వినమరుగైన

అనుభవాలూ - జ్ఞాపకాలూను( శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్రం నదీనదాలవలె శుష్కించదు. దాని జలబలం జవసత్వాలు తగ్గవు. అలాగే శ్రీపాదవారి సాహిత్యం తెలుగువాడున్నంతకాలం, తెలుగు ఉన్నంతకాలం నిత్య పఠనీయమై నిత్య నూతనమై జీవించి ఉంటుంది. తరాలుగా తెలుగువారి ఇంట వాడుక భాషలోని గడుసుదనాన్ని వినిపించిన అమేయ ప్రతిభాశాలి. పుంభావ సరస్వతి.. శ్రీపాదవారు.
ఆయన కలంనుండి జాలువారిన అనేకకానేక రమణీయ కథలు నవలికలు సంగతి అటుంచి ఆనాడాయన ఆధ్వర్యంలో నడిచిన ప్రబుద్ధాంధ్ర పత్రిక ఆయన విశ్వాసాలకు, జీవలక్షణానికి ఆ భావాల ప్రచారానికి గొప్ప సాధనంగా పనిచేసింది. ఇరవయ్యవ శతాబ్దం పూర్వార్థంలో వచన రచనా ప్రియులైన రచయితలకు ఆలంబనంగా, వేదికగా నిలిచింది.
ఇంత అఖండ అక్షర సముదాయాన్ని, సాహిత్యాన్ని అందించిన శ్రీపాదవారు రచించినవన్నీ ఒక ఎత్తు. ఆయనగారి ఆత్మకథాత్మక రచన అనభవాలు- జ్ఞాపకాలూను ఒక ఎత్తు. ఈ వరిష్ట రచనను గురించి ఎంతో ముచ్చటించుకోవలసి ఉంది. ఈ శతాబ్దకాలంలో వెలువడిన అపార గ్రంథ సముదాయంలో అనర్ఘ రత్నాలవంటి ఏ వంద రచనలో, లేక అర్థశతమో, లేక ఏ పాతిక గ్రంథాలనో ఎన్నుకోవలసి వస్తేవాటిలో తప్పనిసరిగా, ఏ కోణం నుంచి చూసినా, లేక ఏ ప్రమాణాలననుసరించి అయినా మొదటి వరుసలోనే అత్యంత గౌరవనీయమైన స్థానం సంపాదించుకోగలిగిన ఉత్తమ రచన ఇది.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
ఇంకా ఉంది