వినమరుగైన

అనుభవాలూ - జ్ఞాపకాలూను( శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదొక అంధకారయుగం. కాదు కొత్త వెలుతురు ప్రసరిస్తన్న కాలం. మన సమాజం అజ్ఞానంలో, అవిద్యలో కునారిల్లుతున్న దశ. కాదు కాదు కొత్త విజ్ఞాన సంపద విస్తరిల్లుతున్న యుగం. ఆ వైజ్ఞానిక మూఢ విశ్వాసాలు గుర్రపు డెక్కవలె వ్యాపించి జాతిని నిర్వీర్యం చేస్తున్న రోజులు. కాదు కాదు దుష్ట సంప్రదాయాలకు, వ్ఢ్యౌనికి వ్యతిరేకంగా యువతరం పోరాటం సాగిస్తున్న రోజులు. అది ఒక యుగ సంధి. అప్పటికి సర్వ రక్షాకర చక్ర స్వాములుగా బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, కాంగ్రెస్, సోషలిజం, కమ్యూనిజం.. ఇన్ని ఉద్యమాలు వచ్చాయి. ఏదీ దేన్నీ సాధించలేదు. ఏదీ మనలో నాగరికతను పెంచలేదు. ప్రతి గుండెలోనూ ‘లాలస’ పెరిగింది. స్ర్తి దాహం, పదవీ దాహం, ధనదాహం పెరిగాయి. ఇవన్నీ నిలిచేవికావని ప్రతివారూ అంటారు పైకి కాని అందరికీ అవే కావాలి. చిత్తశుద్ధి, రసికతలేని జీవనం. ఈ విలువలు లేని నాగరికతను ప్రబలకుండా అరికట్టేందుకు- కనీసం కొంతమేరకైనా ఇలాంటి రచనలు అవసరం అంటారు జరుక్ శాస్ర్తీ.
శ్రీపాదవారి చుట్టూ యజ్ఞాలు, క్రతువులు, జ్యోతిషాది శాస్త్రాలు, మంత్ర తంత్ర ఘోషలు, దేవ భాషా ప్రాగల్భ్యమూ, దేశ భాషా నిరసనమూ- ఇదీ వాతావరణం. తెలుగంటే చిన్నచూపు. సంస్కృతం సొంత బిడ్డ, తెలుగు సవతి బిడ్డ. అట్టి సమయంలో తెలుగు భాషే అని అహమహమికతో తెలుగు వాడుక భాషా సరస్వతిని ఆరాధించిన మహోన్నత సాహితీమూర్తి శ్రీపాద.
అనుభవాలు - జ్ఞ్ఞాపకాలూను ఆనాటి నవోదయ పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడిన శ్రీపాదవారి యదార్థ జీవిత దృశ్యమాలిక. దాని సంపాదకులు శ్రీ నీలంరాజు వేంకట శేషయ్యగారు అభ్యర్థించగా శ్రీపాదవారు సమ్మతించి తమ జీవితానుభవాలను ఆబాల్య మరణ పర్యంతం అత్యంత నిజాయితీగా చెప్పుకొచ్చారు. ఆత్మకథ నిజానికి ఒక విదేశీ సాహిత్య ప్రక్రియ. నవయుగాంధ్ర వైతాళికులు కందుకూరి వీరేశలింగం గారిదే తెలుగులో మొదటి ఆత్మకథ. ఇందులో ప్రధానంగా ఉండవలసిన జీవలక్షణం సత్యనిష్ట ఏ గాంధీ వంటి మహోన్నత వ్యక్తులో తప్ప తమను తాము కించపరుచుకునే విధంగా కేవల నిష్ఠుర సత్యాలను, తమ పేదరికాన్ని, లోపాలను బట్టబయలు చేయరు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
ఇంకా ఉంది

పెద్ద్భిట్ల సుబ్బరామయ్య