వినమరుగైన

అనుభవాలూ - జ్ఞాపకాలూను( శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడే కళ్లు తెరిచి కిలారించే పసికూన వంటి ఆధునిక తెలుగు కథా శిశువును క్షీరమందించి లాలించి పాలించి జవసత్వాలిచ్చి పోషించిన మహా సాహిమూర్తి ‘ఉత్తమకథాకథన శిల్పి.. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు’’. పసితనంలోనే అలవడిన ఆ అమృతధార సేవించి తెలుగు కథా శిశువు సర్వాంగసుందరంగా పెరిగి నేటికి కళ్లు మిరుమిట్లు గొలిపే సొబగులు సంతరించుకుని ఇతర సాహిత్య ప్రక్రియలలో రాణిగా రాణిస్తున్నది. గురజాడ చేతి చలువతో ఆధునిక కథాబీజం నవనవలాడుతూ మొలకెత్తి తరువాతికాలంలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ, వేటూరి శివరామశాస్ర్తీ, చింతా దీక్షితులు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు ఇంకా ఎందరో వచన రచనా ధురీణులు తమ అక్షరనీరాన్ని ధారపోయగా శాఖోపశాఖలుగా విస్తరిల్లి నేటి సర్వాంగీణ సుందర రూపాన్ని ప్రదర్శిస్తున్నది. కవిత్వం- కవిత్వంతో ముడిపడిన అవధానాది విద్యలు- విజృంభించి సాహిత్య లోకాన్ని పరిపాలిస్తున్న కాలంలో శ్రీపాదవారు మహాపండితులై ఛందోవ్యాకరణాదిగా అనేక లక్షణ గ్రంథాలను ఔపోసన పట్టిన ప్రతిభామూర్తి అయి వుండిన్నీ కేవల వచన సరస్వతి మాత్రమే నాకు ఉపాదేయం అని పట్టుబట్టి కేవల కథారచనకే తమ సర్వస్వాన్ని అర్పించి తెలుగు కథానిక పట్ల పఠితలోకంలో అపారమైన సుస్థిరమైన గౌరవాన్ని సంపాదించి పెట్టారు. కథకులలో గౌరీశంకర శిఖర సదృశుడు. అసదృశ సాహితీమూర్తి, సాహిత్య మహాబలుడు శ్రీపాద.
భారతదేశం అందునా ఆంధ్రదేశం అనేకానేక భావ సంఘర్షణలకు ఆలవాలమై ఒక విధంగా అల్లకల్లోలంగా వున్న సమయంలో శ్రీపాదవారు నిర్వహించిన అక్షరపాత్ర విశిష్టమైనది. గ్రాంథిక వ్యవహారిక భాషావాదుల మధ్య, సంప్రదాయవాదుల, సంఘర్షణవాదుల మధ్య, అక్షరాలా అక్షర యుద్ధాలు జరుగుతూ వుండిన కాలమది. ఆ సమయంలో వ్యావహారిక భాషావాదుల పక్షం వహించి ఆ వాదాన్న భుజాన వేసుకన్న శ్రీపాదవారు వాడుక భాషలోని అందాలను సొబగును అంతకుముందెన్నడూ ఎవ్వరూ, ఆ తర్వాత ఎన్నడూ మరెవ్వరూ ప్రదర్శించనంతగా ప్రదర్శించారు.
వారు సృష్టించిన కథా సాహిత్యం ఒక ఆటుపోట్లులేని తీపి నీటి ప్రశాంత మహాసాగరం వంటిది.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకాఉంది

పెద్ద్భిట్ల సుబ్బరామయ్య