వినమరుగైన

మహాప్రస్థానం -శ్రీశ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా తిరగబడి
నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి ఎగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు
ఆం! అంటూ

నెత్తురు కక్కుకుంటూ/ నేలకు రాలిపోయేదాకా
నిర్దాక్షిణ్యంగా వీరే..
కుట్రలు పన్నుతారు
అకాల మరణం కురిపిస్తారు
తొణికిన స్వప్నం తొలగిన స్వర్ణం
కూలిపోతుంది
యుగయుగాల దోపిడీలో తరతరాల చెరసాలలు, నిర్భాగ్యపు నీడలు పూలు లేని కాడలు- శాసనాల జాడలు, జాలిజార్చు గోడలు, నీడలు పొగమేడలు.
నిరుపేదల దీనావస్థను ఆత్మీయంగా అక్కున చేర్చుకుని అదృష్టవంతుల్ని నిలదీసిన ప్రశ్నోపనిషత్తు మహాప్రస్థానం.
అంతేలే పేదల గుండెలు-/ అశ్రువులే నిండిన కుండలు
శ్మశానమున శశికాంతులలో/ చలిబారిన వెలిరాబండలు-
ఏ దేశ చరిత్ర చూసినా/ ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం/ పరపీడన పరాయణత్వం
దేశ చరిత్రల గురించి ఇంత నిర్దుష్టంగా, ఇంత నిస్సంకోచంగా చెప్పిన కావ్యం మరొకటి కనిపించదు. చరిత్రను కవితాత్మకతలో బోనెక్కించిన కవిత మరొకటి కనిపించదు- చరిత్ర పాఠాలన్నీ చేదు నిజాలే- వాటిని కవితామయం చేసి మానవీయంగా సత్య సాక్షాత్కారం చేసిన నిష్ఠుర నిర్వేదం మహాప్రస్థానం.
బలవంతులు దుర్భలజాతిని/ బానిసలను కావించారు
నరహంతకులు ధరాధిపతులై/ చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి
కవిత్వం భావావేశమే కదా. సత్యావేశం కూడా- అలంకారికులు రస నిర్దేశంగానే సాహిత్యాన్ని పాలకవర్గానుకూలంగా చూశారు- కవిత్వం, బుద్ధి నైశిత్యం- కూడా ప్రజాస్వామ్య సంస్కృతిలో వివేచన నిర్మాణానికి మూలాధారం- ఆ దృష్ట్యా చరిత్ర జ్ఞానం చర్విత చర్వణం కాదు-
రణరంగం కాని చోటు
భూస్థలమంతా వెదికిన దొరకదు
‘‘ప్రపంచ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే’’ అన్న మార్క్సు వ్యాఖ్య మహాప్రస్థానంలో కవితాత్మకంగా మారింది-
గతమంతా తడిసెరక్తమున
కాకుంటే కన్నీళ్లుతో
మహాప్రస్థానం గతాన్ని చాలా మానవీయంగా బేరీజువేసి ప్రస్తుతాన్ని హెచ్చరించి భవిష్యత్తును భద్రపరచింది
ఒక వ్యక్తిని మరొక వ్యక్తీ/ ఒక జాతిని వేరొక జాతీ
పీడించే సాంఘిక ధర్మం/ ఇంకానా ఇకపై సాగదు-
‘‘కాలానికి కత్తుల వంతెన’’ కట్టిన దోపిడీయుగంలో సంఘటితపడిన పీడిత శక్తులతో మమేకం చెంది మహాప్రస్థానం విప్లయుగం పక్షాన నిలిచి ‘‘ఇంకానా ఇకపై సాగదు’’ అంటూ పీడక వర్గాన్ని హెచ్చరించింది. చారిత్ర విభాత సంధ్యలో మానవ కథా వికాసంతో సంఘీభావం పలికిన సాహిత్యం మహాప్రస్థానం. అది వెలుగుల ప్రస్థానం. అది సామాన్యుల స్వప్నాల దిగ్విజయం.

-సశేషం

--జ్వాలాముఖి