వినమరుగైన

కృష్ణపక్షము -కృష్ణశాస్ర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

20వ శతాబ్ది ప్రారంభ దశలో ఉజ్వల కవిత్వమేదీ రాలేదు. 1909లో గురజాడ అప్పారావు కన్యాశుల్కాన్ని సమగ్రంగా పునర్నిర్మాణం చేసి ద్వితీయ ముద్రణ ప్రచురించారు. అది ఆంధ్ర జాతికి మహోజ్వల నాటకమై సర్వతోముఖంగా జీవిత వాస్తవికతకు ప్రతిబింబించింది. జాతికి మహత్తర బహుకృతిగా భాసించింది. అది మాత్రమే గురజాడ సాహిత్య ప్రతినిధిగా మిగిలితే గొప్ప నాటక కర్తగానే కీర్తించేవాళ్ళం. మహాకవి అనడానికి నిరాకరించేవాళ్ళం. మరెప్పుడో రాసిన సుభద్ర ఆధునిక కవితగా ప్రతినిధిగా నిలబడదు. అదృష్టవశాత్తూ 1910 నుంచి గురజాడ ముత్యాల సరాలు రచించనారంభించారు. అయ్యంకి వెంకటరమణయ్య బెజవాడ నుండి నడిపిన ఆంధ్ర జాతిలో ప్రచురించ నారంభించారు. దేశభక్తీ లంగరెత్తుము, కన్యక, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, లవణరాజుకల, డామన్ పిథియస్ వంటి కవితలన్నీ వరసగా ప్రచురించారు.
ఈ శతాబ్ది ఆరంభంలో మహత్తర విపత్తు 1915లో సంభవించింది. అది గురజాడ అకాల మరణం! అంతవరకూ వారు ప్రచురించిన కవితలు ఆధునిక కవిత్వానికి ప్రేరణ శక్తులుగా అందాయి. కవులు నూతనోత్సాహం పొందారు. వెనువెంటనే బసవరాజు అప్పారావు గీతిని కవితావాహికగా రూపొందించుకున్నారు. దైనందిన జీవితానికి తన కవితను సమాంతరంగా అభివ్యక్తిగా పూన్చుకున్నారు. గురజాడకి మానసపుత్రులుగా నవీన సంప్రదాయాన్ని అందుకున్నారు.
1916లో అబ్బూరి రామకృష్ణారావుగారు ఊహాగానము, మల్లికాంబ ప్రచురించారు. రాయప్రోలు సుబ్బారావు తృణకంకణము, స్నేహలతాదేవి మున్నగు లఘు కథన కావ్యాలు నవ్యతా స్ఫురణతో ప్రచురించారు. నాయికా, నాయకుల వీర శృంగారానికి స్వస్తి చెప్పారు. అదే సంవత్సరం విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి అనే పద్య కావ్యాన్ని ప్రచురించారు. భావకవిత్వానికి పూర్వవైభవ సంస్మరణం కూడా ఒక అంగమే. తదాదిగా విశ్వనాథవారి శశిదూతము, శృంగారవీధి, గిరికుమారుని ప్రణయగీతాలు, ఆంధ్రపౌరుషము వరుసగా ప్రచురించారు.
1917లో ప్రచండ మారుతవేగంతో తెలుగుదేశాన్ని కదిపిన యెంకి పాటలు నండూరి సుబ్బారావు ప్రచురించారు. 1916 నుంచి కృష్ణశాస్ర్తీ భావకవిగా గజ్జె కట్టారు. ఆంధ్రదేశం నలుమూలలా పర్యటించారు. సోదర కవుల పద్యాలూ, గీతాలూ గానం చేశారు. తన కవితలూ వినిపించారు. తామాశిస్తున్న కవిత్వం ఇదేననీ, పాత బండ కవిత్వానికి ఉద్వాసన చెబుతున్నామనీ నిర్భయంగా ఉద్ఘాటించారు. అష్టావధానాల కష్ట పరంపరలకు మళ్లీ లేవకుండా నడుం విరగొట్టారు.
1919లో రెండో విపత్తు జరిగింది. 5 నెలలు గడవకుండానే యుగపురుషుడు వీరేశలింగం కన్ను మూశారు. బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం గారు నవ్య మానవీయ మతానికి గురువుగా, ప్రవక్తగా ప్రజలనాకర్షిస్తున్నారు. ప్రార్థనా సమావేశాలలో కృష్ణశాస్ర్తీ రచించి గానం చేస్తున్న ఏకేశ్వరోపాసన గీతాలను వింటున్నారు. కవిత్వంలో కొత్త సొగసులను రచిస్తున్నారు.
ఒకనాటి సాయంత్రం ప్రార్థనా సమావేశం; కృష్ణశాస్ర్తీ రాలేదు. సమావేశానంతరం తారకంను పిలిచి అడిగారు. ‘అవునూ, మన కృష్ణశాస్ర్తీ తన కవిత సంపుటిని ప్రచురించడేమీ?’
‘కృష్ణశాస్ర్తీ దగ్గర ప్రస్తుతం డబ్బు లేదట!’ అన్నారు తారకంగారు.
‘‘అదేమయ్యా వెయ్యి తులాల బంగారం ఏమైపోయింది?’’
అది గురువుగారు అడగవలసిన ప్రశ్న కాదు, తాను చెప్పవలసిన అవసరమూ లేదు.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-ఆవంత్స సోమసుందర్