వినమరుగైన

కృష్ణపక్షము -కృష్ణశాస్ర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన, కనక, వస్తు వాహనాలు ఎలా వస్తాయో, ఎలా వెళతాయో! కొబ్బరికాయలో నీళ్ళ బాపతు అనుకున్నారు. వౌనంగా తారకం నవ్వి ఊరుకున్నారు.
‘‘పోనీ ఎంతవుతుందో నేనిస్తాను. కృష్ణశాస్ర్తీ కవితా సంపుటిని ప్రచురించమను’’ అన్నారు బ్రహ్మర్షి.
అలాగేనన్నారు తారకం. ఆ సమావేశం ముగిసింది. అప్పటికి కృష్ణశాస్ర్తీ రాజమండ్రిలో ఉపన్యాసానికి వెళ్లి ఉన్నారు. రాగానే తారకం కలుసుకున్నారు. గురుదేవులు చెప్పిన విషయం అందజేశారు.
కృష్ణశాస్ర్తీకి పౌరుషం వచ్చింది. ‘‘ఆయనేం ఇవ్వక్కర్లేదు. నేనే అచ్చువేస్తాను’’ అన్నాడు. వారి అన్నగారు శివశంకరశాస్ర్తీతో కలిసి అప్పటికే రాశిగా పడివున్న కవితల నుంచి మంచివి ఎన్నిక చేశారు. కవితా సంపుటికి పేరు ఆలోచించారు ఏకాంతంలో కృష్ణపక్షం అని పెట్టారు.
ఏమిటి కృష్ణపక్షం? శివశంకర్లు తర్జన భర్జనలో పడ్డారు. ఈ కావ్యంలో నాయకా నాయికలు లేరు. వారి పేర్లనిబట్టి ఈ కావ్యానికి ఈ పేరు రాలేదు. పోనీ విషయము కృష్ణపక్షమునకు చెందినది కాదు. ఇందలి అరవై ఖండకావ్యాల్ల కృష్ణపక్షమనే శీర్షిక కనిపించదు. కృష్ణపక్షాన్ని వర్ణించే కవిత కనపడదు. మరి ఈ కావ్యనామం ఎలా ఏర్పడింది? ‘‘రూపక ప్రాయమై సౌమ్యమైన సాంకేతిక నామం కావచ్చు. కవి కృష్ణశాస్ర్తీ కావడంవల్ల కవిత్వం విశేషభాగం కరుణ రసాత్మకం కావడంవల్ల బహుశా కృష్ణపక్షం అనే పేరు పెట్టి ఉంటారు’’ అన్నారు. నిజానికి ఈ అన్ని కారణాలకూ అవకాశం లేకపోలేదు. ఇవి ఏవీ కృష్ణశాస్ర్తీ ఉద్దేశించినవి కావు. తాను ప్రారంభించిన నాటినుంచి ఇకముందు తెలుగు కవిత్వం తన పక్షమై ప్రవర్థిల్లుతుంది అన్న ఆత్మవిశ్వాసంతో ఆయనీ పేరు పెట్టారు.
కవికి తన సమర్థత పట్ల అహంభావం ఉండి తీరుతుంది. ఈ అహమిక ఆత్మవిశ్వాసంగా ప్రకాశమవుతుంది. అంతవరకూ ఆరోగ్యదాయకమే. కానీ హద్దుమీరితే దురహంకారమవుతుంది. కనుక శీర్షిక విషయంలో ఆయన గోప్యంగానే ఉన్నారు. తదాదిగా ప్రయత్నించి గురుదేవుని ప్రేరణతో ప్రారంభించిన ఆ ప్రయత్నం 1925 నాటికి విజయవంతమైంది.
సాహితీ సమితి తెనాలివారి గ్రంథ పరంలో తొమ్మిదవ పుస్తకంగా వెలువడింది. సాహితీ సమితి నిర్వాహకులు శివశంకరులే. ఎవరి కవితా సంపుటికి వారే పెట్టుబడిదార్లు.
1925 మార్చిలో ప్రథమ ముద్రణ జరిగినట్లు నా వద్ద భద్రంగా ఉన్న ఆనాటి ప్రతి వెల్లడిస్తోంది. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ బి.ఏ అని గ్రంథకర్త నామం ముద్రితమయింది. వెంకట పదం లుప్తమయింది.
‘‘మహారాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దరు’వారికి అంకితమివ్వబడింది. శ్రీ సూర్యారావుకు బ్రిటీష్ ప్రభుత్వం వారు మహారాజ బిరుదు ప్రదానం చేసి మూడేళ్లయింది.
‘తావకీన, సభావన తరువితాన
శాఖి కల నిత్య నూతన స్వాదుగాన
జీవసారము కురియించి చివురులెత్త
పాడుకున్నారు మా కులస్వాములెల్ల’’
అని చెప్పుకుంటున్న మాట మాత్రం చారిత్రక వాస్తవం. ఈ రావు వంశం మూలపురుషుడు తెలుగు రాయణం నైజాం ప్రభువుకు అంగరక్షకుడిగా ఉండి, ఆపద్సమయంలో నైజాం ప్రభువును రక్షించాడు. ఆయనిచ్చిన వరం అనుసరించి పిఠాపురం ఎస్టేటు స్థాపించాడు. ఆయన 1602లోనే పట్ట్భాషేకం పొందుతూనే దేవులపల్లి వంశీయులయిన కవి పండితులను రావించి తన సంస్థానంలో నియమింపజేశారు. వారు కావ్యాలు రచించారు. ఆ మహావంశానికి కృష్ణశాస్ర్తీ ఆఖరివాడు. వారంతా రావూరి ఆస్థాన సభావన తరువితాన శాఖికలుగా నిత్యనూతనంగా స్వాదుగానం వినిపించారు. జీవసారం కురిపించారు.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-ఆవంత్స సోమసుందర్