వినమరుగైన

కృష్ణపక్షము -కృష్ణశాస్ర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చివురులెత్తి పాడుకున్నారు. అంత గొప్ప వంశాన్ని పోషించిన రాజ పరంపరకు ప్రతినిధిగా నిలచిన సూర్యారావుకి తన ప్రథమ పుస్తకాన్ని అంకితం చేయడం ప్రశంసనీయమే. కాని జఠిల గ్రాంథికవాది అయిన శ్రీ సూర్యారావు, కృష్ణశాస్ర్తీ నవ్య కవితాంశువులను చూడలేకపోయాడు. అంకితమందలేదు. ఎవరినీ సత్కరించలేదు. పైగా కొద్దికాలం తర్వాత సంస్థానం ఇస్తూన్న గౌరవ మాసవేతనం కూడా ఆపుచేశాడు.
కృష్ణశాస్ర్తీ యావదాంధ్రలోనూ పర్యటనలు చేస్తున్నప్పుడు నల్లమల అరణ్యాల శోభ ఆయన్ని ఆకర్షించింది. నికృష్ట ఆచారాలతో మనిషిని అస్వతంత్రపాలు చేసిన సమాజ నిరసన కూడా నవ్య కవిత్వానికి ప్రాణమే. సమాజాన్ని విడిచి ప్రకృతిలో లీనం కావాలనే బలమైన కోరిక భావకవిత్వంలో ఆదినుంచీ ఉన్నదే. వర్డ్స్ వర్త్, కీట్సు కవులలో ఈ కోర్కె బలంగా కనిపిస్తుంది. షెల్లీ, బైరన్‌లలో పటాంతర్గత దీపకళికగా భాసిస్తూంటుంది. కృష్ణశాస్ర్తీ తన ప్రేరణా గీతంలో ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై ఈ అడవి దాగిపోనా అని ప్రశ్నించుకుంటారు. ఎటులైన ఆగిపోన అనడంలో అది ఎంత కష్టమైనా, దుస్సహమైనా ఈ అడవిలోనే ఆగిపోతే బాగుండును! అనే కోరికను వెల్లడిస్తుంది. తాను సర్వాత్మనా ప్రకృతిలో లీనం కావాలి. గల గలమంటూ వీచే గాలిలో కెరటంగా, జల జల పారే సెలపాటలో తేటగా అడవిలో ఆగిపోతే బాగుండును. ఈ కోరిక హర్థికమే. భౌతికంగా సాధ్యం కాదు. కాని కవి ఊహ బలవత్తరంగా తత్తరపాటు కలిగిస్తుంది. ఆకలి దప్పులను మరిచి, చింతల్నీ వంతల్నీ విడిచి ఇలా వెర్రిగా, ఒంటరిగా తిరిగితే ఎంత బావుణ్ణు? అది సాధ్యమా? కవితామ ఊహగా మధురమే.
కృష్ణశాస్ర్తీ ఆబల్యాదిగా జాతి స్వేచ్ఛాగానంలో ఊపిరి పీల్చుకున్నాడు. తిలక్ ఉద్గాటన విని పులకరించాడు. కులాల ఇరుకు గోడలు చీల్చి విశ్వమానవ మహోదయానికి అంజిలండు కనుకనే కృష్ణపక్షం వెలువడేవరకు స్వేచ్ఛాగానం అనే మాట అక్షరబద్ధం కాలేదు.
కృష్ణశాస్ర్తీ రచించిన స్వేచ్ఛాగానం రెండు భాగాలు. ఈ స్వేచ్ఛాగానంలో భౌతిక, తాత్త్విక స్వేచ్ఛకోసం కవి తపిస్తాడు. స్వేచ్ఛ చీకటి బంధాలను తెంచుకుంటుంది. పాషాణ కర్కశత్వాన్ని విసర్జిస్తుంది. మ్రోడు మోక చివురిస్తుంది. ఆ చర్యలకు సాక్ష్యంగా, ప్రేరణగా జగమునిండా స్వేచ్ఛాగానఝరులు నింపుతానంటాడు. తాను స్వేచ్ఛాగానం చేస్తే ‘క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య శృంఖలాలు తనంతట చెదిరిపోవ గగనతలములు మార్మోగగ’’ చిత్తమానందమయేటట్లు గానం చేస్తాడు. ఈ పాదాలలో మొదటిసారిగా దాస్య శృంఖలాలను పేర్కొన్నాడు. అవి క్రౌర్య, కౌటిల్యాల కల్పించినవన్నాడు. తాను గానంచేస్తే అవి చెదిరిపోక తప్పవన్నాడు. ఈ స్వేచ్ఛా ప్రియత్వంలో ఒక వ్యక్తి స్వేచ్ఛ, దేశ స్వేచ్ఛ, సామాజిక స్వేచ్ఛ సైతం ప్రతిబింబితమయ్యాయి. స్వేచ్ఛకై ప్రాణాలర్పించే వాళ్లు ఈశ్వరయోధులు. వారు యుగ యుగాలుగా అమరులై జాతికి ఆశీస్సులందిస్త్తున్నారు. వారి అమల జీవిత ఫలము ధన్యతను కాంచే విధంగా స్వేచ్ఛాగానం చేస్తారు. ఈ దేశవాసులకు కష్టాలూ, కడగండ్లూ ఎండలై భయం కలిగిస్తున్నాయి. వంతలు చీకట్లై కలవరపెడుతున్నాయి. ఈ దుశ్శక్తుల పెత్తనం నుంచి తనకు స్వేచ్ఛ కావాలి. కనుకనే స్వేచ్ఛాగానం చేస్తున్నాడు.
