వినమరుగైన

ఫిరదౌసి -గుర్రం జాషువా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృభూమిక మరవని విశ్వమానవ దృష్టి. సంప్రదయ సంస్కారం వదలని ఆధునిక సృష్టి. ఆస్తికత్వాన్ని తిరస్కరించని హేతువాదం. ద్వేషపూరితం కాని ఆగ్రహ ప్రకటన అన్నీ కలిసి మహాకవి జాషువా.
కవితావస్తువులోను, రూపంలోను, సంప్రదాయ దృక్పథంగల కవులున్నారు. వస్తురూపాలు రెండింటిలోనూ ఆధునికత ప్రదర్శించిన కవులున్నారు. రూపంలో ప్రాచీనత, వస్తువులో ఆధునికత పాటించిన కవులున్నారు. ఈ మూడో వర్గంలో చేరతాడు జాషువా. ఒక వంక హేతువాదోద్యమం. మరోవంక భావకవితా ప్రభంజనం వీస్తున్న ఈ శతాబ్ది పూర్వభాగంలో కలం పట్టినవాడతను. అటువంటి సంక్లిష్ట సందర్భంలో వాదాల, ఉద్యమాల ఉరవడిలో అనుకరణప్రాయమైన కవితాస్రవంతిలో కొట్టుకుపోకుండా సర్వతంత్ర స్వతంత్రమైన, సృష్టితో తమ ప్రత్యేకతను నిలుపుకొన్న కవులు కొందరే. వాళ్లల్లో మొదట చెప్పదగినవాడు జాషువా.
జాషువా రచించిన లఘు కావ్యాల్లో గబ్బిలం, ముంతాజ్‌మహల్, ఫిరదౌసి సుప్రసిద్ధమైనవి. విశ్వనరుడ నేను అని ఒకచోట జాషువా చెప్పుకున్నాడు. అతనిలోని ఆ విశ్వమానవతా దృక్పథానికి ప్రతిఫలం ఫిరదౌసి కావ్యం. అది విషాదాంతం కరుణ రసాత్మకం.
క్రీస్తుశకం 11వ శతాబ్దిలో పర్షియా దేశపు రాజు గజనీ మహమ్మదు పద్దెనిమిదిసార్లు భారతదేశం మీద దండయాత్రలు చేశాడు. దోపిడీ చేసిన అపార ధనరాసులు దోచుకొని గజినీ పట్టణం చేరాడు. తన పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోవాలనుకున్నాడు. ‘పారశీ సుకవిశ్రేణీ శిరోభూషణం’ అయిన ఫిరదౌసిని రప్పించాడు. తరతరాల తన వంశచరిత్రను గొప్ప కావ్యంగా రచించమని కోరాడు. ఒక్కొక్క పద్దియంబున ఒక్కొక్క బంగారు రూకమొసగెదను కవీ’! అని వాగ్దానం చేశాడు. ఫిరదౌసి ముప్పయ్యేళ్లు శ్రమించి గజనీ వంశానికి చెందిన 16 మంది రాజుల చరిత్రను షానామా అనే మహాకావ్యంగా రచించాడు. 50వేల పద్యాల ఉద్గ్రంథం అది. అయితే రాజు ఆడిన మాట తప్పి 60వేల బంగారు నాణాలకు బదులుగా వెండి నాణాలు కవికి పంపించాడు. ఫిరదౌసి ఆశాభంగం పొంది, ఆ ధనం రాజుకు తిప్పి పంపించి, ఒకలేఖ నిందాపూర్వకంగా రాశాడు. అది చదివిన గజనీ కోపించి కవిని పట్టి చంపమని భటులకాజ్ఞాపించాడు. అది తెలిసిన ఫిరదౌసి బాధతో మసీదు గోడ మీద ఒక పద్యం రాసి భార్య, కుమార్తెతో గజనీ పట్టణం వదలిపెట్టి, స్వస్థలమైన తూసు పట్టణం చేరాడు. కొంతకాలానికి కనువిప్పు గలిగిన గజనీ మహమ్మదు మసీదు గోడ మీద ఫిరదౌసి రాసిన పద్యం కూడా చదివి ఎంతో విచారించాడు. వెంటనే 60వేల బంగారు నాణాలు ఒంటెల మీద ఫిరదౌసి కవికి పంపాడు. కాని అప్పటికే దుర్భర దారిద్య్రంతో పిరదౌసి మరణించాడు. తన తండ్రిని కష్టపెట్టిన ధనాన్ని కూతురు స్వీకరించలేదు. గజనీ మహమ్మదు పశ్చాత్తాపంలో కవి ఋణం తీర్చుకోడానికై తూసు పట్టణంలో ఒక సత్రశాల కట్టించాడు. కవికి కీర్తి రాజుకు అపకీర్తి నిలిచిపోయాయి. ఎక్కడో పర్షియా దేశంలో ఎన్నడో జరిగిపోయిన ఈ కథావస్తువును గ్రహించి తెలుగు పాఠకులకు ఆత్మీయంగా చేయగలిగాడు జాషువా.
