వినమరుగైన

అమరకోశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

65, 66, 67 శ్లోకములు
ప్రచేతా వరుణఃపాషీ యాదసంపతి రప్పతి
శ్వసనః స్పర్శనో వాయుర్మాతరిశ్వా సదాగతిః
పృషాధ్వషో గంధ వాహన ‘నీలా’ శుగాః
సమీర మారుతం రుజ్జగ త్ప్రాణ సమీరణాః
సభస్వధాత పవన పవమానప్రభంజనాః
ప్రకంపనో మహావాతో యుఞ్ఘవాతః
ప్రచేత = తెలివి గలవాడు, అనుసరించేవాడు, ధ్రువుని వంశంలో వాడు వాయువుని, అగ్నిని సృష్టించినవాడు, వరుణుడు (బ్రహ్మ సృష్టించిన నవ బ్రహ్మలలో ఒకరైన ప్రచేత మహర్షి ఈ ప్రచేత ఒకరు కాదు) వరుణ =జల ప్రసాదించే దేవుడు, పాషీ= పాశం, వరుణుడు యొక్క ఆయుధం పాశం= యాదాసంపతిః= జలచరాములకు రాజు, వరుణుడు; అప్పాతిః = సముద్రం, వరుణుడు; ఇవి అన్నీ వరుణుని యొక్కవివిధమైన పేర్లు.
శ్వసన= గాలి యొక్క రాజు, వాయు; స్పర్శనః= స్పర్శ యొక్క రాజు, వాయుః వాయు=గాలి యొక్క రాజు; మాతరిశ్వాన్ = పిల్లగాలి, మలయా మారుతం, సదాగతిః= వాయువు, పృషాదష్వ = వర్షపు చినుకులు కలిగి పిచ్చికారీ చేసే కారుమబ్బులు, వాయువు యొక్క వాహనం ఐ గంధవః= కస్తూరి జింక యొక్క సువాసనను తీసుకెళ్తుంది. వాయువు, గంధవా= కస్తూరి జింక యొక్క పేరు; అనిల = స్థిరముగా ఉండనిది, వాయువు స్థిరముగా ఉండదు, ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ఆషుగ= వేగము, వాయువు, సమీర = వేగముగా వ్యాపించుట, వాయువు=మారుత = పీల్చే గాలి, వాయువు ; మరుత్ -ఎవరైతే గాలి ఆపి చంపుతారో, వాయువు (మరుత్తులు గాలి యొక్క దేవుళ్లు , కశ్యపుని భార్య ఐన దితి గర్భస్త పిండమును ఇంద్రుడు వజ్రాయుధంతో 49 ముక్కలుగా ఖండించినపుడు, ఆ పిండములు రోదించగా ఇంద్రుడు మరూఢ (మా= వద్దు, రూఢ= రోదించుట,0 అని గద్దించెను. అప్పటి నుంచి వారు మరుత్తులుగా పిలవబడుతున్నారు. వాయువు; పవమానః= =అన్నిటిని శుద్ధి చేసే గృహం లోని పవిత్ర అగ్ని, వాయువు, పవమానః= అన్నిటిని శుద్ధి చేస్తుంది. వాయువు , ప్రభంజనః= సుడిగాలి, వాయువు, ఇవి అన్నీ వాయువు పేర్లు.
ప్రకంపనః= ప్రచండమైన గాలులతో వర్షం, వాయువు, మహావాతః= తుఫాను గాలి, వాయువు, ఝఞవాతః= వడిగల తుఫాను గాలి, వాయువు, సౌవృత్తిక = సుడిగాలి గాలి, వాయువు,

68, 69 శ్లోకములు
ప్రాణోపానః సమానశ్చోదానవ్యానౌ చ వాయవః
శరీరస్తా ఇమే రంహస్తరసి తుర యః స్యదః
జనోథ శీఘ్రం త్వరితం లఘు క్షీప్రమరం ధ్రుతం
సత్వరం చపలం తూర్ణ మవిళంబిత మాషు చ
ప్రాణ= ప్రాణ వాయువు చాలాముఖ్యమైనది, అది శరీరంలో ప్రాధమిక శక్తి మరియు మిగిలిన 4 వాయువులకు మూలము, ఇది తల భాగం. కళ్లుఛాతీ ను ఆక్రమిస్తుంది. ఆపాన= అపాన వాయువు బొడ్డు చుట్టూ ఆక్రమిస్తుంది. సమాన = సమాన వాయువు బొడ్డు దగ్గర ఉన్న పొట్ట చుట్టూ ఆక్రమిస్తుంది. శరీరస్త ఇమే = ఇవి అన్నీ శరీరంలో ఉంటాయి , రంహాస్ = వేగంగా కదులుట, తరస్ = వేగవంతమైన గతి( నది దాటినప్పుడు) రయ= తొందరగా కదులుట (నీళ్లల్లో) స్యద= వేగం (కారు అన్నీ వివిధమైన విభాగాలలో కదలికల పేర్లు, శీఘ్రం, = తొందరగా; త్వరితం= తొందరగా ; లఘు= తొందరగా ; క్షిప్రం= తొందర; అరం= తొందర, ధృతం=తొందర, సత్వరం = వేగం;చపలం= తొందర; తుర్ణం= వేగవంతం, అవిళంబిత= అ+విళంబిత = కాదు+ నెమ్మదిగా = వేగంగా ఆషు= వేగం; ఇవి అన్న నడక , వంట, పరుగు అనే వివిధమైన విభాగాలలో పేర్లు.

ఇంకా ఉంది

తీగవరపు వనజ 7382762152