వినమరుగైన

సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( ఆరుద్ర)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు వంటివారిలో ఈ వైవిధ్యాన్ని గమనించవచ్చు. అదట్లా ఉంచి; అసలు వివిధ ప్రక్రియల ఉద్యమ విధానం ఏమిటి? ప్రక్రియలు ఏ విధంగా ఎందుకు ఉంటాయి. వాటి ఉద్యమానికీ, వైవిధ్యానికీ కారణాలేమిటి? ఉదాహరణకు శతక ప్రక్రియ రూపొందటానికి మూలమేమిటి? సంస్కృతం నుంచి వచ్చింది అని చేతులు దులుపుకోవటమేనా? తెలుగులో సంస్కృతానికి భిన్నంగా నాల్గవ పాదాంతాన సంబోధనగా మకుటం ఎందుకు నిర్థారింపబడింది? సంస్కృతానికి భిన్నంగా కావ్యరచనలో పద్య వైవిధ్యాన్ని ఆదరించి నిర్థారించిన తెలుగు శతక రచనలో ఈ వైవిధ్యాన్ని ఎందుకు అంగీకరించలేదు? ఉదాహరణకు ఆధునికంగా నాయని సుబ్బారావుగారు వేదనా వాసుదేవం పేర రచించిన శతకంలో మకుట నియమాన్నిగానీ, ఏకవిధ పద్యత్వాన్నీ పాటించలేదు. అట్లాంటి రచనను శతకంగా మన్నించవచ్చునా? లేదా ఆ పాటించకపోవటానికి కారణాలేమయినా ఉన్నాయా? ఈ విధంగా కవుల ప్రవృత్తిని బట్టీ, ప్రక్రియా వైవిధ్యాన్ని బట్టీ రకరకాల సమస్యలు అనేకంగా సాహిత్య చరిత్ర రచనాకారుని ముందు పరిష్కారం కోసం ఎదురుచూస్తూ ఉంటాయి.
వీటన్నింటితోపాటు ఆలోచించవలసిన ఒక ప్రధానాంశం సాహిత్య పరిణామక్రమానికి అంతర గతితర్కం ఏమయినా ఉంటుందా? కేవలం బాహ్యమైన రాజకీయ పరిణామక్రమానికి చెందిన గతితర్కమే ఉపయోగిస్తుందా? ఈ అంశాన్ని ఎట్లా నిర్థారించటం? ఎట్లా సమన్వయించటం? అసలు ఈ సమన్వయాన్ని దాని స్వరూప స్వభావాలనూ, విధానాన్నీ నిరూపించటం సాహిత్య చరిత్ర రచనలో ఎంతవరకు అవసరం? ఏ విధంగా అవసరం? అయితే- ఈ విధమైన సమస్యల వలయంలో పడితే బయటపడటం అంత సులభం కానీ, తొందరలో, హడావుడిలో గానీ జరిగేది కాదు. అందుకనే ఆరుద్రగారు తమకు పూర్వం సాహిత్య చరిత్ర రచనా కృషి చేసిన అనేకమంది మహానుభావులను మనవి మాటలలో సంస్మరించి, చివరకు ఈ అమూల్య రచనలన్నింటినీ నా దృక్పథంలో సమన్వయం చేయడానికి ఈ రచనలో ప్రయత్నించానన్నారు. తమ దృక్పథమంటే, మార్క్సిస్టు దృక్పథం భూమికగా ఆరుద్రగారి ఈ రచన ఎంతవరకు సాగిందనేది ప్రత్యేకంగా విశే్లషించి చూడవలసిన అవసరం ఉండనే ఉన్నది. ఈ అంశాన్ని ఇంతవరకు అంతగా విమర్శకులు పరిశీలించిన జాడ కన్పించదు. అందుకు కారణం బహుశః మార్క్సిస్టు దృక్పథం భూమికగా తాను సమగ్రాంధ్ర సాహిత్య రచన నిర్వహిస్తున్నట్టు ఆరుద్రగారు స్పష్టంగా చెప్పుకోకపోవటమే ఒక కారణం కావచ్చు.

నిజానికి ఆరుద్రగారు ఈ రచన నిర్వహించింది సామాన్య పాఠకులను రకరకాలయిన సమస్యల చర్చల చికాకుల్లో పడద్రోయటం కాదు. ఈ సందర్భంగా సమగ్రాంధ్ర సాహిత్యం తొలి ముద్రణ నిర్వహించిన ఎమెస్కోవారు మా ఉద్దేశం అంటూ చెప్పిన మాటలు గమనించవచ్చు. ‘సాహిత్యాభిలాష గల సాధారణ పాఠకులు ఆంధ్ర సాహిత్యం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే, వాళ్లకు ఉపయోగించే పుస్తకాలు నేడు అందుబాటులో లేవు. నన్నయభట్టునుండి చిన్నయసూరి దాకా, ఆంధ్ర సాహిత్యం అనేక విధాలుగా, బహుముఖాలుగా సాగింది. ప్రజ్ఞావంతులయిన తెలుగు కవులు రచించిన గ్రంథాలు అన్నింటికి అన్నీ అచ్చుపడి వెలుగు చూడలేదు. లభించిన పుస్తకాలయినా అన్నీ సాధారణ పాఠకులకు బోధపడే వివరణలతో లేవు. ఈ కొరతను తొలగించవలసిన బాధ్యత నేటి ప్రకాశకులపై వుంది. ఈ అవసబోధంతోనే మేము అనిదం పూర్వమయిన ఈ సాహిత్య సేవకు సమకట్టాము’’ అన్నారు. ఈ అనటంలో నన్నయభట్టు నుండి చిన్నయసూరి దాకా అని చిన్నయసూరిని చివరి హద్దుగా ఎందుకు భావించారో స్పష్టపడదు.

సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కోవెల సంపత్కుమారాచార్య