పంచముఖుడైన కవిగా సామాజిక నిరాదరణతో ఎంతో వేదన అనుభవించాడు జాషువా. అట్టడుగు పేదరికాన్ని చవిచూశాడు. నిరుపేద అయిన ఫిరదౌసిదీ వేదనామయ జీవితమే. బహుశా ఈ సారూప్యమే ఆ కథావస్తువును గ్రహించేటట్టుచేసి వుండాలి. ఫిరదౌసి కావ్యం చదువుతుంటే ఫిరదౌసి, జాషువా ఇద్దరూ కలగలసిన ఒకే ఒక కవి స్వరూపం మన కళ్లముందు కదలాడుతుంది. ఫిరదౌసి వ్యక్తిత్వాన్ని ఆత్మీకరించుకున్నాడు జాషువా. నిజానికి ఇద్దరి ఆత్మా ఒక్కటే.
‘‘ఇంక విషాద గతములకే మిగిలెన్ రసహీనమై మషీ
పంకము నాకలమ్మున, నభాగ్యుడు నైతి; వయః పటుత్వమున్
గ్రుంకె, శరీరమం దలముకొన్నది వార్ధకభూత; మీనిరా
శాంకిత బాష్పముల్ ఫలములైనవి ముప్పది యేండ్ల సేవకున్’’
అని ఫిరదౌసి చేసిన ఆక్రోశం కేవలం పిరదౌసి దేనా? జాషువాది కూడా అన్పిస్తుంది. పిరదౌసి గజనీ మహమ్మదుకు రాసిన లేఖా సారాంశమంతా కవిగా జాషువాపడిన వేదనా సారాంశమే అన్పిస్తుంది. అయితే ఫిరదౌసి దౌర్భాగ్యానికి కేవలం గజనీ మహమ్మదే కారణమా అనే సందేహం తలెత్తక మానదు. కాసుకోసం కవిత్వాన్ని అమ్ముకోదలచిన ఫిరదౌసి దురాశ కూడా కొంతవరకు కారణమే. అందుకే తమ కత్తికి మనుషుల్ని ఆహారంగా వేసే రాతి గుండె సుల్తానులపై తన కవితాసుధ చిందించిన పాపం తనకు తగిలిందని ఫిరదౌసి తర్వాత గ్రహిస్తాడు.
స్వభావాన్నిబట్టి జాషువాది హృదయ ప్రధానమైన కవిత్వం. బుద్ధిప్రధానం కాదు. జాషువా ఉ్యౄఆజ్యశ్ఘ ఔ్యళఆ. మానవ భావావేశాల్ని అతను వ్యక్తీకరించినంత మృదువుగా, గాఢంగా వ్యక్తీకరించిన ఆధునిక కవులు తక్కువ. అతని కవిత్వం ఎంతో ఆర్ద్రంగా, ఆత్మీయంగా మన గుండె తలుపులు తెరచి లోపలికి ప్రవేశిస్తుంది. ఆ ఉధృతిని ఎవరూ అడ్డుకోలేరు. కావ్యంలో ఫిరదౌసి వేదన జాషువా వేదనగా, అంతిమంగా మన వేదనగా పర్యవసిస్తుంది.
ఆలోచనకు హేతువు నివ్వటం జాషువాకి తెలుసు. భావానికి లోతు నివ్వటం తెలుసు. అభివ్యక్తిని ఉన్నతీకరించటం తెలుసు. ఫిరదౌసి గజనీ పట్టణం వదలివెళ్తూ మసీదు గోడ మీద రాసిన వాక్యాలు, జాషువా మన గుండెలమీద రాసిన వాక్యాలే.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-పాపినేని శివశంకర్