వినమరుగైన

నా స్మృతి పథంలో ( ఆచంట జానకీరామ్ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి ప్రపంచ యుద్ధసమయంలో జానకిరాం చెన్నపట్నం చదువు మదనపల్లికి మారింది. డాక్టర్ కజిన్స్ ప్రిన్సిపాల్, కళాతపస్వి, అనిబిసెంట్ అరండేల్, జనరాజదాసలతో విలసిల్లే మదనపల్లి వాతావరణం, రవీంద్రనాథ్ ఠాగూర్‌కు ప్రత్యేక అభిమానం. టాగూర్ జనగణమన జాతీయగీతం స్వయంగా నేర్పారట.
హైకోర్టు జడ్జి టి.సదాశివ అయ్యర్ భగవద్గీత పాఠం చెప్పేవారట. మదనపల్లిలో జానకిరాం ఉన్నపుడే బెసెంట్ ఆహ్వానంమీద గాంధీజీ మదనపల్లి విచ్చేశారట. కజిన్స్- సౌందర్యానుభూతిని పొందటానికి అభిరుచి, పరిచయం. విలక్షణ అవసరమనేవారట. కజిన్స్ శాంతినికేతన్ నుండి వచ్చిన వారి నుండి చిత్రకళ అభ్యసించమని ప్రోత్సహించారు. 1921లో అడయార్‌లో జరిగిన వరల్డ్ కనె్వన్షన్‌లో ప్రపంచం నలుమూలల నుండి వచ్చినవారితో పరిచయం కలిగింది. ఒకవంక స్వాతంత్య్ర పోరాటం- అభిమానంతో బోధిం చే తెల్లదొరలు - అడయార్ వాతావరణం, ఆంధ్ర భాషాభిమానం, ఆంగ్లంలో గాఢ పరిచయం, భావ కవిత్వంలోని ఊహా వైచిత్రి జానకిరాంకు స్వీయ కవిత్వాన్ని తీర్చిదిద్దుకునే వాతావరణం సృష్టించాయి.ఇఫ్ వింటర్ కమ్స్ అనే హచ్చిన్‌సన్‌లో మార్క్‌సాబర్ తనలో అనుకునే నోవా బ్రోక్‌ది కప్ వాక్యం చుట్టూ అల్లుకున్న గాఢమైన ఇతివృత్తం జానకిరాం రచనలమీద ఉండసాగింది. స్వల్ప విషయాన్ని గురించి గది తలుపు దభాలన బాది వెళ్లిపోతుంది. ఆ అదురుకు చిలకకొయ్యనున్న పింగాణీ కప్పు క్రిందపడి వేయి ముక్కలవుతుంది. సాబర్ కోరుకున్న ఆమెతో వివాహం జరగలేదు. మరొకరిని వివాహం చేసుకుంటాడు. నిత్య జీవితంలో రేగిన అసంఖ్యాక కల్లోలాల నేపథ్యం ఈ ఒక్క వాక్యం స్ఫురింపజేస్తుంది. 1923 నాటికి రసాయన శాస్త్రంలో బిఎస్‌సి పూర్తిచేసి పరిశోధనకు విజయనగరం వెళ్తున్న జానకిరాంకు తండ్రి లక్ష్మీపతిగారి ఉత్తరం
జరయు మృతియు లేని జనునట్లు ప్రాజ్ఞుండు
ధనము విద్య గూర్ప దలపవలయు
ధర్మ మాచరింపదగు మృత్యుచే తల
పట్టి ఈడ్వబడిన వాని వోలె
ఇంతటితో నీవు పరీక్షలకు చదువవలసిన అవసరం తీరింది. ఇక తీరమే లేని జ్ఞాన సంపాదన అనే మహాసముద్రం నీ ఎదుట ఉంది. ఎడతెగని కృషి చేసి నీవు ఆర్జింపగల జ్ఞానానికి అంతులేదని వ్రాశారట- జానకిరాం పరిశోధనలో కంటే సాహిత్యంలో కృషి చేయసాగారు.
కురియుమురా కన్నీటిని
మరి మరి విలపింపురా
సరము గూర్చి పరమేశుడే- దాల్చునురా
పంక్తుల ద్వారా కృష్ణశాస్ర్తీతో ముఖాముఖి పరిచయం, పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు రచించిన కవితా సామగ్రి పద్యాలు, తెలికిచెర్ల వెంకటరత్నం వినిపించడం, వెంకటరత్నం తల్లావఝుల శివశంకర శాస్ర్తీ ఊరూరా తిరిగి నవ్య సాహిత్యం గురించి చెప్పడం.
వ్యవహారిక భాషా ఉద్యమం, వేంకట పార్వతీశ్వర కవుల ఏకాంత సేవ, అబ్బూరి కాపుపాట, లోకముతో మనకేటికి లోలాక్షి రా పోదము అనే బసవరాజు అప్పారావు గీతం- ఒక అపూర్వ సాహితీ పరిమళం జానకిరాంను చుట్టివేసింది.
ఇంకా ఉంది
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

కొమ్మన రాధాకృష్ణారావు