కృష్ణశాస్ర్తీలో ఒక రినయిజాన్స్ చైతన్యం అప్పటికే పూర్తిగా వికసించింది. ఫ్యూడల్ వ్యవస్థనూ, దాని పెత్తనాన్నీ ఆయన మనసారా ద్వేషించారు. భూస్వామ్య వ్యవస్థ మనకు మిగిల్చిన దురాచారాలను, బిడియాలనూ, మర్యాదలనూ ఖండించారు. అయితే పరిపూర్ణ స్వేచ్ఛకీ, యదార్థంలో నిశ్చితమయ్యే పరిమిత స్వేచ్ఛకీ ఉండే విభేదాన్ని తెలుసుకునే వయసు కానీ, వికసనం గానీ ఇంకా అబ్బలేదు. తన ఇచ్ఛ ఎలా సాగితే అలా ఆచరిస్తాననీ ఇతరులు నవ్వితే తనకు ఖాతరులేదని చెప్పుకోవడం స్వేచ్ఛగా పరిగణింపబడే అరాచకం! అయితే భూతల మానవ సమాజాన్ని విడచి మొయిలు దోనెలలో పయనించడం, మినె్నల్ల విహరించడం, మెరుపుగా మెరసిపోవడం, తెలిమబ్బు చాటున చెలి చందమామతో జతకూడడం వంటివన్నీ సమాజ నిరసననుంచి వచ్చిన ప్రకృతి ఆరాధననీ, విలీనతనీ వ్యక్తం చేస్తాయి. ప్రథమ ముద్రణలో నేను అనే శీర్షిక క్రింద ప్రచురితమయినది కూడా స్వేచ్ఛాగానంలోనిదే. అందులో మరింత స్పష్టంగా జమీందారీ విధానాన్ని కంఠోక్తిగా నిరసించాడు. జిలుగు వసనాలు, మణిమయ భూషణాలూ ధరించి రాజవీధుల్లో ఈ ప్రభు నాయకులు ఊరేగుతున్నారు. వాళ్ళు నిర్జీవ పాషాణ విగ్రహాలు, చిమ్మచీకట్లు పొగల్లా అలముకొన్న రాత్రివేళ క్షుద్ర మందిరాలలో తుప్పుద్రుళ్ళుతున్న గోడలమధ్య కళ్ళు మూసుకుని తమ వైభవానికి తామే పారవశ్యం పొందే దివాంధాలు, ఈ దివాంధ పద అక్షర నిర్మాణంలో దివాన్ పదాన్ని దాచారాయన. జమీందారీ ప్రభువును దివాణం అనీ, వారి మంత్రులను దివాన్‌లు అనీ అనడం గత శతాబ్దం నుంచీ వచ్చిన నాగరికత. చలువరాతి మేడలు వాళ్ళకు చెరసాలలు. తళుకు బంగరు ఆభరణాలు సంకెళ్ళు. కాని అజ్ఞానం లేని ఈ గర్విష్ఠులు లోకపాలకులని మురిసిపోయే బానిసీళ్ళు. వీళ్ళంతా కుటిల పన్నగ సదృశ్యులు. వాళ్ళు తన్ను శాసించలేరు. వాళ్ళపట్ల తనకు విధేయత లేదు. కనుకనే స్పష్టంగా తాను స్వేచ్ఛా కుమారుడనీ గగనపథ విహార విహంగపతిననీ, మోహన వినీల జలధరమూర్తిననీ చెప్పుతూ అవసరమైతే ఎలాంటి ప్రళయ ఝంఝా ప్రభంజనాలనైనా ప్రయోగించగలననీ హెచ్చరిస్తాడు. ఈ కవిత ప్రత్యక్షానుభవం నుంచి పరోక్షాభివ్యక్తిగా ఎదిగిన కళాఖండం. స్వాత్మక అనుభూతి నుంచి సార్వత్రిక అభివ్యక్తిగా పెరిగిన ఆగ్రహం!
ఆనాటి కవి చింతన, నిమగ్నత, భావుకతలు సామాజిక జీవితానికి భిన్నంగా ఉన్నాయి. తన జీవితం తనకు ఇలా ఎందుకున్నదా అని విడ్డూరం కలుగుతోంది. చల్లని వెనె్నల్లోనూ చిమ్మచీకట్లోనూ కూడా హృదయాన్ని నలిపే రోదన ధ్వనులు వినిపిస్తున్నాయి. చక్కనిదారిలో పోతూ కూడా వంకరగా నడవాలనిపిస్తోంది. కుమార్గాలు సక్రమ పథాలుగా అనిపిస్తున్నాయి. ఏమిటీ వ్యత్యాసం అనే ప్రశ్న ఆనాటి సార్వత్రిక ఆలోచనలనుంచి పుట్టిందే.
తేటి వలపు అనే కవిత ఏడు చంపకమాలలు కలిగినది. అన్నీ లకారప్రాసతో సాగుతాయి. ప్రతి పద్యంలోని చివరి పాదమూ కోమల జలజాత పత్రముల మాటున నేటికి దాగినాడవో అని ప్రశ్నిస్తూ ఈ పద్యాలు సాగుతాయి. చక్కని మల్లెపువ్వు హాయిగా వికసించి ప్రియునికోసం సంసిద్ధంగా ఉంది. ఆమెను పలకరించడు. తేనెలానడు. మధుపం ఎట సాగిపోతున్నాడు. ముఖ్యంగా కోమలమైన పద్మపత్రాల చాటున ఎందుకో దాగి ఉన్నాడు. దానే్న ప్రశ్నిస్తున్నాడు కవి.
-అయపోయంది
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-ఆవంత్స సోమసుందర్