచీ తన తల్లితండ్రులు కోడలుతో ఎలా మసలుకోవాలో క్లాసు తీసుకున్నాడు. వాళ్లు అయిసు గడ్డల్లా బిగుసుకొని, కోతి ముఖాలేసుకొని, గడ్డం మీద చేతులేసుకొని, కోడలుతో ఎలా కోలాటం ఆడాలా అన్న ఆలోచనలో పడ్డారు.
***
ఓ రోజు సాయంత్రం చుట్టుపక్కల ఆడంగులంతా కొత్తగా కాపురానికొచ్చిన హనుమాయమ్మగారి కోడల్ని పలకరించాలని వచ్చారు.
‘‘సక్కూ!’’ అంటూ పిలిచారు హనుమాయమ్మగారు.
‘‘వస్తున్నానండీ అత్తయ్యగారూ! కాళ్లొత్తమంటారా కాకరకాయ కూర చెయ్యమంటారా. మామయ్యగారు ఇంకా వచ్చినట్లు లేదు. ఆ ట్రాఫీక్‌లో ఎక్కడ చిక్కుపడిపోయారో! ఫోను చెయ్యమంటారా, మీ అబ్బాయిగారు ఆలస్యంగా వస్తామన్నారండీ!’’ అంటూ గదిలోంచి బయటకు వస్తూనే గుక్కతిప్పుకోకుండా చదివింది.
‘‘ఆహా! ఏం వినయం. ఏం వినయం. హనుమాయమ్మ అదృష్టమే అదృష్టం.’’ అంటూ వచ్చిన ఆడవాళ్లంతా చెవులు కొరుక్కున్నారు.
‘‘మా కోడలు సక్కుబాయి. సాక్షాత్తు సతీ సక్కుబాయే. భగవంతుడు మాకు ప్రసాదించిన వరం. అత్తమామల పట్ల గౌరవం. పతియే ప్రత్యక్షదైవం. గుడికెళ్లినా ముందుగా భర్త పాదాలకు నమస్కారం చేసి, ఆ తరువాతే ఆ నమస్కారాన్ని భగవంతుని వైపు తిప్పుతుంది. ఇంక వంట సంగతంటారా! ఉప్పు కారాలు ఎవరిమటుకు, వాళ్లకే సరిపోయినట్లే అనిపిస్తాయ్. కోడలంటే నా కోడలే. ఈ కాలపు మోడల్ కాదు’’ కోడల్ని తెగ పొగిడింది.
‘‘నేనంటే మా అత్తయ్యగారికి ఎంత ప్రేమో చూశారుగా! ప్రేమతో వారలా అన్నారేగానీ, ఆ లక్షణాల్లో ఒక్కటి కూడా నా దగ్గర లేదు’’ అంది సక్కు.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

షణ్ముఖశ్రీ కథలు 8897853339